RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

గువ్వలాంటి చిన్నది | Guvvalanti Chinnadi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

గువ్వలాంటి చిన్నది 


చిత్రం: లక్ష్మీ నివాసం (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి. సుశీల


పల్లవి:


గువ్వలాంటి చిన్నది 

తారా జువ్వలాంటి చిన్నది

వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


గువ్వలాంటి చిన్నది 

తారా జువ్వలాంటి చిన్నది

వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


చరణం: 1


మనసైనవాడివని 

సొగసైనవాడివని

ఆ నోట ఆ నోట విన్నదట

మనసైనవాడివని 

సొగసైనవాడివని

ఆ నోట ఆ నోట విన్నదట

ఆ విన్నదంత కళ్లారా కన్నదట

నీ గడుసుతనం చూడాలని 

నీ భరతం పట్టాలని

నిన్న రాత్రి కలలో..

కన్నుగీటి పిలిచావని

నలుగురిలో నిలవేస్తే

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ 

ఓ మొనగాడా

నువ్‌ ఏం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ 

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


చరణం: 2


ముచ్చటైన పొగరుబోతు కుర్రది..

అది

పొంకమైన బింకమైన చిన్నది

ముచ్చటైన పొగరుబోతు కుర్రది..

అది

పొంకమైన బింకమైన చిన్నది

ఆ పెంకిపిల్ల నిన్నే కోరుకున్నది


నీ గుండె దొలుచుకుంది..

నిన్ను వలచుకుంది

చల్లగాలి వీచువేళ..

చందమామ కాచువేళ

చలిచలిగా వుందంటే..

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ 

ఓ మొనగాడా

నువ్వేం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ 

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


చరణం: 3


సిరిసిరి మువ్వసుమా..

చకుముకి రవ్వసుమా

చలగాటం పండించే గవ్వసుమా

సిరిసిరి మువ్వసుమా..

చకుముకి రవ్వసుమా

చలగాటం పండించే 

గవ్వసుమా

నీ కన్నుల్లో నిలిచి వెలుగు 

దివ్వే సుమా

నీ జంటబాయనంది..

నీ వెంటతిరుగుతుందీ

అందర్నీ మరచిపోయి..

అయినవాళ్ళ నిడిచిపెట్టి

తనవేంతే రమ్మంటే

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


ఆ..గువ్వలాంటి చిన్నది 

తారా జువ్వలాంటి చిన్నది

వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!

ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా

నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..

ఓ మొనగాడా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓహో ఊరించే అమ్మాయీ | Oho Oorinche Ammayi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

ఓహో ఊరించే అమ్మాయీ  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ పల్లవి: ఓహో..ఊరించ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు