ప్రేమించనిదే పెళ్ళాడనని
చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర,
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ప్రేమించనిదే పెళ్ళాడనని
తెగకోతలు కోశావులే...
ఆ మాటలు ఏమైనవి? అహా!
అయ్యగారు ఓడారులే..
ఉహు..ఉహు...
పెళ్ళాడనిదే ప్రేమించనని
తెగ లెక్చరు దంచావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ
అంతు పొంతు లేదాయలే..
నీ వలపు తెలుపక ఊ అంటివి
నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి
నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది? అహ!
నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని
తెగకోతలు కోశావులే
చరణం 1:
శ్రీరంగనీతులు చెప్పావులే
చిత్రంగ ప్లేటును తిప్పావులే...
శ్రీరంగనీతులు చెప్పావులే
చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా
ఆహా అందమెంతొ చిందేనులే
ప్రేమించనిదే పెళ్ళాడనని
తెగకోతలు కోశావులే
చరణం 2:
ఈ సొగసు నవ్వి కవ్వింతులే...
నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే
నను వీడి పోలేవులే....
అహ...నను వీడి పోలేవులే....
చరణం 3:
పైపైన మెరుగులు కొన్నాళ్లవే
మదిలోన మమతలు పూయాలిలే...
వయ్యారమే ఒలికించినా
అయ్యగారు చలియించరు..
ఆహా! అయ్యగారు చలియించరు ...
ప్రేమించనిదే పెళ్ళాడనని
తెగకోతలు కోశావులే...
నీ మాటకు.. నీ చేతకు..
అహ అంతు పొంతు లేదాయలే..
ప్రేమించనిదే పెళ్ళాడనని
తెగకోతలు కోశావులే
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి