RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kanchana songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kanchana songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2026, మంగళవారం

బ్రతుకే నేటితో బరువై పోయెలే | Brathuke Netitho | Song Lyrics | Atma Gowravam (1966)

బ్రతుకే నేటితో బరువై పోయెలే 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి:


బ్రతుకే నేటితో బరువై పోయెలే

బ్రతుకే నేటితో బరువై పోయెలే...

మదిలో ఆశలే మసిగా మారెలే...

బ్రతుకే నేటితో బరువై పోయెలే


చరణం 1:


వెలుగే వేడగా చీకటి నిండెనే

వెలుగే వేడగా చీకటి నిండెనే...

వలపే కోరగా వగపె కలిగే...

ఆరని శోకమే ఆహుతి చేసెనే...

బ్రతుకే నేటితో బరువై పోయెలే...


చరణం 2:


నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి

నీ వారందరూ బలి కావాలా..

నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి

నీ వారందరూ బలి కావాలా...


తీరని వేదనా రగిలించేవా...

బ్రతుకే నేటితో బరువై పోయెలే....


చరణం 3:


శిలవై పోదువో... కలవై పోదువో...

సగమై ఆగినా కథ అయిపోదువో...

కంటికి ధారగా కరిగే పోదువో....

కంటికి ధారగా కరిగే పోదువో....


- పాటల ధనుస్సు 


అందెను నేడే అందని జాబిల్లి | Andenu Nede Andani Jabilli | Song Lyrics | Atma Gowravam (1966)

అందెను నేడే అందని జాబిల్లి 



చిత్రం: ఆత్మగౌరవం (1966) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: దాశరథి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి: 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి... 


చరణం 1: 


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు 

ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు 

నిదురించిన ఆశలు చిగురించెలే 

నిదురించిన ఆశలు చిగురించెలే... 

చెలికాడే నాలో తలపులు రేపెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 2: 


నా చెక్కిలి మెల్లగ మీటగనే 

నరనరముల వీణలు మ్రోగినవి 

గిలిగింతల నా మేను పులకించెలే 

గిలిగింతల నా మేను పులకించెలే.. 

నెలరాజే నాతో సరసములాడెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 


చరణం 3: 


ఇక రాలవు కన్నుల ముత్యములు 

ఇక వాడవు తోటల కుసుమములు 

వినువీధిని నామది విహరించెలే.. 

వినువీధిని నామది విహరించెలే.. 

వలరాజే నాలో వలపులు చిలికెనులే 


అందెను నేడే అందని జాబిల్లి 

నా అందాలన్నీ ఆతని వెన్నెలలే 

అందెను నేడే అందని జాబిల్లి


- పాటల ధనుస్సు 


ఒక పూలబాణం తగిలింది మదిలో | Oka Poola Banam | Song Lyrics | Atma Gowravam (1966)

ఒక పూలబాణం తగిలింది మదిలో 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..

ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే... 

నాలో వెలిగిందిలే...


చరణం 1:


అలనాటి కలలే ఫలియించే నేడే

అలనాటి కలలే ఫలియించే నేడే

మనసైన వాడే మనసిచ్చినాడే

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

వసంతాల అందాల 

ఆనందాల ఆడాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే 

నాలో వెలిగిందిలే...


చరణం 2:


ఏ పూర్వబంధమో అనుబంధమాయే

ఏ పూర్వబంధమో అనుబంధమాయే..

అపురూపమైన అనురాగమాయె....


నీ కౌగిట హాయిగా సోలిపోయి...

నీ కౌగిట హాయిగా సోలిపోయి ...

సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా 

ఊగాలోయి


ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...

నాలో వెలిగిందిలే...


- పాటల ధనుస్సు 


9, ఆగస్టు 2026, ఆదివారం

రానని రాలేనని ఊరకె అంటావు | Raanani Ralenani | Song Lyrics | Atma Gowravam (1966)

రానని రాలేనని ఊరకె అంటావు 


చిత్రం: ఆత్మగౌరవం (1966)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


రానని రాలేనని 

ఊరకె అంటావు

రావలని ఆశ లేనిదే 

ఎందుకు వస్తావు


రానని రాలేనని 

ఊరకె అంటావు

రావలని ఆశ లేనిదే 

ఎందుకు వస్తావు...


చరణం 1:


కొంటె చూపు చూడకు 

గుండె కోత కోయకు

కోపమందు కులుకు చూపి 

కోర్కె పెంచకు....

కొంటె చూపు చూడకు 

గుండె కోత కోయకు

కోపమందు కులుకు చూపి 

కోర్కె పెంచకు...

వేషమైనా మోసమైనా 

అంతా నీ కోసం ...


ఊహూ...అలాగా...


రానని రాలేనని

ఊరకె అంటావు

రావలని ఆశ లేనిదే 

ఎందుకు వస్తావు...


చరణం 2:


ఎదను గాయమున్నది 

ఊరడించమన్నది

మొదట ముద్దు తీర్చమని 

మూల్గుచున్నది...

పాపం...


ఎదను గాయమున్నది 

ఊరడించమన్నది

మొదట ముద్దు తీర్చమని 

మూల్గుచున్నది..


గుండె మీద వాలి చూడు 

గోడు వింటావు

ష్...అబ్బబ్బబ్బా...


రానని రాలేనని 

ఊరకె అంటావు

రావలని ఆశ లేనిదే 

ఎందుకు వస్తావు


చరణం 3:


దోర వయసు వేడిలో 

కోరచూపు వాడిలో

దూరమైన మనసు పడే 

బాధ అయ్యయ్యో...

దోర వయసు వేడిలో 

కోరచూపు వాడిలో

దూరమైన మనసు పడే 

బాధ అయ్యయ్యో...


కరుణ చూపి కరుగకున్న 

టాటా... చీరియో

టాటా... చీరియో


రానని రాలేనని 

ఊరకె అంటావు

రావలని ఆశ లేనిదే 

ఎందుకు వస్తావు....


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

తూరుపు సింధూరపు మందారపు | Toorupu Sindhurapu | Song Lyrics | Manushulu Marali (1969)

తూరుపు సింధూరపు మందారపు 


చిత్రం :  మనుషులు మారాలి (1969)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం... 

ఉదయరాగం.. హృదయగానం

తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం

మరల మరల ప్రతియేడు 

మధుర మధురగీతం...

జన్మదిన వినోదం

మరల మరల ప్రతియేడు 

మధుర మధుర గీతం..

జన్మదిన వినోదం


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 1:


వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వీచే మలయమారుతాలు ...

పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే...

మలిచెకాంతి తోరణాలు..

ఓ..ఓ...హోయ్


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 2:


వలపులోన పులకరించు 

కన్నులతో ...

చెలిమి చేరి పలకరించు 

మగవారు

మనసులోన పరిమళించు 

వెన్నెలతో...

ప్రియుని చూచి పరవశించే 

ప్రియురాలు

జీవితమే స్నేహమయం... 

ఈ జగమే ప్రేమమయం.. 

ప్రేమంటే ఒక భోగం

కాదు కాదు అది త్యాగం ..

ఓ..ఓ...హోయ్..


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


- పాటల ధనుస్సు 



1, జనవరి 2026, గురువారం

సరిసరీ వగలు తెలిసెర | Sari Sari Vagalu Telisera | Song Lyrics | Bhakta Tukaram (1973)

సరిసరీ వగలు తెలిసెర


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  పి.సుశీల 


పల్లవి :


సరిసరీ వగలు తెలిసెర గడసరీ

చిగురు సొగసులు నీవే లేరా... ఆ...

సరిసరీ వగలు తెలిసెర గడసరీ

చిగురు సొగసులు నీవే లేరా... ఆ...

సరిసరీ....


చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...

చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...

చెంతకు రమ్మన చేరనంటినా...

చెక్కిలినొక్కిన కూడదంటినా...


తొలిఝామైనా  కానిదే...

తొలిఝామైనా  కానిదే...

తొందర ఎందుకు ఎందుకంటిరా...

సరిసరీ....


చరణం : 1


ఆ... మంచి గంధం పూయకముందే..  

మల్లెమొగ్గలు చల్లకముందే

మంచి గంధం పూయకముందే..  

మల్లెమొగ్గలు చల్లకముందే...


కులుకుటందెలు మోగకముందే

కొత్త జావళి పాడకముందే....

గరిస నిపమప ససని ససనిసని

నినిప నినిపనిప

మగప మనిపసని పపాని

పమగమ గపామగ సనిస

ఆ... ఆ... ఆ...


కొత్త జావళి పాడకముందే

కంటి గిలుపుల జంట తలపుల

కొంటి చేతల కవ్వింతలింకేల 

చాలించవేరా...


సరిసరీ వగలు తెలిసెర గడసరీ

చిగురు సొగసులు నీవే లేరా... ఆ...

సరిసరీ....


చరణం : 2


ఆ... పండువెన్నెల పానుపు చేసి...

పైట కొంగున వీవన వీచీ...

వేడిముద్దులు కానుక చేసి..

విడని కౌగిట బందీచేసి..

ఎన్నడెరుగని.. వన్నెతరుగని

కన్నెవలపులు అందించి...

అందాలు చిందింతులేరా...


సరిసరీ వగలు తెలిసెర గడసరీ

చిగురు సొగసులు నీవే లేరా... ఆ...

సరిసరీ....


- పాటల ధనుస్సు 


31, డిసెంబర్ 2025, బుధవారం

పూజకు వేళాయెరా | Poojaku Velayera | Song Lyrics | Bhakta Tukaram (1973)

పూజకు వేళాయెరా


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


పూజకు వేళాయెరా...

రంగపూజకు వేళాయెరా... ఆ...

పూజకు వేళాయెరా...


అనుపల్లవి :


ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో

ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో


పిలుపును విని విచ్చేసితివని

నా పిలుపును విని విచ్చేసితివని

వలపులన్నీ నీ కొరకె దాచితిని    

వలపులన్నీ నీ కొరకె దాచితిని

ఎవరూ పొందని ఏకాంతసేవలో...

ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు...

పూజకు వేళాయె...

పూజకు వేళాయెరా...


చరణం 1 :


ఈ నీలినీలి ముంగురులు... 

ఇంద్రనీలాల మంజరులు

ఈ వికసిత సిత నయనాలు... 

శతదళ కోమల కమలాలు

అరుణారుణమీ అధరము... 

తరుణమందార పల్లవము

ఎదలో పొంగిన ఈ రమణీయ 

పయోధరాలు...

పాలకడలిలో ఉదయించు 

సుధాకలశాలు...

ఎంత సుందరము 

శిల్ప బంధురము

ఈ... జఘన మండలము...

సృష్టినంతటిని దాచుకున్న 

ఆ పృథివీ మండలము


ఓ... అభినవ సౌందర్యరాశీ...

ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ...

నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

 నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

మధురిమలెన్నో పొదుగుకున్న

నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో....

అప్రమేయ దివ్యానందాలను 

అందించే నీ చల్లని ఒడిలో

హాయిగా నిదురించ గలిగే...

పాపగా నీ కడుపున 

జన్మించు భాగ్యమే

లేదాయె తల్లీ... తల్లీ.... తల్లీ...


స్వామీ....

అవునమ్మా నీవు ప్రదర్శించిన

సౌందర్యం అనిత్యం

నీవు నమ్ముకున్న 

యవ్వనం అశాశ్వతం..


దువ్వుకున్న ఆ నీలిముంగురులె 

దూదిపింజలై పోవునులే

నవ్వుతున్న ఆ కంటి వెలుగులే 

దివ్వెల పోలిక ఆరునులే

వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే 

వాడి వక్కలై పోవునులే

పాలుపొంగు ఆ కలశాలే 

తోలుతిత్తులై పోవునులే

నడుము వంగగా నీ ఒడలు కుంగగా...

నడుము వంగగా ఒడలు కుంగగా...

నడువలేని నీ బడుగు జీవితం... 

వడవడ వణకునులే

ఆశలు రేపే సుందర దేహము 

అస్థిపంజరంబౌనులే...


పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ


విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 


- పాటల ధనుస్సు 


29, నవంబర్ 2025, శనివారం

ఈ రేయి కవ్వించింది | Eereyi Kavvinchindi | Song Lyrics | Manchivadu (1974)

ఈ రేయి కవ్వించింది


చిత్రం :  మంచివాడు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది

ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది

రా.. నీలో దాచుకో.. 

నా పరువాలే పంచుకో

రా.. నీలో దాచుకో.. 

నా పరువాలే పంచుకో


చరణం 1:


చిలిపి మనసు నా మాట వినదు.. 

దోరవయసు ఇక ఊరుకోదు

చిలిపి మనసు నా మాట వినదు.. 

దోరవయసు ఇక ఊరుకోదు


మనసు మాటే విందాములే..

మనసు మాటే విందాములే.. 

వయసు ఆటే ఆడేములే


రా.. లోకం మరచిపో.. 

లే ముద్దులలో మురిసిపో

రా..రా లోకం మరచిపో.. 

లే ముద్దులలో మురిసిపో


చరణం 2:


నిండు వలపుల నీ కౌగిలింత.. 

ఉండిపోని జీవితమంతా

నిండు వలపుల నీ కౌగిలింత.. 

ఉండిపోని జీవితమంతా


కెంపు సొంపుల చెంపలు నావే..

కెంపు సొంపుల చెంపలు నావే... 

మధువులూరే అధరాలు నావే


రా.. నాలో నిండిపో.. 

నా అశలనే పంచుకో

రా.. నాలో నిండిపో.. 

నా అశలనే పంచుకో


చరణం 3:


పాలవెన్నెల కురిసేటి వేళ... 

మల్లె పానుపు పిలిచేటి వేళ

పాలవెన్నెల కురిసేటి వేళ... 

మల్లె పానుపు పిలిచేటి వేళ


తనువులొకటై పెనవేసుకోనీ..

తనువులొకటై పెనవేసుకోనీ... 

కన్నులొకటై కథల్లుకోనీ


రా ఎదపై వాలిపో.. 

నా ఒడిలోనే సోలిపో

ఉం... రా ఎదపై వాలిపో.. 

నా ఒడిలోనే సోలిపో

ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది...


అహహ.. అహా.. ఆ.. ఆ..

అహహ.. అహా.. ఆ.. ఆ..

ఉముముహు.. ఉముముహు.. 

ఉ.. ఉ..

ఉముముహు.. ఉముముహు.. 

ఉ.. ఉ..  


- పాటల ధనుస్సు 


2, సెప్టెంబర్ 2025, మంగళవారం

పిలిచే వారుంటే పలికేను నేను | Pilichevarunte Palikenu nenu | Song Lyrics | Kalyana Mantapam (1971)

పిలిచే వారుంటే పలికేను నేను



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


పిలిచే వారుంటే.. పలికేను నేను

పిలిచే వారుంటే.. పలికేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను

కనుపాప అద్దాన కదిలేను నేను.. 

ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను

పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 1 :


ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...

ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము

కలకాలము నిలవాలిలే.. 

మన అనురాగము

గోదారిలా నేడు ఉరికేను మనసు.. 


నీ పిలుపు వినగానే.. 

పులకించె బ్రతుకు 

పులకించె బ్రతుకు

పిలిచే వారుంటే.. పలికేను నేను 


హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 

నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే

నా అందమే అరవిందమై 

నిను పూజించెలే 

నీ మనసులో నాకు 

చోటుంటే చాలు

నా బ్రతుకులో విరియు 

నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను...

కనుపాప అద్దాన కదిలేను నేను

ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది 

చెలి ఔనన్నది

సొగసున్నదీ... గుణమున్నదీ 

చెలి నాదైనది 


అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము 


మన మొకటి కాగానే మారాలి జగము

మారాలి జగము.. మారాలి జగము.. 

మారాలి జగము


- పాటల ధనుస్సు 


చుక్కలు పాడే శుభ మంత్రం | Chukkalu Pade Shuba Mantram | Song Lyrics | Kalyana Mantapam (1971)

చుక్కలు పాడే శుభ మంత్రం



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల 


పల్లవి :


చుక్కలు పాడే..  శుభ మంత్రం

దిక్కులు నిండే దివ్య మంత్రం

ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో 

పలికిన వేద మంత్రం

ఇక్కడనే.. ఇపుడే.. ఎవరో.. 

నా చెవిలో ఊదిన మంత్రం.. 

మధు మంత్రం

చుక్కలు పాడే.. శుభ మంత్రం 


చరణం 1 :


రెక్కలపై ఆ గువ్వల జంట ... 

రేకులలో ఆ పువ్వుల జంట

రెక్కలపై ఆ గువ్వల జంట...  

రేకులలో ఆ పువ్వుల జంట

సాగుచునే.. ఊగుచునే..  

మధుర మధురముగ మక్కువగా.. 

చదువుకునే ఆనంద మంత్రం 


చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 2 :


కన్నులు ఒక పరి మూసుకొని.. 

నీవన్నది మరి మరి తలచుకొని

కన్నులు ఒక పరి మూసుకొని.. 

నీవన్నది మరి మరి తలచుకొని

ఒక్కతినే.. నే నొక్కతినే.. 

అదే పనిగనే సదా మనసులో 

ఆలపించే ప్రియ మంత్రం 


చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 3 :


కోవెల దైవం పిలిచే దాకా.. 

ఆవలి ఒడ్డున నిలిచే దాకా

కోవెల దైవం పిలిచే దాకా.. 

ఆవలి ఒడ్డున నిలిచే దాకా

నాలోనే లోలోనే..  నాతి చరామి.. 

నాతి చరామి.. అన్న 

ఆ  ప్రాణ మంత్రం  


చుక్కలు పాడే శుభ మంత్రం 

దిక్కులు నిండే దివ్య మంత్రం

ఎక్కడనో..  ఎపుడో.. ఎవరో 

పలికిన వేద మంత్రం

ఇక్కడనే ఇపుడే ఎవరో.. 

నా చెవిలో ఊదిన మంత్రం 

మధు మంత్రం

చుక్కలు పాడే శుభ మంత్రం


- పాటల ధనుస్సు 


పలికే వారుంటే హృదయము | Palike Varunte | Song Lyrics | Kalyana Mantapam (1971)

పలికే వారుంటే హృదయము



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


సరిగమ పదనిసానిదప 

మగరిస...  అని

పలికే వారుంటే హృదయము 

తెరిచే వారుంటే

వలచే మనసుకు బదులుగ...  

బదులుగ

పిలిచే కనులకు ఎదురై...  

ఎదురై


పలికే వారుంటే హృదయము 

తెరిచే వారుంటే

వలచే మనసుకు బదులుగ...  

బదులుగ

పిలిచే కనులకు ఎదురై...  

ఎదురై


పలికే వారుంటే...

సరిగమ పదని సానిదప 

మగరిసని


చరణం 1 :


ఒక కోవెలలో ఒకడే దేవుడు

ఒక హృదయములో 

ఒకడే ప్రియుడు


ఒక కోవెలలో ఒకడే దేవుడు

ఒక హృదయములో 

ఒకడే ప్రియుడు

జీవననేత ప్రేమవిధాత... 

జీవననేత ప్రేమవిధాత

అను గుడిగంట విను ప్రతి జంట


సరిగమ పదని సానిదప 

మగరిసని

పలికే వారుంటే హృదయము 

తెరిచే వారుంటే


చరణం 2 :


తీగా తీగా పెనగీ పెనగీ

రాగ ధారగా సాగీ సాగీ


తీగా తీగా పెనగీ పెనగీ

రాగ ధారగా సాగీ సాగీ

జీవన గంగావాహిని కాదా

జీవన గంగావాహిని కాదా

అను ప్రతి జంట విను 

గుడిగంట

సరిగమ పదని సానిదప 

మగరిసని


పలికే వారుంటే హృదయము 

తెరిచే వారుంటే

వలచే మనసుకు బదులుగ...  

బదులుగ

పిలిచే కనులకు ఎదురై ... 

ఎదురై


పలికే వారుంటే...

సరిగమ పదని సానిదప 

మగరిస

అని పలికే వారుంటే హృదయము 

తెరిచే వారుంటే


- పాటల ధనుస్సు 


24, మే 2025, శనివారం

మావూళ్లో ఒక పడుచుంది | Maa Oollo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)

మావూళ్లో ఒక పడుచుంది



చిత్రం: అవేకళ్లు (1967)

సంగీతం: వేదా

గీతరచయిత: కొసరాజు

నేపధ్య గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు 


పల్లవి:


మావూళ్లో ఒక పడుచుంది 

దెయ్య మంటే  భయమన్నది

డడాఢడాఢడడడాఢడ

మావూలళ్లో ఒక పడుచుంది 

దెయ్యమంటే భయమన్నది

ఆవూళ్లో ఒక చిన్నోడు 

నేనున్నాలే పదమన్నాడూ..

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క


హోయ్ - 

మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ - 

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క


హోయ్ 

మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ 

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

హోయ్ 

మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

హోయ్ 

బలెబలెబలెబలెబలె.... య్య


చరణం 1:


కంటిమీద కునుకురాదు 

బావా అంది

కన్ను మూసుకో నన్ను తలచుకో 

పిల్లా అన్నాడు


హోయ్ లాయిలల్ల 

లాయిలల్ల లల్లలల్ల

హోయ్ లాయిలల్ల 

లాయిలల్ల లల్లలల్ల


హోయ్ లాయిలల్ల 

లాయిలలలల్లల్ల లలలలలలల


కంటిమీద.. ఓహో.. కునుకురాదు.. 

ఆహ.. బావా అంది

కన్ను మూసుకో నన్ను తలచుకో 

పిల్లా అన్నాడు


ఓలమ్మో గైరమ్మో 

చీకట్లో చూసిందేదో

ఓలమ్మో గైరమ్మో 

కెవ్వంటూ అరిచిందయ్యో


హటకే హటకే హటకే

అరె - బతకే బతకే బతకే

హటకే హటకే హటకే

అరె - బతకే బతకే బతకే


హోయ్ 

బలెబలెబలెబలెబలె - య్యా


మా వూళ్లో ఒక పడుచుంది 

దెయ్యమంటే భయమన్నది

ఆవూళ్లో ఒక చిన్నోడు 

నేనున్నాలే పదమన్నాడూ


చరణం 2:


బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే - 

ఓహో - బాబోయి అంది

అత్తకొడుకుని అరవబోకులే 

పిల్లా అన్నాడు


వోయ్.. లాయిలల్ల 

లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల

వోయ్.. లాయిలల్ల 

లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల

వోయ్ లాయిలల్ల లాయిలల్ల 

లల్లల్లల్ల లలల లలలలా


ఓలమ్మో గైరమ్మో 

చీకట్లో చూసిందేదో

ఓలమ్మో గైరమ్మో

కెవ్వుమంటూ అరిచిందయ్యో


హటకే హటకే హటకే

అరె - బతకే బతకే బతకే

హోయ్ 

బలెబలెబలెబలెబలె - య్యా


చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క

మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ


చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ

బలెబలెబలెబలెబలె....య్యా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు