RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, నవంబర్ 2025, సోమవారం

ఆకలుండదు దాహముండదు | Akalundadu Dahamundadu | Song Lyrics | Manchivadu (1973)

ఆకలుండదు దాహముండదు


చిత్రం :  మంచివాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటే


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటె

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటె

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటె....


చరణం 1:


మల్లెలుండవు వెన్నెలుండవు 

నీ నవ్వే లేకుంటే

మనసు వుండదు మమత వుండదు 

నీ మనిషిని కాకుంటే

మల్లెలుండవు వెన్నెలుండవు 

నీ నవ్వే లేకుంటే

మనసు వుండదు మమత వుండదు 

నీ మనిషిని కాకుంటే


వయసుతో ఈ పోరువుండదు 

నీ వలపే లేకుంటే...

వలపు ఇంత వెచ్చగుండదు 

నీ ఒడిలో కాకుంటే..

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


చరణం 2:


పొద్దు గడిచేపోతుంది 

నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది 

నీ చూపు పడుతుంటే...

పొద్దు గడిచేపోతుంది 

నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది 

నీ చూపు పడుతుంటే...


ఆకు మడుపులు అందిస్తూ 

నువ్వు వగలుపోతుంటే...

ఎంత ఎరుపో.. అంత వలపని 

నేనాశపడుతుంటే...

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


చరణం 3:


తేనెకన్న తీపికలదని 

నీ పెదవే తెలిపింది

దానికన్న తీయనైనది 

నీ ఎదలో దాగుంది..

తేనెకన్న తీపికలదని 

నీ పెదవే తెలిపింది

దానికన్న తీయనైనది 

నీ ఎదలో దాగుంది


మొదటిరేయికి తుదేలేదని 

నీ బుగ్గే కొసరింది

పొద్దు చాలని ముద్దులన్నీ 

నీ వద్దే దాచింది...

ఆ ముద్రే మిగిలింది..


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు