RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, ఆగస్టు 2026, శనివారం

నిన్నలేని అందమేదో | Ninnaleni Andamedo | Song Lyrics | Pooja Phalam (1964)

నిన్నలేని అందమేదో 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో

తెలియరాని రాగమేదో 

తీయ సాగెనెందుకో... 

తీయ సాగెనెందుకో.. నాలో...

నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో


చరణం 1:


పూచిన ప్రతి తరువొక వధువూ

పువుపువ్వున పొంగెను మధువు

ఇన్నాళ్ళీ శోభలన్నీ 

ఎచట దాగెనో


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో


చరణం 2:


తెలి నురుగులె నవ్వులుకాగా

సెలయేరులు కులుకుతు రాగా

కనిపించని వీణలేవో 

కదలి మ్రోగెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదురలేచెనెందుకో


చరణం 3:


పసిడి అంచు పైట జారా

ఆ... ఓ...

పయనించే మేఘ బాల

అరుణ కాంతి సోకగానే 

పరవశించెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో....


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు