RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, ఆగస్టు 2026, శనివారం

రగిలింది విప్లవాగ్ని ఈరోజు | Ragilindi Viplavagni | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

రగిలింది విప్లవాగ్ని ఈరోజు 


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణ రావు

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్ పి బాలు,


రగిలింది విప్లవాగ్ని ఈరోజు

అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు


తనువులోన అణువణువూ 

తరతరాల పోరాటం

తన రూపే దాల్చింది 

ఝాన్నీరాణి కరవాలం

జలియన్ వాలాబాగున 

జరిగిన మారణ కాండ

తలచి ఎగురవేశాడు 

తిరుగుబాటు జెండా

తిరుగుబాటు జెండా


కన్నెగంటి హనుమంతు 

వెన్నలోని బాకు

కత్తిగట్టి సాగమంది 

కడవిజయం వరకు

ఎలుగెత్తెను ఆ కంఠం 

మనదేరాజ్యం

జపియించెను ఆ వదనం 

"వందేమాతరం”


వందేమాతరం మంటూ 

నినదించిన బంగారం

స్వరాజ్యమ్మ జన్మహక్కని 

చాటిన మహరాష్ట్ర,

హించకు ప్రతి హింస అన్న 

వీరభూమి పాంచాలం

అన్నిటికి నెలవాయను 

ఆంధ్ర వీర హృదయం


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

Happy Happy Christmas | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

Happy Happy Christmas   చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974) సంగీతం: పి.ఆదినారాయణ రావు సాహిత్యం: పి.ఆదినారాయణ రావు గానం: రీటా త్యాగరాజన్ Song:...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు