RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

9, ఆగస్టు 2026, ఆదివారం

ప్రేమించి పెళ్ళి చేసుకో | Preminchi Pellichesuko | Song Lyrics | Atma Gowravam (1966)

ప్రేమించి పెళ్ళి చేసుకో 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత : ఆరుద్ర, 

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


ఓ సోదరసోదరీమణులారా...

ఆదరించి నా మాట వింటారా...

వింటాం చెప్పు..


ప్రేమించి పెళ్ళి చేసుకో... 

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


ప్రేమించి పెళ్ళి చేసుకో... 

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


చరణం 1:


వరుని వలపేమిటో 

వధువు తలపేమిటో

తెలుసుకోలేక పెళ్ళిళ్ళు 

జరిపించినా...

వరుని వలపేమిటో 

వధువు తలపేమిటో

తెలుసుకోలేక పెళ్ళిళ్ళు 

జరిపించినా...

తెలిసి కట్నాలకై 

బతుకు బలి చేసినా

కడకు మిగిలేది 

ఎడమోము పెడమోములే....


ప్రేమించి పెళ్ళి చేసుకో... 

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


చరణం 2:


మనిషి తెలియాలిలే... 

మనసు కలవాలిలే

మరచిపోలేని స్నేహాన 

కరగాలిలే....

మనిషి తెలియాలిలే... 

మనసు కలవాలిలే

మరచిపోలేని స్నేహాన 

కరగాలిలే.


మధురప్రణయాలు 

మనువుగా మారాలిలే....

మారి నూరేళ్ళ పంటగా 

వెలగాలిలే....


ప్రేమించి పెళ్ళి చేసుకో... 

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


చరణం 3:


నలుడు ప్రేమించి 

పెళ్ళాడె దమయంతిని

వలచి రుక్మిణియే 

పిలిపించె శ్రీకృష్ణుని...

నలుడు ప్రేమించి 

పెళ్ళాడె దమయంతిని

వలచి రుక్మిణియే 

పిలిపించె శ్రీకృష్ణుని.....


తొలుత మనసిచ్చి 

మనువాడె దుష్యంతుడు....

పాత ఒరవళ్ళు దిద్దాలి 

మీరందరూ...


ప్రేమించి పెళ్ళి చేసుకో... 

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ప్రేమించనిదే పెళ్ళాడనని | Preminchanide Pelladanani | Song Lyrics | Atma Gowravam (1966)

ప్రేమించనిదే పెళ్ళాడనని  చిత్రం: ఆత్మగౌరవం (1966) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు  గీతరచయిత : ఆరుద్ర,  నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: ప్రేమించ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు