చూడకు మరీ అంతగా చూడకు
చిత్రం : గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఊఁ... చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకు...
మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు...
మనసుతో చెరలాడకు
చరణం 1 :
విరుల పానుపున పరచిన మల్లెలు...
ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
విరుల పానుపున పరచిన మల్లెలు...
ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు...
అదే పనిగ చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు...
అదే పనిగ చూస్తున్నాయి
ఇన్ని చూడగా లేనిది... ఊఁ...
నేను చూడనేమైనది
ఊఁ...... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ......
హాయ్... ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.
చూడని చూడనీ చూడనీ చూడనీ
చూసిన అందమె...
తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ...
తేనె మనసు తెర తీయనీ
చరణం 2 :
అసలే ఏవో మిసిమి కోరికలు...
కొసరి కొసరి నను కవ్వించె
అసలే ఏవో మిసిమి కోరికలు...
కొసరి కొసరి నను కవ్వించె
ఆపై నాలో గడుసు వెన్నెలలు...
హాయిహాయిగా రగిలించె
ఇంక నన్ను కదిలించకు...
ఎదలో చూపులు దించకు
ఊఁ... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ...
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.
చూడకూ చూడకు చూడకూ చూడకు
చూడకు చూడకు...
మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు...
మనసుతో చెరలాడకు
చూడని చూడనీ...ఆఁ.....
చూడనీ చూడనీ... ఆఁ.....
చూసిన అందమె
తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ...
తేనె మనసు తెరతీయనీ... ఆఁ.....
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి