RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jayasudha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jayasudha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

చూడర చూడర ఒక చూపు | Chudara Chudara Oka Chupu | Song Lyrics | Adavi Ramudu (1977)

చూడర చూడర ఒక చూపు 


చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  యస్. పి. బాలు, పి. సుశీల, యస్. జానకి


పల్లవి:


చూడర చూడర చూడర 

చూడర ఒక చూపు

ఓ సులేమాన్ మియ్యా

ఊపర ఊపర ఊపర 

ఊపర ఒక ఊపు

ఆర్ని తస్సాదియ్యా


చరణం 1:


నా జబ్బలాపు చూపిస్తే 

రంగ రంగేళీ

నువ్వొచ్చిన పనికానిస్తే 

మా పని ఖాళీ

పగవాడివి నువ్వయితే 

నీ ఒడుపును చూపాలి

మా వలపులు రేపాలి - 

కొస మెరుపులు చూడాలి

పగవాడివి నువ్వయితే - 

దండెత్తి రావాలి

హోరెత్తి పోవాలి - 

హడలెత్తి చావాలి


ఆషామాషీ కాదే నాతో 

అమీతుమీ తేలుస్తా

ఐసా పైసా తేల్చేస్తా-

ఖలేజా చూపిస్తా

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రేదం మామయ్య


నా జబ్బలావు చూపిస్తే 

రంగ రంగేళీ

నేనొచ్చిన పని కానిస్తే 

మీ పని ఖాళీ ఖాళీ ఖాళీ


చరణం 2:


సరసానికి నువ్వొస్తే - 

వరసలు కలిపేస్తే,

తళుకులు చూపిస్తాం హ హ

కులుకులు కురిపిస్తాం

సరుకులకే నువ్వొస్తే 

సరుకలు చూపిస్తాం

ఇరుకున పెట్టెస్తాం - 

మా ధరకే కొనిపిస్తాం


అవ్వా బువ్వా రవ్వా గువ్వా 

అన్నీ కావాలీ

జంగిల్ బస్తీ బుల్ బుల్ దోస్తీ 

మావైపోవాలి

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రెదం మామయ్యా


- పాటల ధనుస్సు


16, ఫిబ్రవరి 2022, బుధవారం

నీ చూపులోనా విరజాజివానా | Nee Chupulona | Song Lyrics | Pilla Jamindar (1980)

నీ చూపులోనా విరజాజివానా



చిత్రం: పిల్ల జమిందార్ (1980)

సంగీతం: చక్రవర్తి

నేపధ్య గానం: బాలు, సుశీల, ఎస్. పి. శైలజ

రచన : వడ్డేపల్లి కృష్ణ ,


పల్లవి:


నీ చూపులోనా.. విరజాజివానా

ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా


నీ నవ్వులోనా.. రతనాల వానా

ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా


చరణం 1:


ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే

నీ వన్నెలేమో.. సరదాలు చేసే

ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే

నీ వన్నెలేమో.. సరదాలు చేసే

వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ

వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ

కనివిని ఎరుగని తలపులు చిగురించే...


నీ చూపులోనా.. విరజాజివానా

ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా


నీ నవ్వులోనా.. వడగళ్ల వానా

ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా


చరణం 2:


చిరుగాలిలోనా... చిగురాకు ఊగే

చెలి కులుకులోనా... పరువాలు ఊగే


ఈ పాల రేయీ... మురిపించె నన్ను...

మురిపాలలోనా... ఇరికించె నన్ను...


గిలిగింత కలిగించే... మనసంత పులకించే...

జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే...

చెరగని.. తరగని.. వలపులు కురిపించే...


నీ చూపులోనా... విరజాజివానా

ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా


నీ నవ్వులోనా... రతనాల వానా

ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా


- పాటల ధనుస్సు 

30, జనవరి 2022, ఆదివారం

చక చక సాగే చక్కని బుల్లెమ్మా | Chaka Chaka sage | Song Lyrics | MallePoovu (1978)

 చక చక సాగే చక్కని బుల్లెమ్మా


చిత్రం :  మల్లెపువ్వు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర 

నేపథ్య గానం :  బాలు,  సుశీల 


పల్లవి:


చక చక సాగే చక్కని బుల్లెమ్మా

మిస మిస లాడే వన్నెల చిలకమ్మ

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో


గలగల పారే ఏరే నా పేరూ

పొంగులు వారే వలపే నా ఊరూ

చినదాననూ..నే చినదాననూ

చినదాననూ..నే చినదాననూ


చరణం 1:


కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా?

కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా?

చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..

ఊహకు రానంత..


అందీ అందక ఊరించే నీ మనసు లోతెంతా..హా !

మమతే ఉంటే.. ఏ ఏ.. దూరమెంతో లేదూ

నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది


కసి కసి చూపులు చూసే సోగ్గాడా

ముసి ముసి నవ్వులు విసిరే మొనగాడా

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

నీ పేరేమిటో .. నీ ఊరేమిటో


పదమును పాడే వేణువు నా పేరూ

మధువులు చిందే కవితే నా ఊరూ

చినవాడనూ..నే నీవాడనూ

చినవాడనూ..నే నీవాడనూ


చరణం 2:


వరసలు కలిపే.. ఓ చినవాడా..నీ వలపే ఎంతా?

విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..

నా వలపే జీవితమంత

నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో

గుండెల గుడిలో దేవివి నీవంటా..

సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా


చల్లని గాలీ సన్నాయి ఊదిందీ

పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ

కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ

కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ


- పాటల ధనుస్సు 

ఓహో లలితా నా ప్రేమ కవితా | Oho Lalitha Naa prema kavitha | Song Lyrics | Mallepoovu (1978)

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా



చిత్రం :  మల్లెపువ్వు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర 

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి:


ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా


గగనవీణ సరిగమలు పాడగా..

ఆ ఆ ఆ ఆఆ

నీ జఘనసీమ స్వరజతులనాడగా..

ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ

తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత 

శృంగార తటిల్లత కదలగా

కనులు చెదరగా..

కదలిరా..కవితలా..వలపుకే..వరదలా...

ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా..


చరణం 1:


మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా..

నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా 

కదలిరావే నా లలితా


గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా

కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా


నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే

సిగమల్లె పిలుపులో అందుకో

సిరిమల్లె తీగవై అల్లుకో


ఈ మల్లెపూవే నీ సొంతము


కదలిరా.. కవితలా..వలపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా 

నాప్రేమ కవితా



చరణం 2:


వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా

నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా


తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా

పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా


నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై


నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా


ఈ మల్లెపూవే నా లలితగా

కదలిరా కవితలా వలుపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా


- పాటల ధనుస్సు 

28, జనవరి 2022, శుక్రవారం

పాలకంకి మీదుంది పైరు | Palakanki Meedundi | Song Lyrics | Katakatala Rudrayya (1978)

 పాలకంకి మీదుంది పైరు 


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)

రచన : వేటూరి

సంగీతం : జె వి రాఘవులు 

పాడినవారు : బాలు, సుశీల 


పల్లవి :


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడిసి పట్టి కొట్టబోతే  గడుసు పిట్టరో

కన్నుకొట్టి తుర్రు మంది కన్నె మోజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పాలకంకి మీదుందా  పైరు

అరెరే పడలేవా ఈ పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో 

ఎహె ...

చరణం 1 :

మొదని  కన్ను గింజనుకొని  కులికింది పికిలి పిట్టా 

పెదవి దొండ పండనుకొని చిదిమింది చికిలి పిట్టా 

పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

పొదుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


చరణం 2 :

నీలాంటి రేవు కాడ తెల్లారి పొద్దు కాడ 

ఏమైందటా...

ఒడ్డుమీద ముక్కు పుడక పట్టుకెళ్ళే పాడు పిట్ట 

వెరీ వెరీ గుడ్డు ...

ఆరేసుకున్న కొక కాజేయ లేక నిన్న

ఎక్కించుకున్న రైక ఎత్తుకెళ్లే పడుచు పిట్ట  

బావుంది బావుంది 

ఈ పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 

ఆ పొడుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా

ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 


పాలకంకి మీదుంది పైరు 

అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 

ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 

కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 

కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో


 - పాటల ధనుస్సు 

18, జనవరి 2022, మంగళవారం

వీణ నాది తీగ నీది | Veena naadi Teega needi | Song Lyrics | Katakatala Rudrayya (1978)

 వీణ నాది తీగ నీది




సంగీతం : జె వి రాఘవులు 

రచన : వేటూరి సుందరరామమూర్తి 

గానం : బాలు సుశీల 

చిత్రం : కటకటాల రుద్రయ్య (1978),


పల్లవి: వీణ నాది..తీగ నీది..

తీగ చాటు రాగ ముంది.. పువ్వు నాది..పూత నీది..

ఆకుచాటు అందముంది.. వీణ నాది..తీగ నీది..

తీగ చాటు రాగ ముంది..

తీగ చాటు రాగ ముంది..

చరణం 1: తొలిపొద్దు ముద్దాడగానే..

ఎరుపెక్కె తూరుపు దిక్కూ.. తొలిచూపు రా పాడగానే..

వలపొక్కటే వయసు దిక్కూ.. వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి

వయసల్లే కాటేస్తే చిక్కు తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు

చరణం 2: మబ్బుల్లో మెరుపల్లే కాదూ..

వలపు వాన కురిసీ వెలిసి పోదూ.. మనసంటే మాటలు కాదూ..

అది మాట ఇస్తే మరచి పోదూ.. బ్రతుకల్లే జతగూడి వలపల్లె వనగూడి

వొడిలోనే గుడి కట్టే దిక్కు నా గుడి దీపమై నాకు దక్కూ


- పాటల ధనుస్సు




15, జనవరి 2022, శనివారం

సంబరాలా సంకురాతిరి | Sambarala Sankurathri | Song Lyrics | Urantha Sankranthi (1983)

 సంబరాలా సంకురాతిరి

చిత్రం :  ఊరంతా సంక్రాంతి (1983) 

సంగీతం :  బాలు

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం : బాలు, జానకి, సుశీల


పల్లవి :


సంబరాలా సంకురాత్రి... 

ఊరంతా పిలిచిందీ

ముత్యాలా ముగ్గుల్లో... 

ముద్దాబంతి గొబ్బిల్లో

ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా


సంబరాలా సంకురాత్రి..

ఊరంతా పిలిచిందీ

ముత్యాలా ముగ్గుల్లో... 

ముద్దాబంతి గొబ్బిల్లో

ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా


తన తనెతాన తానాన తానా

తన తననాన తానె తానా

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 


చరణం 1 :


అందాలే ముద్దులిచ్చి...  

బంధాలు వేసేను

గారాలే ముడులు వేసి...  

గంధాలు పూసేను

అ రె రె రె రె...

లోగిళ్ళలోన సిగ్గులన్ని వెల్లలేసే..  

ప్రేమ రంగులేసే

కన్నెపిల్లలో సోకు పండిందనీ

కాపు కావాలనీ...  

తోడురావాలనీ..హోయ్


అందాలే ముద్దులిచ్చి... 

బంధాలు వేసేను

గారాలే ముడులువేసి... 

గంధాలు పూసేను

ఆ ఆ ఆ ఆ ఆ..

అల్లీ అల్లని పందిట్లో... 

అల్లరి జంటల ముచ్చట్లు

చూపులు కలిసిన వాకిట్లో... 

ఊపిరి సలపని తప్పెట్లు

దేవుడి గుళ్ళో సన్నాయల్లే...

 మ్రోగాలనీ


హోయ్... 

సంబరాలా సంకురాత్రి... 

ఊరంతా పిలిచిందీ

ముత్యాలా ముగ్గుల్లో... 

ముద్దాబంతి గొబ్బిల్లో

ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా


ఓఓ ఓహో... తానా తానా 

తానా తానా తానా ఆ తాననా

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా


చరణం 2 :


వయ్యారం వలపువాకిట... 

చిరు చిందులేసేను

సింగారం తలపు చాటున... 

తొలి ఊసులాడేను.. హా 

కళ్ళల్లోని ఆశలన్ని 

కొండా కొచ్చేసై...  

ముడుపులిచ్చీ

గుండెచాటు కలలన్ని తీరాలనీ... 

వలపు సాగాలనీ... 

రేవు చేరాలనీ


హోయ్..వయ్యారం 

వలపువాకిట... 

చిరు చిందులేసేను

సింగారం తలపు చాటున... 

తొలి ఊసులాడేను


ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో... 

తెలిసీ తెలియని పరవళ్ళు

కలసీ కలవని కళ్ళల్లో... 


తీరీ తీరని ఆకళ్లు

తీరే రోజు రేపో మాపో 

రావాలనీ..హోయ్


సంబరాలా సంకురాత్రి... 

ఊరంతా పిలిచిందీ

ముత్యాలా ముగ్గుల్లో... 

ముద్దాబంతి గొబ్బిల్లో

ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా

ఏడాదికోపండగా... ఆ... 

బ్రతుకంత తొలిపండగా


- పాటల ధనుస్సు



పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు