RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

నవ్వు నవ్వించు | Navvu Navvinchu | Song Lyrics | Lakshmi Nivasam (1968)

నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు

 చిత్రం: లక్ష్మీ నివాసం (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి. సుశీల


పల్లవి:


నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు

ఉహు..ఉహూహూ..

నా ఊహలు లాలించు

నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు

ఉహు..ఉహూహూ..

నా ఊహలు లాలించు

నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు


చరణం: 1


నాలో వయసుంది 

నవనవలాడింది

నీలో మనసుంది 

నిగనిగలాడింది

నాలో వయసుంది 

నవనవలాడింది

నీలో మనసుంది 

నిగనిగలాడింది

కువకువలాడే కోరికలన్నీ 

ఘుమఘుమలాడాలి

కువకువలాడే కోరికలన్నీ 

ఘుమఘుమలాడాలి


నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు

ఉహు..ఉహూహూ..

నా ఊహలు లాలించు

నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు


చరణం: 2


ఎదుటను నీవుంటే 

ఏదో సిగ్గు సుమా

చిలిపిగ చూస్తూంటే..

తలపులు రేగు సుమా

ఎదుటను నీవుంటే 

ఏదో సిగ్గు సుమా

చిలిపిగ చూస్తూంటే..

తలపులు రేగు సుమా

రెక్కలు విప్పి టక్కరి 

వలపు రెపరెపలాడాలి

రెక్కలు విప్పి టక్కరి 

వలపు రెపరెపలాడాలి


నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు

ఉహు..ఉహూహూ..

నా ఊహలు లాలించు

నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు


చరణం: 3


ఆశలు పొంగాయి 

అల్లరి చేశాయి

నీలో ఉబలాటం..

నాలో చెలగాటం

ఆశలు పొంగాయి 

అల్లరి చేశాయి

నీలో ఉబలాటం..

నాలో చెలగాటం

తొందరచేసే అందం 

పూచి పందిరి వేయాలి

తొందరచేసే అందం 

పూచి పందిరి వేయాలి


నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు

ఉహు..ఉహూహూ..

నా ఊహలు లాలించు

నవ్వు..నవ్వించు..

ఆ నవ్వులు పండించు


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నవ్వు నవ్వించు | Navvu Navvinchu | Song Lyrics | Lakshmi Nivasam (1968)

నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల పల్లవి: నవ్వు..నవ్విం...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు