RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

నీలో నేనై నాలో నీవై | Neelonenai Naaloneevai | Song Lyrics | Alibaba 40 Dongalu (1970)

నీలో నేనై నాలో నీవై


చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


నీలో..ఓ.. నేనై.. నేనై.. నేనై..

నాలో..ఓ.. నీవై.. నీవై.. నీవై


నీలో నేనై నాలో నీవై

తీయని కలలే కందాము

ఎడబాయని జంటగ వుందాము


నీలో నేనై నాలో నీవై

తీయని కలలే కందాము

ఎడబాయని జంటగ వుందాము


చరణం 1:


పడమట సూర్యుడు కన్నుమూసె

తూర్పున చంద్రుడు తొంగి చూసి

కారు చీకటి దారిలోనే

కాంతి విరబూసె


ఆహహా.. హహా.. హహా.. 

ఓహోహో..హొహో..హొహో..


పెంచిన తోట మాలిని వీడి

పెరిగిన తోట తల్లిని వీడి

కన్నె మనసే తీగ లాగా 

కాంతుని పెనవేసె..

ప్రియ కాంతుని పెనవేసె


నీలో నేనై నాలో నీవై

తీయని కలలే కందాము

ఎడబాయని జంటగ వుందాము


చరణం 2:


నీలాకాశం నీడలోన

నిండు మమతల మేడలోన

గాలిలాగా పూలలాగా తేలి పోదాము


ఆహహా..హహా.. హహా.. 

ఓహోహో..హొహో..హొహో..


వలపులోన మలుపులు లేక

బ్రతుకులోన మెలికలు లేక

వాగులున్నా వంకలున్నా.. 

సాగి పోదాము

చెలరేగి పోదాము..


నీలో నేనై నాలో నీవై

తీయని కలలే కందాము

ఎడబాయని జంటగ వుందాము


ఆ..హహహహాహ... 

ఓహొహొహొహోహొ..


- పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. చాలాచాలా మంచి పాట ముఖ్యంగా పెంచినతోటమాలిని వీడి - పెరిగినతోట తల్లిని వీడి... అంటూ ఒక కన్నె ల్లితండ్రులను వీడి తన కాంతుడిదగ్గరికి వెళ్ళే విధానానతని రమ్యంగా ర్ణించారు సినారే గారు అవ్

    రిప్లయితొలగించండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన | Guttapalli Chelalona | Telugu Folk Song Lyrics | RKSS Creations

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన జానపద గేయం  రచన : రామకృష్ణ దువ్వు  పల్లవి :  గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన పాలకంకి సొగసులున్న నవరంగీ గుత్త...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు