ధనమేరా అన్నిటికి మూలం
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల
పల్లవి :
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట
మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం
చరణం 1 :
మానవుడే ధనమన్నది
స్రుజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు
భగవంతుడురా
ధనమేరా అన్నిటికి మూలం
చరణం 2 :
ఉన్ననాడు తెలివికలిగి
పొదుపుచేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు
ఇది తెలియకుంటే..
ధనమేరా అన్నిటికీ మూలం
చరణం 3 :
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట
మానవ ధర్మంం
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి