RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kv mahadevan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kv mahadevan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, సెప్టెంబర్ 2026, శనివారం

వినరా సూరమ్మ కూతురి మొగుడా | Vinara Suramma Kuturi Moguda | Song Lyircs | Illu Illalu (1972)

వినరా సూరమ్మ కూతురి మొగుడా 


చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: కొడకండ్ల అప్పలాచార్య

గానం: ఎస్. జానకి, రాజబాబు


పల్లవి:


వినరా సూరమ్మ కూతురి మొగుడా...

విషయము చెపుతానూ 

అసలు విషయము చెపుతానూ

వినరా సూరమ్మ కూతురి మొగుడా...

విషయము చెపుతానూ 

అసలు విషయము చెపుతానూ

చెప్పు మలీ


చరణం: 1


కారు మబ్బులూ కమ్మిన వేళా...

కాకులు గూటికి చేరే వేళ...కా..కా...


చందమామ తొంగి చూసేవేళా ...

సన్నజాజులు పూసే వేళ ..

అహా...ఓహో...

ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..

ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే

లాలీ లాలీ లాలీ లలీ లాలీ 

లాలీ లాలీ లలీ లో...


ఏం జలిగింది...


తలుపు కిర్రునా చప్పుడైనది

గుండె ఝల్లునా కొట్టుకున్నది

తలుపు కిర్రునా చప్పుడైనది

గుండె ఝల్లునా కొట్టుకున్నది

మెల్ల మెల్లగా కళ్ళు తెరచి

నే వచ్చినదెవరో చూశాను


ఎవలాలూ...

నల్లనివాడు గుంట కన్నూల వాడు

గుబురుమీసాల వాడు అయ్యబాబోయ్

ఆరడుగుల పొడుగు వాడు

ముద్దులిమ్మని నన్ను అడిగినాడు

ఏయ్ వాన్ని నే నలికేస్తాను


చరణం: 2


నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ 

మొగముదాచుకొన్నా

పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ 

జడను లాగినాడూ

అమ్మా... నాన్నా....

అమ్మా నాన్నా కాపాడమంటూ 

అల్లాడిపోయాను

అయినా కానీ వదలక నన్ను 

ఒడిసిపట్టినాడు


అంతలో వచ్చింది

ఏమిటీ మూల్చా

కాదు మా అమ్మ

వచ్చి ఏమంది?


వెళ్ళవే నాతల్లి వెళ్ళవే అమ్మా

ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు

మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు

మంచి బట్టలిస్తాడు అని 

ముందుకి తోసింది


ఛీ అది తల్లా కాదు లాక్షసి 

పిచాచి దెయ్యం 

తరవాతేమయిందో చెప్పు ...


చరణం: 3


తప్పనిసరియై వెళ్ళేను 

సిగ్గుపడుతు నిలుచున్నాను

గదిలోకెత్తుకు పోయేడు 

కథలూ కబుర్లు చెప్పేడు...

తన దుప్పటిలో చోటిచ్చేడు


ఛీ.. కులటా పాపాత్ములాలా 

నువ్వు నాకొద్దు ఫో.. 

వాడిదగ్గిరికే పో...


అంతకోపం ఎందుకయ్యా 

అప్పుడు నావయసైదయ్య

ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా....

అంత కోపం ఎందుకయ్యా 

అప్పుడు నావయసైదయ్యా

ఆ వచ్చినదీ మా తాతయ్య

తాతయ్య తాతయ్య.

తాతయ్య తకతయ్యా

తాతయ్య తకయ్య

తాతయ్యా నేనికా 

ఎవలో అనుకున్నా


- పాటల ధనుస్సు


4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

చూడర చూడర ఒక చూపు | Chudara Chudara Oka Chupu | Song Lyrics | Adavi Ramudu (1977)

చూడర చూడర ఒక చూపు 


చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  యస్. పి. బాలు, పి. సుశీల, యస్. జానకి


పల్లవి:


చూడర చూడర చూడర 

చూడర ఒక చూపు

ఓ సులేమాన్ మియ్యా

ఊపర ఊపర ఊపర 

ఊపర ఒక ఊపు

ఆర్ని తస్సాదియ్యా


చరణం 1:


నా జబ్బలాపు చూపిస్తే 

రంగ రంగేళీ

నువ్వొచ్చిన పనికానిస్తే 

మా పని ఖాళీ

పగవాడివి నువ్వయితే 

నీ ఒడుపును చూపాలి

మా వలపులు రేపాలి - 

కొస మెరుపులు చూడాలి

పగవాడివి నువ్వయితే - 

దండెత్తి రావాలి

హోరెత్తి పోవాలి - 

హడలెత్తి చావాలి


ఆషామాషీ కాదే నాతో 

అమీతుమీ తేలుస్తా

ఐసా పైసా తేల్చేస్తా-

ఖలేజా చూపిస్తా

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రేదం మామయ్య


నా జబ్బలావు చూపిస్తే 

రంగ రంగేళీ

నేనొచ్చిన పని కానిస్తే 

మీ పని ఖాళీ ఖాళీ ఖాళీ


చరణం 2:


సరసానికి నువ్వొస్తే - 

వరసలు కలిపేస్తే,

తళుకులు చూపిస్తాం హ హ

కులుకులు కురిపిస్తాం

సరుకులకే నువ్వొస్తే 

సరుకలు చూపిస్తాం

ఇరుకున పెట్టెస్తాం - 

మా ధరకే కొనిపిస్తాం


అవ్వా బువ్వా రవ్వా గువ్వా 

అన్నీ కావాలీ

జంగిల్ బస్తీ బుల్ బుల్ దోస్తీ 

మావైపోవాలి

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రెదం మామయ్యా


- పాటల ధనుస్సు


31, ఆగస్టు 2026, సోమవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు 

చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి 


పల్లవి:


ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు

ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్ళకు

గోరవంక పిలిచింది తిరనాళ్ళకు

నెలవంక పొడిచింది కొన్నాళ్ళకు


చరణం 1:


ఎన్నా చిలకె మనసు 

ఎన్నేలొలికే సొగసు

కదిలొస్తే కానుకలు ఉయ్యాలో

కనుమంతా పండుగలు ఉయ్యాలో


వంక జాబిలి నవ్వు వాలు 

సూపులు రువ్వు

వన్నెలాడు దరికొస్తే ఉయ్యాలో

కన్నెలేడీ గంతులేసే ఇయ్యాలో


చరణం 2:


ముద్దులగుమ్మ కులికె 

మువ్వలబొమ్మా సరికె

పగలే వెన్నెల కాసే 

పలుకే తేనెలు కురిసే

మా రాముడిడొస్తుంటే 

ఉయ్యాలో

ఉయ్యాలో ఉయ్యాలో

ఉయ్యాలో - ఉయ్యాలో


మా నోములే పండె ఇయ్యాలో - 

ఇయ్యాలో

ఇయ్యాలో - ఇయ్యాలో


- పాటల ధనుస్సు



25, జులై 2026, శనివారం

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు | Nee Jadakuchulu Naa Medakuchulu | Song Lyrics | Shubhalekha (1982)

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు 


చిత్రం : శుభలేఖ (1982)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి


సాకి : 


గురుర్బ్రహ్మ గురుర్విష్ణూ 

గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురవే నమః


పల్లవి :


నీ జడకుచ్చులు 

నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక 

నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. 

నగవు చిలుక.. తగదు అలుక.. 

తగవు పడక


నీ జడకుచ్చులు 

నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక 

నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. 

నగవు చిలుక.. తగదు అలుక.. 

తగవు పడక


చరణం 1 :


అడిగింది కన్నెయీడు శెలవింక..  

నిన్నే శెలవింకా

ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక.. 

ఇస్తా నెలవంకా


ఆపాలి అబ్బాయిగారు చొరవింక..  

చిలిపి చొరవింకా

పచ్చ పచ్చని కాపురాలే మనవింక.. 

వింటే మనవింకా


అలగక తొలగక నను విడి కదలక

మనకిక కలదిక మరువక కలయిక

అలగక తొలగక నను విడి కదలక

మనకిక కలదిక మరువక కలయిక

పరువపు తెరవడి చలి చలి 

అలజడి చాలింకా


ఓ..నవమి చిలుక 

నగవు చిలుక తగదు అలుక 

తగవు పడక


నీ చిరునవ్వులు 

నా సిగ పువ్వులు కనుక

నా వెనుక నీ నడక 

నాకెందుకులే కినుక

ఓ.. ఉలికి పడక కలికి పలుక 

కలత పడక కలత పడక


చరణం 2 :


తననం తననం తననం తననం 

తనన దంద తన 

దం దం దం దం తందా..

తననం తననం తననం తననం

తనన తంద దం దా నా నా నా...

హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్..

గూడ్!

హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్?

యేవైందండీ?

ఆహా!

పపదని పపపప దని 

మమ పద మమమమ పద

లా ల లా ల లా ల లా ల...


మనసైన మరునాడే త్వరపడక.. 

నువ్వు జొర పడక

పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా.. 

కొంగు ముడి పడక


ఆపాలి అమ్మయిగారు గొడవింకా.. 

మతులే పడవింకా

నీవు నేనైన రేవు చేరే పడవింకా.. 

సాగే గుడివంక


బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక

పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక

బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక

పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక

మనసుకు మమతకు మనువులు 

జరిగితే చాలింకా


ఓ..ఉలికి పడక.. కలికి పలుక.. 

కలత పడక.. కలత పడక


నీ జడకుచ్చులు 

నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక 

నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. నగవు చిలుక.. 

తగదు అలుక.. తగవు పడక


- పాటల ధనుస్సు 


18, జులై 2026, శనివారం

ఐతే అది నిజమైతే అదే నిజమైతే | Aithe Ade Nijamaithe | Song Lyrics | Shubhalekha (1982)

ఐతే..అది నిజమైతే అదే నిజమైతే 


చిత్రం :  శుభలేఖ (1982)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


ఐతే..అది నిజమైతే..

అదే నిజమైతే

ల ల ల ల ల..

ఐతే.. అది నిజమైతే..

అదే నిజమైతే


ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే

అది పువ్వుల నవ్వుల 

పున్నమి వెన్నెల గూడైతే

ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే

అది పువ్వుల నవ్వుల 

పున్నమి వెన్నెల గూడైతే


ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే 


చరణం 1 :


నింగిలోని చంద్రుడికి.. 

నీటిలోని కలువకి

దూరభారమెంతైనా 

రాయబారి నేనున్నా

ఆ..ఆ.... ఆ..ఆ


నింగిలోని చంద్రుడికి..

నీటిలోని కలువకి

దూరభారమెంతైనా 

రాయబారి నేనున్నా


చందమామ అవునంటే 

వెన్నెలగా

కలువ భామ అది వింతే 

పున్నమిగా

ఆ..... ఆ....ఉ.. ఉ....

చందమామ అవునంటే 

వెన్నెలగా

కలువ భామ అది వింటే 

పున్నమిగా


నా ఆశలు ఎగసి ఎగసి 

తారలతో కలిసి

తలంబ్రాలుగా కురిసే వేళా.. 

చేరువైతే


ఐతే..అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల..

ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే 


చరణం 2 :


ల ల ల ల ల..

రెమ్మ చాటు రాచిలక.. 

కొమ్మ దాటి గోరింక

చూపులతోనే రాయని 

శుభలేఖలు రాస్తుంటే

రెమ్మ చాటు రాచిలక.. 

కొమ్మ దాటి గోరింక

చూపులతోనే రాయని 

శుభలేఖలు రాస్తుంటే...


ఆకసాన అరుధంతీ నక్షత్రం

తెలిపిందీ ఇదేననీ 

సుముహూర్తం

ఆ...... ఆ.....ఉ.. ఉ.... 

ఆకసాన అరుధంతీ నక్షత్రం

తెలిపిందీ ఇదేననీ 

సుముహూర్తం 


మనసిచ్చిన మలిసంధ్యలు 

కుంకుమలై కురిసీ

నుదుట తిలకమై మెరిసే వేళా.. 

చేరువైతే


ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల

ఐతే... అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల


- పాటల ధనుస్సు 


ఒక దీపం వెలిగింది | Oka Deepam Veligindi | Song Lyrics | Ekaveera (1969)

ఒక దీపం వెలిగింది 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది

ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది

స్నేహంలో రేకులు విరిసి ..

చిరునవ్వుల వెలుగు కురిసి

స్నేహంలో రేకులు విరిసి ..

చిరునవ్వుల వెలుగు కురిసి

ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది


ఒక దీపం మలిగింది.. 

ఒక రూపం తొలగింది

ఒక దీపం మలిగింది ..

ఒక రూపం తొలగింది

వేకువ ఇక లేదని తెలిసి ..

చీకటితో చేతులు కలిపి

వేకువ ఇక లేదని తెలిసి ..

చీకటితో చేతులు కలిపి

ఒక దీపం మలిగింది ..

ఒక రూపం తొలగింది


చరణం 1:


మంచు తెరలే కరిగిపోగా ..

మనసు పొరలే విరిసిరాగా

మంచు తెరలే కరిగిపోగా ..

మనసు పొరలే విరిసిరాగా

చెలిమి పిలుపే చేరుకోగ ..

చెలియ వలపే నాదికాగా

అనురాగపు మాలికలల్లి.. 

అణువణువున మధువులు చల్లి

అనురాగపు మాలికలల్లి.. 

అణువణువున మధువులు చల్లి

ఒక ఉదయం పిలిచింది... 

ఒక హృదయం ఎగిసింది


చరణం 2:


నింగి అంచులు అందలేక.. 

నేలపైన నిలువరాక

నింగి అంచులు అందలేక ..

నేలపైన నిలువరాక

కన్నె కలలే వెతలుకాగా ..

ఉన్న రెక్కలు చితికిపోగా

కనిపించని కన్నీట తడిసి... 

బడబానల మెడలో ముడిచి

కనిపించని కన్నీట తడిసి... 

బడబానల మెడలో ముడిచి

ఒక ఉదయం ఆగింది ..

ఒక హృదయం ఆరింది

ఒక ఉదయం ఆగింది.. 

ఒక హృదయం ఆరింది


ఒక దీపం వెలిగింది ...

ఒక దీపం మలిగింది..


- పాటల ధనుస్సు 


17, జులై 2026, శుక్రవారం

ఔనే చెలియా సరి సరి | Oune Cheliya Sarisari | Song Lyrics | Ekaveera (1969)

ఔనే చెలియా సరి సరి 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: పి.సుశీల 


పల్లవి:


ఔనే...చెలియా...సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ..

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా... 

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి


చరణం 1:


ఆమ్మచెల్ల తెలిసేనే 

ఎమ్మెలాడి వగలు

నెమ్మదిలో దాచాలని  

కమ్మని కోరికలు

వాలుకన్ను రెప్పలలో 

వాలాడే తొందరలు

వాలుకన్ను రెప్పలలో  

వాలాడే తొందరలు

దోరపెదవి అంచుల 

చిరునవ్వుల... దోబూచులు


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా... సరి సరి


చరణం 2:


పవళింపుల గదిలో... 

ప్రణయరాజ్యమేలాలని

పవళింపుల గదిలో... 

ప్రణయరాజ్యమేలాలని

నవమల్లెల పానుపుపై.. 

నవమదనుడు త్వరపడునే

నవమల్లెల పానుపుపై.. 

నవమదనుడు త్వరపడునే


చెరిపడనీవే సుంత ..ఉహు.. 

చీర చెరకు గుసగుసలు

ఓ ...చెరిపడనీవే సుంత.. 

చీర చెరకు గుసగుసలు

రవల అందె మువలూదే ..

రాగరహస్యాలు


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా... సరి సరి


చరణం 3:


ఏ చోట దాచేవే ...

ఈ వరకీ సిగ్గులు

ఈ చెక్కిటిపై పూచే...

ఈ గులాబి నిగ్గులు

ఏ చోట దాచేవే 

ఈ వరకీ సిగ్గులు

ఈ చెక్కిటిపై పూచే...

ఈ గులాబి నిగ్గులు


మాపటి బిడియాలన్ని.. 

రేపటికి వుండవులే..ఏ...

మాపటి బిడియాలన్ని... 

రేపటికి వుండవులే...

నేటి సోయగాలు ...

మరునాటికి వడిలేనులే


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి


- పాటల ధనుస్సు 


14, జులై 2026, మంగళవారం

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ | Entha Dooramu Adi | Song Lyrics | Ekaveera (1969)

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత:  సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

పరిమళించు పాన్పులకూ 

నిరీక్షించు చూపులకూ

పరిమళించు పాన్పులకూ 

నిరీక్షించు చూపులకూ

వేసిన తలపులకూ 

వేచిన తలపులకూ

ఎంత చేరువో అది 

అంత దూరము


ఎంత దూరమూ అదీ 

యెంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

యెంత దూరమూ

ఉదయించే కిరణాలకు 

ఉప్పొంగే కెరటాలకు..

ఉదయించే కిరణాలకు 

ఉప్పొంగే కెరటాలకు..

కలలుగనే చెలునికీ 

కలతపడే చెలియకు

ఎంత చేరువో అది 

అంత దూరము


చరణం 1:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

మనసు పడని సంపంగికి.. 

మరులు విడని భ్రమరానికి

మనసు పడని సంపంగికి.. 

మరులు విడని భ్రమరానికి

ఉన్నదానికీ.. 

అనుకున్నదానికీ

ఎంత చేరువో అది 

అంత దూరము


చరణం 2:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

అల్లనాటి ఆశలకూ.. 

అణగారిన బాసలకూ

అల్లనాటి ఆశలకూ.. 

అణగారిన బాసలకూ

మరువరాని అందానికి.. 

చెరిగిపోని బంధానికి

ఎంత చేరువో అది 

అంత దూరము


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ


- పాటల ధనుస్సు 


కలువపూల చెంత చేరి | Kaluva Poola Chentha Cheri | Song Lyrics | Ekaveera (1969)

కలువపూల చెంత చేరి 


చిత్రం : ఏకవీర (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం : ఎస్ పి బాలు 


పల్లవి : 


కలువపూల చెంత చేరి 

కైమోడుపు సేతును

నా కలికి మిన్న కన్నులలో 

కలకలమని విరియాలని

మబ్బులతో ఒక్కమారు 

మనవి చేసికొందును

నా అంగన ఫాలాంగణమున 

ముంగురులై కదలాలని


చరణం 1:


చుక్కలతో ఒక్కసారి 

సూచింతును

నా ప్రేయసి నల్లని వాల్జడ 

సందుల మల్లియలై మొలవాలని

పూర్ణ సుధాకర బింబమ్మునకు 

వినతి సేతును

నా పొలతికి ముఖబింబమై 

కళలు దిద్దుకోవాలని


చరణం 2:


ప్రకృతి ముందు చేతులెత్తి 

ప్రార్థింతును కడసారిగా...

నా రమణికి బదులుగ 

ఆకారం ధరియించాలని 


- పాటల ధనుస్సు 


ప్రతి రాత్రి వసంత రాత్రి | Pratiratri Vasantha Ratri | Song Lyrics | Ekaveera (1969)

ప్రతి రాత్రి వసంత రాత్రి 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దేవులపల్లి

నేపథ్య గానం: ఘంటసాల, ఎస్ పి బాలు


పల్లవి :


ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి

బ్రతుకంతా ప్రతినిమిషం 

పాట లాగ సాగాలీ

ప్రతి నిమిషం ప్రియా ప్రియా 

పాట లాగ సాగాలీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


చరణం 1:


నీలో నా పాట కదలి 

నాలో నీ అందె మెదలి

నీలో నా పాట కదలి 

నాలో నీ అందె మెదలి

లోలోన మల్లెపొదలా 

పూలెన్నో విరిసి విరిసి

లోలోన మల్లెపొదలా 

పూలెన్నో విరిసి విరిసి

మనకోసం ప్రతినిమిషం 

మధుమాసం కావాలీ

మనకోసం ప్రియా ప్రియా 

మధుమాసం కావాలీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


చరణం 2:


ఒరిగింది చంద్రవంక 

వయ్యారి తారవంక

ఒరిగింది చంద్రవంకా 

వయ్యారి తారవంక

విరజాజి తీగసుంత 

జరిగింది మావిచెంత

విరజాజి తీగసుంత 

జరిగింది మావిచెంత

నను జూచీ నిను జూచీ 

వనమంతా వలచిందీ

నను జూచీ ప్రియా ప్రియా 

వనమంతా వలచిందీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


- పాటల ధనుస్సు 


ఏ పారిజాతమ్ములీయగలనో | Ye Parijathammuleyagalano | Song Lyrics | Ekaveera (1969)

ఏ పారిజాతమ్ములీయగలనో 


చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు 


పల్లవి: 


ఏ పారిజాతమ్ములీయగలనో…  

సఖీ 

గిరి మల్లికలు తప్ప…  

గరికపూవులు తప్ప 

ఏ కానుకలను అందించగలనో…  

చెలీ 

గుండెలోతుల దాచుకున్న 

వలపులు తప్ప 


జగతిపై నడయాడు 

చంచలా వల్లికా 

తరుణి ఆకృతి దాల్చు 

శరదిందు చంద్రికా... 

శరదిందు చంద్రికా... 


చరణం 1: 


నీవు లేని తొలి రాతిరి... 

నిట్టూర్పుల పెను చీకటి 

నీవు లేని విరి పానుపు... 

నిప్పులు చెరిగే కుంపటి 


విరులెందుకు... సిరులెందుకు 

మనసు లేక  మరులెందుకు 

తలపెందుకు... తనువెందుకు 

నీవు లేక నేనెందుకు 

నీవు లేక నేనెందుకు


- పాటల ధనుస్సు 


నీ పేరు తలచినా చాలు | Nee Peru Talachina Chalu | Song Lyrics | Ekaveera (1969)

నీ పేరు తలచినా చాలు 


చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపథ్య గానం: పి.సుశీల 

 

పల్లవి: 


కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు 

నీ పేరు తలచినా చాలు 

మదిలో పొంగు శతకోటి 

యమునా తరంగాలు 

నీ పేరు తలచినా చాలు 


చరణం 1: 


ఏమి మురళి అది ఏమి రవళి రా..అ.ఆ.. 

ఏమి మురళి అది ఏమి రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

ఏమీ మురళి అది ఏమీ రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

మురళీధరా నీ స్వరలహరులలో 

మరణమైనా మధురమురా 


చరణం 2: 


వెదురు పొదలలో తిరిగి తిరిగి 

నీ పదపల్లవములు కందిపోయేనో 

వెదురు పొదలలో తిరిగి తిరిగి

నీ పదపల్లవములు కందిపోయేనో 

యెదపానుపుపై పవళించరా 

నా పొదిగిన కౌగిట పులకించరా 


చరణం 3: 


గోపాలా ...నందబాలా..... 

నవమంజుల మురళీలోల 

మృదు సమీరకంపిత 

మనోజ్ఞకుంతల తమాలపల్లవజాలా 

కృష్ణా నీ పేరు తలచినా చాలూ 


ఏమి పిలుపు అది ఏమి పిలుపు 

బృందానికుంజముల పూలు పూసి 

శరదిందు చంద్రికల కేలు సాచి  

కరుణాంతరంగముల దాగి దాగి 

చెలి అందెలందు చెలరేగి రేగి 

నను తొందరించెరా ..ఆ...

తొలకరించెరా..ఆ.. 

తొందరించెరా తొలకరించెరా 

వలపు జల్లుగా పలుకరించెరా 

వల్లవీరమణి చల్లని ఉల్లము 

అల్లన జల్లన పరవశించెరా..ఆ..ఆ.. 

కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు