RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత | Ille Devatha | Song Lyrics | Lakshmi Nivasam (1968)

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత 


చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్. జానకి


పల్లవి :


ఇల్లే కోవెల చల్లని వలపే దేవత

ఇల్లూ వలపూ వనితే వనిత

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత

ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత


చరణం 1 :


నుదుట కుంకుమరేఖ 

కంటికి కాటుకరేఖ..

నుదుట కుంకుమరేఖ 

కంటికి కాటుకరేఖ

జడలో తెల్లని విరులు 

యువతికి తరగని సిరులు

జడలో తెల్లని విరులు 

యువతికి తరగని సిరులు

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత

ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత


చరణం 2 :


తులసికోటలో దీపము

కలకాలము వెలిగే వరము

తులసికోటలో దీపము

కలకాలము వెలిగే వరము

చెలుని నవ్వుల స్నేహము

చెలుని నవ్వుల స్నేహము

నెలతకు జీవన భాగ్యము

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత

ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత


చరణం 3 :


చదువులు ఎన్నో చదివిన

పదవులు ఎన్నో ఏలిన

చదువులు ఎన్నో చదివిన

పదవులు ఎన్నో ఏలిన

చివరకు గృహిణిగ మారే

పడతుల బ్రతుకే - ధన్యం

చివరకు గృహిణిగ మారే

పడతుల బ్రతుకే - ధన్యం

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత

ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కాశీకి పోయాను రామా హరి | Kashikipoyanu Ramahari | Song Lyrics | Appuchesi Pappukudu (1959)

కాశీకి పోయాను రామా హరి  చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : పింగళి నాగేంద్రరావు  నేపథ్య గానం :  ఘంటస...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు