RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

పూలు గుసగుసలాడేనని | Poolu Gusagusaladenani | Song Lyrics | Srivaru Mavaru (1973)

పూలు గుసగుసలాడేనని 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం :  ఎస్ పి బాలు,


పల్లవి :


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. హా....


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా....

లాలలలల లాలల... 

లలలాలలల..

లాలలలల లాలల... 

లలలాలలల..


చరణం 1 :


మబ్బుకన్నెలు పిలిచేనని..

మనసు రివ్వున ఎగిసేనని..

వయసు సవ్వడి చేసేనని.. 

ఇపుడే తెలిసిందీ....

రు రు రు రు..ఆ..ఓ


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. అ....


చరణం 2 :


అలలు చేతులు సాచేనని..

నురుగు నవ్వులు పూచేనని..

నింగి నేలను తాకేనని..

నేడే తెలిసిందీ..!!

రు రు రు రు..ఆ.. ఓ..


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ....

టుర్..ఆ ఆ హు...ఆ హు..


చరణం 3 :


టుర్..ఆ ఆ హు...ఆ హు..

పైరు పచ్చగ ఎదిగున్నది...

పల్లెపడుచుల విసురున్నది...

కొత్త సొగసే రమ్మన్నది...

గుండె ఝుమ్మన్నది...

రు..రు..రు..రు... హో..హొ..


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ....


- పాటల ధనుస్సు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పువ్వూ నవ్వే గువ్వానవ్వే | Puvvu Navve Guvva Navve | Song Lyrics | Apadbhandavudu (1992)

పువ్వూ నవ్వే గువ్వానవ్వే  చిత్రం : ఆపద్భాంధవుడు (1992) సంగీతం : ఎం.ఎం. కీరవాణి గీతరచయిత : సి.నారాయణరెడ్డి నేపధ్య గానం : ఎస్ పి బాలు, చిత్ర ప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు