బ్రతుకే నేటితో బరువై పోయెలే
చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: పి.సుశీల
పల్లవి:
బ్రతుకే నేటితో బరువై పోయెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే...
మదిలో ఆశలే మసిగా మారెలే...
బ్రతుకే నేటితో బరువై పోయెలే
చరణం 1:
వెలుగే వేడగా చీకటి నిండెనే
వెలుగే వేడగా చీకటి నిండెనే...
వలపే కోరగా వగపె కలిగే...
ఆరని శోకమే ఆహుతి చేసెనే...
బ్రతుకే నేటితో బరువై పోయెలే...
చరణం 2:
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా..
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా...
తీరని వేదనా రగిలించేవా...
బ్రతుకే నేటితో బరువై పోయెలే....
చరణం 3:
శిలవై పోదువో... కలవై పోదువో...
సగమై ఆగినా కథ అయిపోదువో...
కంటికి ధారగా కరిగే పోదువో....
కంటికి ధారగా కరిగే పోదువో....
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి