జననీ జననీ జననీ
చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: దేవులల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల
సాకి :
శ్రీ బాగ్యరేఖామ్ - ఉపపాదయన్తి
శివంకరీమ్ - సింధుర మందయానామ్
శీతాంశుబింబ ప్రతిమాన వక్రామ్
శీతాద్రి పుత్రీమ్ శిరసా నమామి
పల్లవి :
జననీ జననీ జననీ
నవ లావణ్య వాహిని మోహిని
శరణం నీ శరణం
శ్రీకరి భవహరి గౌరీ శంకరి
చరణముకడవాలని
శిరమిడి పూజించని
జననీ జననీ జననీ
నవ లావణ్య వాహిని మోహిని
చరణం 1 :
నటియించే నీ కాలి యందియల
గంటల గలగలలేవి దేవి
చెలియించే నీకేలి కంకణపు
మువ్వల సవ్వడలేవీ దేవి
ఊగి తూగు సిగ పాయలలో
తురిమిన తారకలేవి దేవి
ఆ సుందర సుందర రూపం
ఈ చండీప్రియ హృదయ దీపం
సుమమృదు హాసిని
సుమధుర భాషిణి
సువర్ణ పీఠా ధ్యాసిని
చరణం 2 :
మెడలో కదిలే సర్పహారములు
పొగడ సరాలుగ మార్చిన దేవి
జ్వలియించే నీ పాల నేత్రమును
అరుణ తిలకముగా మార్చిన దేవి
ఎంత చల్లని తల్లివో గాని
వింతలు వింతలు నీ చేతలు
ఆ మధుర మధుర దరహాసం
ఆ మంజుల నాట్య విలాసం
సుమమృదు హాసిని
సుమధుర భాషిణి
సువర్ణ పీఠా ధ్యాసిని
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి