నీలో నేనై నాలో నీవై
చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సి.నారాయణరెడ్డి
పల్లవి:
నీలో..ఓ.. నేనై.. నేనై.. నేనై..
నాలో..ఓ.. నీవై.. నీవై.. నీవై
నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
చరణం 1:
పడమట సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగి చూసి
కారు చీకటి దారిలోనే
కాంతి విరబూసె
ఆహహా.. హహా.. హహా..
ఓహోహో..హొహో..హొహో..
పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లిని వీడి
కన్నె మనసే తీగ లాగా
కాంతుని పెనవేసె..
ప్రియ కాంతుని పెనవేసె
నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
చరణం 2:
నీలాకాశం నీడలోన
నిండు మమతల మేడలోన
గాలిలాగా పూలలాగా తేలి పోదాము
ఆహహా..హహా.. హహా..
ఓహోహో..హొహో..హొహో..
వలపులోన మలుపులు లేక
బ్రతుకులోన మెలికలు లేక
వాగులున్నా వంకలున్నా..
సాగి పోదాము
చెలరేగి పోదాము..
నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
ఆ..హహహహాహ...
ఓహొహొహొహోహొ..
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి