వినిపించని రాగాలే కనిపించని అందాలే
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: పి.సుశీల
పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే
కనిపించని అందాలే
అలలై మదినే కలచే
కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే
కనిపించని అందాలే ఏ ఏ...
చరణం 1:
తొలిచూపులు నాలోనే
వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే
వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే
చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
వినిపించని రాగాలే
కనిపించని అందాలే ఏ ఏ...
చరణం 2:
వలపే వసంతముల
పులకించి పూచినది
వలపే వసంతముల
పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే
గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
వినిపించని రాగాలే
కనిపించని అందాలే...
చరణం 3:
వికసించెను నా వయసే
మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో
కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే
కనిపించని అందాలే...
అలలై మదినే కలచే
కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే
కనిపించని అందాలే
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి