ఈ రేయి కవ్వించింది
చిత్రం : మంచివాడు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
ఈ రేయి కవ్వించింది..
నా మేను పులకించింది
ఈ రేయి కవ్వించింది..
నా మేను పులకించింది
రా.. నీలో దాచుకో..
నా పరువాలే పంచుకో
రా.. నీలో దాచుకో..
నా పరువాలే పంచుకో
చరణం 1:
చిలిపి మనసు నా మాట వినదు..
దోరవయసు ఇక ఊరుకోదు
చిలిపి మనసు నా మాట వినదు..
దోరవయసు ఇక ఊరుకోదు
మనసు మాటే విందాములే..
మనసు మాటే విందాములే..
వయసు ఆటే ఆడేములే
రా.. లోకం మరచిపో..
లే ముద్దులలో మురిసిపో
రా..రా లోకం మరచిపో..
లే ముద్దులలో మురిసిపో
చరణం 2:
నిండు వలపుల నీ కౌగిలింత..
ఉండిపోని జీవితమంతా
నిండు వలపుల నీ కౌగిలింత..
ఉండిపోని జీవితమంతా
కెంపు సొంపుల చెంపలు నావే..
కెంపు సొంపుల చెంపలు నావే...
మధువులూరే అధరాలు నావే
రా.. నాలో నిండిపో..
నా అశలనే పంచుకో
రా.. నాలో నిండిపో..
నా అశలనే పంచుకో
చరణం 3:
పాలవెన్నెల కురిసేటి వేళ...
మల్లె పానుపు పిలిచేటి వేళ
పాలవెన్నెల కురిసేటి వేళ...
మల్లె పానుపు పిలిచేటి వేళ
తనువులొకటై పెనవేసుకోనీ..
తనువులొకటై పెనవేసుకోనీ...
కన్నులొకటై కథల్లుకోనీ
రా ఎదపై వాలిపో..
నా ఒడిలోనే సోలిపో
ఉం... రా ఎదపై వాలిపో..
నా ఒడిలోనే సోలిపో
ఈ రేయి కవ్వించింది..
నా మేను పులకించింది...
అహహ.. అహా.. ఆ.. ఆ..
అహహ.. అహా.. ఆ.. ఆ..
ఉముముహు.. ఉముముహు..
ఉ.. ఉ..
ఉముముహు.. ఉముముహు..
ఉ.. ఉ..
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి