RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, సెప్టెంబర్ 2026, గురువారం

ఇది చల్లని వేళైనా | Idi Challani Velaina | Song Lyrics | Pooja Phalam (1964)

ఇది చల్లని వేళైనా 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి :


నేరుతునో లేదో ప్రభూ... 

నీ పాటలు పాడా...


ఇది చల్లని వేళైనా... 

ఇది వెన్నెల రేయైనా

నిదుర రాదు కనులకు... 

శాంతి లేదు మనసుకు

మదిలో వేదన ఏదో... 

కదలే రాధకు

ఇది చల్లని వేళైనా...


చరణం 1:


నీ దయలాగున వెన్నెల...

జగమంతా ముంచే

నీ మధుర ప్రేమా..

యమున కడలంతా నించే

మరి మరి ముల్లోకములను...

మురిపించే స్వామీ

మనసు చల్లబడ...

కనిపించవేమీ


ఇది చల్లని వేళైనా


చరణం 2 :


నీ వేణువు కోసం...

బ్రతుకంతా వీనులాయే

నీ దర్శనమునకై...

ఒడలంతా కనులాయే

బడలే బ్రతుకున ఆశలు...

వెలిగించే దేవా

కదలే వీణియ తీగలు...

సవరించి పోవా


ఇది చల్లని వేళైనా...

ఇది వెన్నెల రేయైనా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి | Janmastami Srikrishna Janmastami | Song Lyrics | RKSS Creations

  శ్రీకృష్ణ జన్మాష్టమి పాట జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి రచన : రామకృష్ణ దువ్వు   సాకి: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు