RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, ఆగస్టు 2026, బుధవారం

మసక పడితే నిదరపట్టదు | Masakapadithe Nidura pattadu | Song Lyrics | Chandipriya (1980)

మసక పడితే నిదరపట్టదు 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: పి.ఆదినారాయణరావు

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం:  యస్.పి.బాలు, పి.సుశీల,


పల్లవి :


మసక పడితే నిదరపట్టదు

నిదర పడితే పక్క కుదరదు

పక్క కుదిరితే కాకతగ్గదు

ఎన్నెట్లో ఎండేసిపో - లేదంటే

నట్టింట్లో నువ్వుండిపో


మసక పడితే నిదరపట్టదు

నిదర పడితే పక్క కదరదు

పక్క కుదిరితే కాకతగ్గదు

కౌగిట్లో నన్నుంచుకో కాదంటే

నట్టేట్లో నను ముంచిపో


చరణం 1 :


ఏరల్లే వచ్ఛింది ఈడు

అది ఎల్లువైతే ఎవరు తోడు

మనసులోతు తెలుసుకోరా

వడ్డునీవై వరుసుకోరా

నింగి వొంగి నేల పొంగి

ముద్దులాడే పొద్ధుకాడ

జాబిల్లితో వచ్ఛిపో

తొలిరేయి జామల్లే గుర్తుండిపో


చరణం 2 :


తెలిమంచు వానల్లే నువ్వూ

చలిమంట లవ్వల్లే నవ్వూ

పురులువిప్పి పులకరించి

మరులు నాలో చిలకరించు

కడలివంక వాగువంక 

పరుగు తీసే పదునుమీద

సూరీడుతో వచ్ఛిపో 

మరుపొద్ధు రావద్దని చెప్పిపో


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏలెలో ఏలెలో ఏలేలో హైలెస్సా | Elelo Elelo Elelo | Song Lyrics | Chandipriya (1980)

ఏలెలో  ఏలెలో  ఏలేలో హైలెస్సా  చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల  పల్లవి :  ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు