ఒకటే హృదయం కోసము
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల
సాకి :
గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చింతింతువే టొమేటో
అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .
పల్లవి:
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
చరణం 1:
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుండు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినుర వేమా.. . .
జతగా చెలిమీ చేసిరీ,
అతిగా కరుణే చూపిరీ
చెలిమే వలపై మారితే
శివశివ మనపని ఆఖరే
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
చరణం 2:
రామునిదొకటే బాణము
జానకి ఆతని ప్రాణము
ప్రేమకు అదియే నీమము
ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోషము
ఒకటే హృదయం కోసమూ
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి