RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
adavi ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
adavi ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

చూడర చూడర ఒక చూపు | Chudara Chudara Oka Chupu | Song Lyrics | Adavi Ramudu (1977)

చూడర చూడర ఒక చూపు 


చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  యస్. పి. బాలు, పి. సుశీల, యస్. జానకి


పల్లవి:


చూడర చూడర చూడర 

చూడర ఒక చూపు

ఓ సులేమాన్ మియ్యా

ఊపర ఊపర ఊపర 

ఊపర ఒక ఊపు

ఆర్ని తస్సాదియ్యా


చరణం 1:


నా జబ్బలాపు చూపిస్తే 

రంగ రంగేళీ

నువ్వొచ్చిన పనికానిస్తే 

మా పని ఖాళీ

పగవాడివి నువ్వయితే 

నీ ఒడుపును చూపాలి

మా వలపులు రేపాలి - 

కొస మెరుపులు చూడాలి

పగవాడివి నువ్వయితే - 

దండెత్తి రావాలి

హోరెత్తి పోవాలి - 

హడలెత్తి చావాలి


ఆషామాషీ కాదే నాతో 

అమీతుమీ తేలుస్తా

ఐసా పైసా తేల్చేస్తా-

ఖలేజా చూపిస్తా

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రేదం మామయ్య


నా జబ్బలావు చూపిస్తే 

రంగ రంగేళీ

నేనొచ్చిన పని కానిస్తే 

మీ పని ఖాళీ ఖాళీ ఖాళీ


చరణం 2:


సరసానికి నువ్వొస్తే - 

వరసలు కలిపేస్తే,

తళుకులు చూపిస్తాం హ హ

కులుకులు కురిపిస్తాం

సరుకులకే నువ్వొస్తే 

సరుకలు చూపిస్తాం

ఇరుకున పెట్టెస్తాం - 

మా ధరకే కొనిపిస్తాం


అవ్వా బువ్వా రవ్వా గువ్వా 

అన్నీ కావాలీ

జంగిల్ బస్తీ బుల్ బుల్ దోస్తీ 

మావైపోవాలి

వారెవా సులేమాన్ మియ్యా

ఆరే భయ్యా - రారా కుయ్యా

మారో రెదం మామయ్యా


- పాటల ధనుస్సు


31, ఆగస్టు 2026, సోమవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు 

చిత్రం: అడవిరాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: వేటూరి

గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి 


పల్లవి:


ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు

ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్ళకు

గోరవంక పిలిచింది తిరనాళ్ళకు

నెలవంక పొడిచింది కొన్నాళ్ళకు


చరణం 1:


ఎన్నా చిలకె మనసు 

ఎన్నేలొలికే సొగసు

కదిలొస్తే కానుకలు ఉయ్యాలో

కనుమంతా పండుగలు ఉయ్యాలో


వంక జాబిలి నవ్వు వాలు 

సూపులు రువ్వు

వన్నెలాడు దరికొస్తే ఉయ్యాలో

కన్నెలేడీ గంతులేసే ఇయ్యాలో


చరణం 2:


ముద్దులగుమ్మ కులికె 

మువ్వలబొమ్మా సరికె

పగలే వెన్నెల కాసే 

పలుకే తేనెలు కురిసే

మా రాముడిడొస్తుంటే 

ఉయ్యాలో

ఉయ్యాలో ఉయ్యాలో

ఉయ్యాలో - ఉయ్యాలో


మా నోములే పండె ఇయ్యాలో - 

ఇయ్యాలో

ఇయ్యాలో - ఇయ్యాలో


- పాటల ధనుస్సు



21, మార్చి 2025, శుక్రవారం

ఆరేసుకోబోయి పారేసుకున్నాను | Aresukoboyi Paresukunnanu | Song Lyrics | Adavi Ramudu (1977)

ఆరేసుకోబోయి పారేసుకున్నాను



చిత్రం: అడవి రాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు,  సుశీల 


పల్లవి:


ఆరేసుకోబోయి పారేసుకున్నాను 

అరె అరె అరె అరె 

కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..ఈ.. ఈ...

నువ్వు కొంటెచూపు చూస్తేనే 

చలి చలి.. చలి చలి ఆఁహ్... 

చలి చలి


పారేసుకోవాలనారేసుకున్నావు.. 

అరె అరె అరె అరె 

నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. ఈ.. ఈ..

నాకు ఉడుకెత్తి పోతోంది.. 

హరి హరి.. హరి హరి.. హరి హరి


ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. 

అరె అరె అరె అరె


చరణం 1:


నాలోని అందాలు నీ కన్నుల 

ఆరేసుకోనీ సందెవేళ


నా పాట ఈ పూట నీ పైటల.. 

దాచేసుకోనీ తొలిపొంగుల


నాలోని అందాలు నీ కన్నుల 

ఆరేసుకోనీ సందెవేళ


నా పాట ఈ పూట నీ పైటల.. 

దాచేసుకోనీ తొలిపొంగుల


నీ చూపు సోకాలి...

నా ఊపిరాడాలి...

నీ చూపు సోకాలి

నా ఊపిరాడాలి


నీ జంట నా తీపి చలి మంట కావాలి

నీ వింత కౌవ్వింతకే.. కాగిపోవాలి

నీ కౌగిలింతలోనే దాగిపోవాలి


ఆరేసుకోబోయి పారేసుకున్నాను 

అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..


నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి 

హరి హరి..ఏయ్... హరి హరి


చరణం 2:


నీ ఒంపులో సొంపులే హరివిల్లు..

నీ చూపులో రాపులే విరిజల్లు


నీ రాక నా వలపు ఏరువాక..

నీ తాక నీలిమబ్బు నా కోక...


నే రేగిపోవాలి 

నేనూగిపోవాలి

నే రేగిపోవాలి

నేనూగిపోవాలి

చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి

ఈ జోడు పులకింతలే నా పాట కావాలి

ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి..


ఆరేసుకోబోయి పారేసుకున్నాను 

అరె.. ఆఁ అరె ఆఁ అరె ఆఁ అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి..

హా.. చలి చలి..హా.. చలి చలి


పారేసుకోవాలనారేసుకున్నావు  

అరె..ఆ.. అరె..ఆ.. అరె..ఆ.. అరె 

నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..

నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి.. 

హరి హరి.. హరి హరి


లాలాల లాలాలలలలలలల.. 

లాలాల లాలాలలలలలలల.. 


- పాటల ధనుస్సు 


20, మార్చి 2025, గురువారం

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు | Krishi Vunte | Song Lyrics | Adavi Ramudu (1977)

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు



చిత్రం: అడవి రాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


మనిషై పుట్టినవాడు 

కారాదు మట్టిబొమ్మా...

పట్టుదలే వుంటే 

కాగలడు మరో బ్రహ్మ..


కృషి ఉంటే మనుషులు 

ఋషులౌతారు..

మహాపురుషులౌతారు...

తరతరాలకి తరగని వెలుగౌతారు..

ఇలవేలుపులౌతారు...


చరణం 1:


అడుగో అతడే వాల్మీకీ.. 

బ్రతకు వేట అతనికి..

అతిభయంకరుడు యమకింకరుడు.. 

అడవి జంతువుల పాలిటి..

అడుగో అతడే వాల్మీకీ


పాల పిట్టల జంట 

వలపు తేనెల పంట 

పండించుకొని పరవశించి పోయేవేళా..

ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు..

ఒక పక్షిని నేల కూల్చాడు..


జంట బాసిన పక్షి 

కంటపొంగిన గంగ 

తన కంటిలో పొంగ...

మనసు కరగంగ...


ఆ శోకంలో ఒక శ్లోకం పలికే..

ఆ చీకటి ఎదలో దీపం వెలిగే...


కరకు బోయడే అంతరించగా.. 

కవిగా ఆతడు అవతరించగా...

మనిషి అతనిలో మేల్కొన్నాడు.. 

కడకు మహర్షే అయినాడు..


నవరసభరితం రాముని చరితం.. 

జగతికి ఆతడు పంచిన అమృతం


ఆ వాల్మీకి మీవాడూ... 

మీలోనే వున్నాడు...

అక్షరమై మీ మనసు వెలిగితే... 

మీలోనే వుంటాడు..

అందుకే.... 

కృషి ఉంటే మనుషులు 

ఋషులౌతారు

మహాపురుషులౌతారు...


చరణం 2:


ఏకలవ్యుడంటేనే 

ఎదురులేని బాణం..

తిరుగులేని దీక్షకు 

అతడే ప్రాణం..


కులం తక్కువని విద్య నేర్పని 

గురువు బొమ్మగా మిగిలాడు..

బొమ్మ గురుతుగా చేసుకొని 

బాణవిద్యలో పెరిగాడు


హుటాహుటిని ద్రోణుడపుడు 

తటాలుమని తరలి వచ్చి 

పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు..


ఎదుట నిలిచిన గురుని పదమంటి...

ఏమివ్వ గలవాడననే ఏకలవ్యుడు..


బొటనవేలిమ్మని కపటి ఆ ద్రోణుడు..

వల్లెయని శిష్యుడు... 

చెల్లె ద్రోణుని ముడుపు..


ఎరుకలవాడు అయితేనేమి 

గురికలవాడే మొనగాడు..

వేలునిచ్చి తన విల్లును విడిచి 

ఇలవేలుపుగా ఇల వెలిగాడు..


అందుకే.... 

కృషి ఉంటే మనుషులు 

ఋషులౌతారు

మహాపురుషులౌతారు...


చరణం 3:


శబరి...

ఇంతకాలము వేచినది 

ఈ పిలుపుకే శబరి..

ఆశ పరుగిడి అడుగు తడబడి 

రామ పాదము కన్నది...


వంగిపోయిన నడుముతో 

నగుమోము చూడగలేక అపుడు..

కనుల నీరిడీ... 

ఆ రామ పాదము కడిగినది శబరి...

పదముల ఒరిగినది శబరి


ప్రేమ మీరగ రాముడప్పుడు 

శబరి తల్లి కనులు తుడిచి..

కోరి కోరి శబరి కొరికిన 

దోర పండ్లను ఆరగించే..


ఆమె ఎంగిలి గంగ కన్న 

మిన్నగా భావించిన 

రఘురాముండెంతటి ధన్యుడో...

ఆ శబరి దెంతటి పుణ్యమో..


ఆమె ఎవ్వరో కాదు సుమా.. 

ఆడపడుచు మీ జాతికి...

జాతిరత్నములు ఎందరెందరో 

మీలో కలరీనాటికి...


అడవిని పుట్టి పెరిగిన కథలే 

అఖిల భారతికి హారతులు..

నాగరికతలో సాగు చరితలో 

మీరే మాకు సారథులూ...


అందుకే.... 

కృషి ఉంటే మనుషులు 

ఋషులౌతారు..

మహాపురుషులౌతారు...


- పాటల ధనుస్సు 

11, నవంబర్ 2024, సోమవారం

అమ్మతోడు అబ్బతోడు | Ammathodu Abbathodu | Song Lyrics | Adavi Ramudu (1977)

అమ్మతోడు అబ్బతోడు నా తోడు నీ తోడు



చిత్రం: అడవి రాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల, జానకి


పల్లవి:


అమ్మతోడు అబ్బతోడు 

నా తోడు నీ తోడు

అన్నిటికి నువ్వే నా తోడు...

ఇంకెన్నటికి నేనే నీ తోడు


అమ్మతోడు...అబ్బతోడు..

నా తోడు...నీ తోడు

అన్నిటికి నువ్వే నా తోడు...

ఇంకెన్నటికి నేనే నీ తోడు


చరణం 1:


ఆకలన్నదే లేదు.. హర హరా..

రామ రామా

అన్నమే రుచికాదు ...శివ శివా..

కృష్ణ కృష్ణా..

ఆకలన్నదే లేదు.. హర హరా...

అన్నమే రుచికాదు... శివ శివా...

వెన్నెలలొస్తె వేడిరా నా దొరా... 

ఆ వేడిలోనే చలేసింది రా


ఆకలన్నదే నీకు లేకపోతే... 

ఈ కేకలెందుకే రాకపోకలెందుకే

ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు... 

నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు


అమ్మతోడు...అబ్బతోడు..

నా తోడు...నీ తోడు

అన్నిటికి నువ్వే నా తోడు... 

ఇంకెన్నటికి నేనే నీ తోడు


చరణం 2:


కళ్ళు కాయలు కాచే హర హరా.... 

ఈశ్వరా

నిన్ను చూడకమాకు శివ శివా.... 

శ్రీహర

కళ్ళు కాయలు కాచే ... హర హరా

నిన్ను చూడకమాకు ... శివ శివా

పొద్దె గడవదు మాకు ఓ దొరా...

నిద్దరన్నదే లేదు రా


నిద్దరన్నదే నీకు లేకపోతే... 

ఈ పిలుపులెందుకే .. 

ఆ కులుకులెందుకే

గుట్టు బయట పెట్టకుంటే ... 

పెద్ద ఒట్టు

గట్టు మీద చిలక వింటే 

గుట్టు రట్టు...


అమ్మతోడు... అబ్బతోడు..

నా తోడు...నీ తోడు

అన్నిటికి నువ్వే నా తోడు...

ఇంకెన్నటికి నేనే నీ తోడు


చరణం 3:


ఆ శివుడే వరమిచ్చాడే ...

అదిరిపడకే ఆడవి జింకా

అంబ పలికే జగదంబ పలికెనే... 

ఆశవదులుకో నీవింకా


ఆహాఁ భోలా శంకరుడయినా 

నిన్ను బొల్తాకొట్టించాడమ్మా

చిత్తైపోయావమ్మో... 

ఓ సిగ్గులదొరసానమ్మా


తెల్లారే తల్లో పూలు 

పెట్టుకురమ్మన్నాడు

తేల్లారకనే తలస్నానం 

చేసి రమ్మన్నాడు

చిటికెడు విబూది ఇచ్చాడు..

పిడికెడు నాకు ఇచ్చాడు..


అమ్మతోడు అందాల రాముడు... 

నా వాడన్నాడు

నా అన్నవాడు అడవి రాముడు ...

నా తోడన్నాడు

అందుకే వాడు నా వాడు...

కాడు కాడు ...కాలేడు....

అబ్బ.. అమ్మా...


అమ్మ తోడు అబ్బ తోడు 

నా తోడు నీ తోడు

అన్నిటికి మీరే నా తోడు... 

ఇంకెన్నటికి నేనే మీ తోడు

అమ్మ తోడు అబ్బ తోడు 

నా తోడు నీ తోడు

అన్నిటికి మీరే నా తోడు... 

ఇంకెన్నటికి నేనే మీ తోడు

ఇంతటితో ఆపండి... మీగోడు


- పాటల ధనుస్సు 

1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి | kuku Kuku Kokilamma pelliki | Song Lyrics | Adavi Ramudu (1977)

కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి



రచన  : వేటూరి సుందరరామమూర్తి 

సంగీతం  : కె వి మహదేవన్,

గానం  : SP బాలు, పి సుశీల 

చిత్రం  : అడవి రాముడు (1977)


పల్లవి:


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం 

వసంతుడే పెళ్ళికొడుకు 

వనమంతా సందడీ

పూలన్నీ తలంబ్రాలు 

పున్నమీ తొలిరేయి


చరణం 1:


తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న 

తూనిగల్లే ఎగిరిన 

పిల్లదాని కొచ్చిందీ కళా 

పెళ్ళి కళా

తలపులన్నీ వలపులైన 

చూపులు విరి తోపులైన 

పెళ్ళికొడుకు నవ్వితే కళా 

తళ తళా

పూలగాలితో రేగిన 

పుప్పొడి పారాణిగా

చిలక పాట నెమలి ఆట 

కలిసి మేజువాణిగా


పూలగాలితో రేగిన 

పుప్పొడి పారాణిగా

చిలక పాట నెమలి ఆట 

కలిసి మేజువాణిగా

అందమైన పెళ్ళికి 

అందరు పేరంటాలే

అడవిలోని వాగులన్నీ 

ఆనందపు కెరటాలే


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి 

కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


చరణం 2:


కన్ను కన్ను కలుపుకున్న 

కన్నె మనసు తెలుసుకున్న 

కనుల నీలి నీడలే కథా 

ప్రేమ కథా

బుగ్గలలో నిగ్గుదీసి 

సిగ్గులలో చిలకరించి 

మొగ్గ వలపు విచ్చితే కథా 

పెళ్ళి కథా


ఇరుమనసులకొక తనువై 

ఇరు తనువులకొక మనువై.

మనసులోని వలపులన్నీ 

మల్లెల విరి పానుపులై


ఇరుమనసులకొక తనువై 

ఇరు తనువులకొక మనువై.

మనసులోని వలపులన్నీ 

మల్లెల విరి పానుపులై.

కలిసి వున్న నూరేళ్ళు 

కలలుగన్న వెయ్యేళ్ళు

మూడు ముళ్ళు పడిన నాడు 

ఎదలు పూల పొదరిళ్ళు


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి 

కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం 

వసంతుడే పెళ్ళికొడుకు 

వనమంతా సందడీ

పూలన్నీ తలంబ్రాలు 

పున్నమీ తొలిరేయి


కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం

కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం


పాటల ధనుస్సు 




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు