RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, ఆగస్టు 2026, మంగళవారం

అందెను నేడే అందని జాబిల్లి | Andenu Nede Andani Jabilli | Song Lyrics | Atma Gowravam (1966)

అందెను నేడే అందని జాబిల్లి 



చిత్రం: ఆత్మగౌరవం (1966) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: దాశరథి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి: 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి... 


చరణం 1: 


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు 

ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు 

నిదురించిన ఆశలు చిగురించెలే 

నిదురించిన ఆశలు చిగురించెలే... 

చెలికాడే నాలో తలపులు రేపెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 2: 


నా చెక్కిలి మెల్లగ మీటగనే 

నరనరముల వీణలు మ్రోగినవి 

గిలిగింతల నా మేను పులకించెలే 

గిలిగింతల నా మేను పులకించెలే.. 

నెలరాజే నాతో సరసములాడెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 3: 


ఇక రాలవు కన్నుల ముత్యములు 

ఇక వాడవు తోటల కుసుమములు 

వినువీధిని నామది విహరించెలే.. 

వినువీధిని నామది విహరించెలే.. 

వలరాజే నాలో వలపులు చిలికెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు | Maarajulocharu | Song Lyrics | Atma Gowravam (1966)

మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు  చిత్రం: ఆత్మగౌరవం (1966) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల, బి వసం...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు