RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ANR songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ANR songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, అక్టోబర్ 2026, ఆదివారం

నీ చెలిమి నేడే కోరితినీ | Nee Chelimi Nede Korithini | Song Lyrics | Aradhana (1962)

నీ చెలిమి నేడే కోరితినీ 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  నార్ల చిరంజీవి

నేపధ్య గానం :  పి.సుశీల


పల్లవి :


నీ చెలిమి నేడే కోరితినీ.. 

ఈ క్షణమే ఆశ వీడితినీ

నీ చెలిమి...

పూవు వలె ప్రేమ దాచితినీ 

పూజకు నే నోచనై తిని


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


చరణం 1 :


మనసు తెలిసిన మన్నింతువని 

తీయని వూహల తేలితి నేనే

మనసు తెలిసిన మన్నింతువని 

తీయని వూహల తేలితి నేనె

పరుల సొమ్మై పోయినావని.. 

నలిగె నా మనసె


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


చరణం 2 :


చెదరి పోయిన హృదయములోన.. 

పదిల పరచిన మమతలు నీకే

చెదరి పోయిన హృదయములోన.. 

పదిల పరచిన మమతలు నీకే

భారమైన దూరమైన.. 

బ్రతుకు నీ కొరకే


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


- పాటల ధనుస్సు


నా హృదయంలో నిదురించే చెలి | Naa Hrudayamlo | Song Lyrics | Aradhana (1962)

నా హృదయంలో నిదురించే చెలి 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి

మయూరివై వయ్యారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి


చరణం 1 :


నీ కన్నులలోన దాగెనులే 

వెన్నెల సోన

కన్నులలోన దాగెనులే 

వెన్నెల సోన

చకోరమై నిను వరించి 

అనుసరించినానే..  

కలవరించినానే


నా హృదయంలో నిదురించే చెలీ


చరణం 2 :


నా గానములో నీవే ప్రాణముగ 

పులకరించినావే ..

ప్రాణముగా పులకరించినావే.. 

పల్లవిగా పలుకరించ రావే..

పల్లవిగా పలుకరించ రావే


నీ వెచ్చని నీడ.. 

వెలసెను నా వలపుల మేడ

వెచ్చని నీడ.. 

వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయి సాచి 

ఎదురు చూచినానే.. 

నిదురకాచినానే 


నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి

మయూరివై వయ్యారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి


- పాటల ధనుస్సు


వెన్నెల లోనీ వికాసమే | Vennelaloni Vikasame | Song Lyrics | Aradhana (1962)

వెన్నెల లోనీ వికాసమే 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి.సుశీల

 

పల్లవి :


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతి గా 

నిదురించుము ఈ రేయి..

నిదురించుము ఈ రేయి..


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా


చరణం 1 :


వాడని పూవుల తావితో..

కదలాడే సుందర 

వసంతమీ కాలము

కదలాడే సుందర 

వసంతమీ కాలము..


చెలి జోలగ పాడే 

వినోద రాగాలలో...

చెలి జోలగ పాడే 

వినోద రాగాలలో...

తేలెడి కల సుఖాలలో... 

నిదురించుము ఈ రేయీ..

నిదురించుము ఈ రేయీ


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా


చరణం 2 :


భానుని వీడని చాయగా... 

నీ భావము లోనే చరింతునోయీ సఖ

నీ భావములోనే చరింతునోయీ సఖ


నీ సేవలలోనే తరింతునోయీ సదా...

నీ సేవలలోనే తరింతునోయీ సదా..

నీ ఎదలోనే వసింతులే... 

నిదురించుము ఈ రేయీ

నిదురించుము ఈ రేయీ


వెన్నెలలోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతిగా 

నిదురించుము ఈ రేయి..

నిదురించుము ఈ రేయి... 

నిదురించుము ఈ రేయి


- పాటల ధనుస్సు


ఆడదాని ఓరచూపుతో | Adadani Orachuputho | Song Lyrics | Aradhana (1962)

ఆడదాని ఓరచూపుతో 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

రచన : ఆరుద్ర 

నేపధ్య గానం :  ఎస్ జానకి


పల్లవి :


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి 

నిన్నుచూడ కరిగిపోదువోయ్


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


చరణం 1 :


మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. 

కటారి రూపులోన కైపులున్నవి

రంగేళి ఆటకు రడీగా ఉన్నది

రంగేళి ఆటకు రడీగా ఉన్నది...  

కంగారు ఎందుకోయీ 


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


చరణం 2 :


ఖరీదు లేనివి ఖరారు అయినవి...  

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

ఖరీదు లేనివి ఖరారు అయినవి... 

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద..

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద...  

సుఖాల తేలవొయీ


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి 

నిన్నుచూడ కరిగిపోదువోయ్


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


- పాటల ధనుస్సు


12, సెప్టెంబర్ 2026, శనివారం

ఒకటే హృదయం కోసము | Okate Hrudayam Kosamu | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఒకటే హృదయం కోసము 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


సాకి :


గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను

రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ

ఏల ఇట్టుల చింతింతువే టొమేటో

అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .


పల్లవి:


ఒకటే హృదయం కోసము 

ఇరువురి పోటీ దోషము

ఒకటే హృదయం కోసమూ


చరణం 1:


ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి

మధ్య నలిగినాడు మాధవుండు

ఇద్దరతివలున్న ఇరకాటమేనయా

విశ్వదాభిరామ వినుర వేమా..  . .


జతగా చెలిమీ చేసిరీ, 

అతిగా కరుణే చూపిరీ


చెలిమే వలపై మారితే 

శివశివ మనపని ఆఖరే

ఒకటే హృదయం కోసము 

ఇరువురి పోటీ దోషము

ఒకటే హృదయం కోసమూ


చరణం 2:


రామునిదొకటే బాణము 

జానకి ఆతని ప్రాణము

ప్రేమకు అదియే నీమము 

ప్రేయసి ఒకరే న్యాయము 


ఒకటే హృదయం కోసము 

ఇరువురి పోటీ దోషము

ఒకటే హృదయం కోసమూ


- పాటల ధనుస్సు


కిలకిల నవ్వులు చిలికిన | Kila Kila Navvulu Chilikina | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

కిలకిల నవ్వులు చిలికిన 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


పల్లవి:


కిలకిల నవ్వులు చిలికిన.. 

పలుకును నాలో బంగారువీణ

కరగిన కలలే నిలిచిన.. 

విరిసెను నాలో మందారమాల


చరణం 1:


రమ్మని మురళీరవమ్ములు పిలిచె

రమ్మని మురళీరవమ్ములు పిలిచె

అణువణువున బృందావని తోచె

తళతళలాడే తరగలపైన 

అందీ అందని అందాలు మెరిసె


కిలకిల నవ్వులు చిలికిన.. 

పలుకును నాలో బంగారువీణ


చరణం 2:


నీవున్న వేరే సింగారములేల

నీవున్న వేరే సింగారములేల

నీ పాదధూళి సింధూరము కాదా

మమతలు దూసి మాలలు చేసి 

గళమున నిలిపిన కళ్యాణి నీవే


కరగిన కలలే నిలిచిన.. 

విరిసెను నాలో మందారమాల


చరణం 3:


నీ కురులే నన్ను సోకిన వేళ

నీ కురులే నన్ను సోకిన వేళ

హాయిగ రగిలేను తీయని జ్వాల

గలగల పారే వలపులలోనే 

సాగెను జీవనరాగాల నావ


కిలకిల నవ్వులు చిలికిన.. 

పలుకును నాలో బంగారువీణ

కిలకిల నవ్వులు చిలికినా


- పాటల ధనుస్సు


నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి | Neeko Thodu Kavali | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


పల్లవి:


నీకో తోడు కావాలి 

నాకో నీడ కావాలి,

ఇదిగో పక్కనుంది 

చక్కనైన జవ్వని

ఓ నన్నే నీదాన్ని 

చేసుకోవాలి


చరణం 1:


నవనాగరీక జీవితాన 

తేలుదాం,

నైటుక్లబ్బులందు 

నాట్యమాడి సోలుదాం

హో హో హొ హో


నువ్వు అందమైన 

టిప్పుటాపు బాబువి,

నేను అంతకన్న 

అప్టుడేటు బేబిని


వగలాడి నీకు తాళి 

బరువు ఎందుకు,

ఎగతాళి చేసి దాని 

పరువు తీయకు


నీకో తోడు కావాలి 

నాకో నీడ కావాలి

ఇదిగో పక్కనుంది 

చక్కనైనజవ్వని

ఓ తల్లీ దయచేయి 

కోటిదండాలు


చరణం 2:


నేను పేరుపడిన వారి 

ఇంట పుట్టి పెరిగాను,

ఏదో హారుమణి వాయిస్తూ 

పాడుకుంటాను


దనిస నిదనిప 

మగదిస దిగమప


నేను చదువులేనిదాననని 

అలుసు నీకేల,

నీకు కలసివచ్చు లక్షలాస్తి 

విడిచిపోనేల


నీతో వియ్యం 

దినదినగండం,

మీ ఆస్తి కోసం ఆత్మ 

నేను అమ్ముకోజాల


నీకో తోడు కావాలి 

నాకో నీడ కావాలి

ఇదిగో పక్కనుంది 

చక్కనైన జవ్వని


ఓ తల్లి దయచేయి 

కోటిదండాలు


చరణం 3:


సిరులూ నగలూ 

మాకు లేవోయి,

తళుకూ బెళుకుల 

మోజు లేదోయి

హహహా...

చదువూ సంస్కృతి 

సాంప్రదాయాలు

తెలుగుతనమే మా 

రత్నహారాలు


ధనరాశి కన్న 

నీ గుణమే మిన్న,

నీలో సంస్కార

కాంతులున్నాయి


నీకో బ్రూటు దొరికిందీ

మెడలో జోలె కడుతుందీ

ఈమె కాలి గోటి ధూళి 

పాటి చేయరు

ఓ త్వరగా దయచేస్తె 

కోటి దండాలు


నీకో తోడు కావాలి 

నాకో నీడ కావాలి

ఓహో పక్కనున్న 

చక్కనైన జవ్వనీ,

హాయ్ నిన్నే నాదాన్ని 

చేసుకుంటాను


- పాటల ధనుస్సు


వినిపించని రాగాలే | Vinipinchani Ragale | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

వినిపించని రాగాలే కనిపించని అందాలే 


చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం:  పి.సుశీల


పల్లవి:


ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....

వినిపించని రాగాలే 

కనిపించని అందాలే

అలలై మదినే కలచే 

కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే 

కనిపించని అందాలే ఏ ఏ...


చరణం 1:


తొలిచూపులు నాలోనే 

వెలిగించే దీపాలే

తొలిచూపులు నాలోనే 

వెలిగించే దీపాలే

చిగురించిన కోరికలే 

చిలికించెను తాపాలే

వలచే మనసే మనసు


వినిపించని రాగాలే 

కనిపించని అందాలే ఏ ఏ...


చరణం 2:


వలపే వసంతముల 

పులకించి పూచినది

వలపే వసంతముల 

పులకించి పూచినది

చెలరేగిన తెమ్మెరలే 

గిలిగింతలు రేపినవి

విరిసే వయసే వయసు


వినిపించని రాగాలే 

కనిపించని అందాలే...

చరణం 3:


వికసించెను నా వయసే 

మురిపించు ఈ సొగసే

విరితేనెల వెన్నెలలో 

కొరతేదో కనిపించే

ఎదలో ఎవరో మెరిసే 


వినిపించని రాగాలే 

కనిపించని అందాలే...

అలలై మదినే కలచే 

కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే 

కనిపించని అందాలే


- పాటల ధనుస్సు


10, సెప్టెంబర్ 2026, గురువారం

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది | Adavalla Kopamlo | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: దాశరథి 

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల  


పల్లవి: 


ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 

అహ అందులోనే అంతులేని 

అర్ధమున్నది.. అర్ధమున్నదీ 

మొదటి రోజు కోపం అదో రకం శాపం 

పోను పోను కలుగుతుంది 

భలే విరహ తాపం 

బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు 

తన మాటలందు చేతలందు 

పొత్తు కుదరదు పొత్తు కుదరదు 


చరణం 1: 


పడుచు వాడి మిడిసిపాటు 

పైన పటారం 

ఒక గడుసు పిల్ల కసర గానే 

లోన లొటారం 

పడుచువానీ .. ఒహో... 

పడుచు వాడి మిడిసిపాటు 

పైన పటారం 

ఒక గడుసు పిల్ల కసర గానే 

లోన లొటారం 


వగలాడి తీపి తిట్టు 

తొలి వలపు తేనె పట్టు 

ఆ తేనె కోరి చెంత చేర 

చెడామడా కుట్టు 


చరణం 2: 


పెళ్లికాని వయసులోని 

పెంకి పిల్లలు ఒహో 

తమ కళ్ళతోనే మంతనాలు 

చేయుచుందురు 

పెళ్లికాని వయసులోని 

పెంకి పిల్లలు ఒహో 

తమ కళ్ళతోనే మంతనాలు 

చేయుచుందురు 


వేడుకొన్న రోషం అది 

పైకి పగటి వేషం 

వెంటపడిన వీపు విమానం 


చరణం 3: 


చిలిపి కన్నె హృదయమెంతో 

చిత్రమైనది 

అది చిక్కు పెట్టు క్రాసు వర్డు 

పజిలు వంటిది 

చిలిపికన్నె.. ఉహూ... 

చిలిపి కన్నె హృదయమెంతో 

చిత్రమైనది 

అది చిక్కు పెట్టు క్రాసు వర్డు 

పజిలు వంటిది 


ఆ పజిలు పూర్తి చేయి 

తగు ఫలితముండునోయి ఆ 

మరపు రాని మధురమైన 

ప్రైజు దొరుకునోయి


- పాటల ధనుస్సు


3, సెప్టెంబర్ 2026, గురువారం

ఇది చల్లని వేళైనా | Idi Challani Velaina | Song Lyrics | Pooja Phalam (1964)

ఇది చల్లని వేళైనా 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి :


నేరుతునో లేదో ప్రభూ... 

నీ పాటలు పాడా...


ఇది చల్లని వేళైనా... 

ఇది వెన్నెల రేయైనా

నిదుర రాదు కనులకు... 

శాంతి లేదు మనసుకు

మదిలో వేదన ఏదో... 

కదలే రాధకు

ఇది చల్లని వేళైనా...


చరణం 1:


నీ దయలాగున వెన్నెల...

జగమంతా ముంచే

నీ మధుర ప్రేమా..

యమున కడలంతా నించే

మరి మరి ముల్లోకములను...

మురిపించే స్వామీ

మనసు చల్లబడ...

కనిపించవేమీ


ఇది చల్లని వేళైనా


చరణం 2 :


నీ వేణువు కోసం...

బ్రతుకంతా వీనులాయే

నీ దర్శనమునకై...

ఒడలంతా కనులాయే

బడలే బ్రతుకున ఆశలు...

వెలిగించే దేవా

కదలే వీణియ తీగలు...

సవరించి పోవా


ఇది చల్లని వేళైనా...

ఇది వెన్నెల రేయైనా


- పాటల ధనుస్సు


ఎందు దాగి ఉన్నావో బృందావిహారి | Endu Daagi Vunnavo | Song Lyrics | Pooja Phalam (1964)

ఎందు దాగి ఉన్నావో బృందావిహారి 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నిను గానకా...మనజాలరా..

ఆ..ఆ.ఆ


ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి...

ఈ..బృందావిహారి

నీ పాదధూళినై 

నిలువనీయవోయి...

ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి... 

బృందావిహారి..


చరణం 1:


తీసిన గంధపు.. 

వాసనలారెను

అల్లిన దండల ..

మల్లెలు వాడెను

కన్నయ్య నీ సన్నిధి కరవై..

కన్నయ్య నీ సన్నిధి కరవై..

ఘడియే యుగమై పోయెనురా...

ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి...

ఈ..బృందావిహారి..


- పాటల ధనుస్సు 


11, ఆగస్టు 2026, మంగళవారం

అందెను నేడే అందని జాబిల్లి | Andenu Nede Andani Jabilli | Song Lyrics | Atma Gowravam (1966)

అందెను నేడే అందని జాబిల్లి 



చిత్రం: ఆత్మగౌరవం (1966) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: దాశరథి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి: 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి... 


చరణం 1: 


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు 

ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు 

నిదురించిన ఆశలు చిగురించెలే 

నిదురించిన ఆశలు చిగురించెలే... 

చెలికాడే నాలో తలపులు రేపెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 2: 


నా చెక్కిలి మెల్లగ మీటగనే 

నరనరముల వీణలు మ్రోగినవి 

గిలిగింతల నా మేను పులకించెలే 

గిలిగింతల నా మేను పులకించెలే.. 

నెలరాజే నాతో సరసములాడెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 3: 


ఇక రాలవు కన్నుల ముత్యములు 

ఇక వాడవు తోటల కుసుమములు 

వినువీధిని నామది విహరించెలే.. 

వినువీధిని నామది విహరించెలే.. 

వలరాజే నాలో వలపులు చిలికెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి


- పాటల ధనుస్సు 


ఒక పూలబాణం తగిలింది మదిలో | Oka Poola Banam | Song Lyrics | Atma Gowravam (1966)

ఒక పూలబాణం తగిలింది మదిలో 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..

ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే... 

నాలో వెలిగిందిలే...


చరణం 1:


అలనాటి కలలే ఫలియించే నేడే

అలనాటి కలలే ఫలియించే నేడే

మనసైన వాడే మనసిచ్చినాడే

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

వసంతాల అందాల 

ఆనందాల ఆడాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే...


చరణం 2:


ఏ పూర్వబంధమో అనుబంధమాయే

ఏ పూర్వబంధమో అనుబంధమాయే..

అపురూపమైన అనురాగమాయె....


నీ కౌగిట హాయిగా సోలిపోయి...

నీ కౌగిట హాయిగా సోలిపోయి ...

సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా 

ఊగాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...


- పాటల ధనుస్సు 


9, ఆగస్టు 2026, ఆదివారం

ప్రేమించనిదే పెళ్ళాడనని | Preminchanide Pelladanani | Song Lyrics | Atma Gowravam (1966)

ప్రేమించనిదే పెళ్ళాడనని 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత : ఆరుద్ర, 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ప్రేమించనిదే పెళ్ళాడనని 

తెగకోతలు కోశావులే...

ఆ మాటలు ఏమైనవి? అహా! 

అయ్యగారు ఓడారులే..


ఉహు..ఉహు...

పెళ్ళాడనిదే ప్రేమించనని 

తెగ లెక్చరు దంచావులే...

నీ మాటకు.. నీ చేతకు.. అహ 

అంతు పొంతు లేదాయలే..


నీ వలపు తెలుపక ఊ అంటివి 

నా తలపు తెలియక ఔనంటివి

నీ వలపు తెలుపక ఊ అంటివి 

నా తలపు తెలియక ఔనంటివి

నీ ఆశయం ఏమైనది? అహ! 

నీటిమూట అయిపోయెలే

ప్రేమించనిదే పెళ్ళాడనని 

తెగకోతలు కోశావులే


చరణం 1:


శ్రీరంగనీతులు చెప్పావులే 

చిత్రంగ ప్లేటును తిప్పావులే...

శ్రీరంగనీతులు చెప్పావులే 

చిత్రంగ ప్లేటును తిప్పావులే

అమ్మాయిలు ఎటు బొంకినా 

ఆహా అందమెంతొ చిందేనులే

ప్రేమించనిదే పెళ్ళాడనని 

తెగకోతలు కోశావులే


చరణం 2:


ఈ సొగసు నవ్వి కవ్వింతులే... 

నా వయసు నిన్నే బాధించులే

కనుపాపలో నిను దాచితే 

నను వీడి పోలేవులే....

అహ...నను వీడి పోలేవులే....


చరణం 3:


పైపైన మెరుగులు కొన్నాళ్లవే 

మదిలోన మమతలు పూయాలిలే...

వయ్యారమే ఒలికించినా 

అయ్యగారు చలియించరు..

ఆహా! అయ్యగారు చలియించరు ...


ప్రేమించనిదే పెళ్ళాడనని 

తెగకోతలు కోశావులే...

నీ మాటకు.. నీ చేతకు.. 

అహ అంతు పొంతు లేదాయలే..


ప్రేమించనిదే పెళ్ళాడనని 

తెగకోతలు కోశావులే


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు