RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, సెప్టెంబర్ 2026, శనివారం

ఓహొ చక్కని చిన్నది | Oho Chakkani Chinnadi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఓహొ చక్కని చిన్నది 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, ఆశాలత కులకర్ణి


పల్లవి:


ఆఅ ఆఅ ఆఅ హా

ఓఓ ఓఓ ఓఓ హో


ఓహొ చక్కని చిన్నది 

వయ్యారంగా వున్నది

ఊరించేటి కన్నులతో 

నన్నే చూడన్నది

చిన్నది చాలా మంచిది 

నిన్నే నమ్ముకున్నది

నీవే తప్ప వేరెవరు 

లేనే లేరన్నది


చరణం 1:


వెచ్చగ జవ్వని తాకితే 

పిచ్చిగ ఊహలు రేగునే

రెపరెపలాడే గుండెల్లోన 

ప్రేమ నిండేనే

అయ్యో పాపం .. 

తీరని తాపం

భావ కవిత్వం చాలునోయి 

పైత్యం లోన జారకోయి

పెళ్ళికి ముందు ప్రణయాలు 

ముళ్ళ బాణాలు


ఓహొ చక్కని చిన్నది 

వయ్యారంగా వున్నది

ఊరించేటి కన్నులతో 

నన్నే చూడన్నది


చరణం 2:


పెద్దల అనుమతి తీసుకో

ప్రేమను సొంతం చేసుకో

హద్దుపద్దు మీరినా ఆటకట్టేను

యస్ అంటారు మావాళ్ళు

నో అంటేను జతరారు

తల్లి తండ్రి కూడంటే 

గుళ్ళో పెళ్ళి చేసుకుందాం

ధైర్యం చేసి నీవేగా దారి చూపావు


చిన్నది చాలా మంచిది 

నిన్నే నమ్ముకున్నది

నీవే తప్ప వేరెవరు 

లేనే లేరన్నది


చరణం 3:


మనసే దోచిన సుందరి

మమతే మల్లె పందిరి

పందిరిలోన మేనులు 

మరచి పరవశించాలి

అపుడే కాదు.. ఎపుడంటావు

తొందరలోనే మూడుముళ్ళు 

అందరిముందు వేయగానే

తోడునీడై కలకాలం సాగిపోదాము


ఓహొ చక్కని చిన్నది 

వయ్యారంగా వున్నది

ఊరించేటి కన్నులతో 

నన్నే చూడన్నది

చిన్నది చాలా మంచిది 

నిన్నే నమ్ముకున్నది

నీవే తప్ప వేరెవరు 

లేనే లేరన్నదీ


ఓఓ ఓఓ ఓఓ హో

ఓఓ ఓఓ ఓఓ హో


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు