RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

ఈ రోజుల్లో పడుచువారు | Eerojullo Paduchuvaru | Song Lyrics | Atmeeyulu (1969)

ఈ రోజుల్లో పడుచువారు


చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు

వీలైతే హుషారు కాకుంటే కంగారు

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు

వీలైతే హుషారు కాకుంటే కంగారు

ఈరోజుల్లో.. ఓ ఓ ఓ .....


చరణం 1:


తాజా తాజా మోజుల కోసం 

తహతహలాడుతు ఉంటారు

తాజా తాజా మోజుల కోసం 

తహతహలాడుతు ఉంటారు

పొట్టి షర్ట్లతో టైటు ప్యాంట్లతో 

లొట్టి పిట్టలవుతుంటారు

మెప్పులు కోసం.. అప్పులు చేసి

మెప్పులు కోసం అప్పులు చేసి 

తిప్పలపాలవుతుంతారు


ఈరోజుల్లో.. ఓ ఓ ఓ .....


చరణం 2:


రోడ్డు సైడున రోమియోలలా 

రోజంతా బీటేస్తారు

రోడ్డు సైడున రోమియోలలా 

రోజంతా బీటేస్తారు

సొగసరి చిన్నది కంటపడిందా 

చూపులతో మింగేస్తారు

ఆ చిన్న కాస్తా.. చెయ్యి విసిరితే

ఆ చిన్నది కాస్త చెయ్యి విసిరితే 

చెప్పకుండా చెక్కేస్తారు


ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు

వీలైతే హుషారు కాకుంటే కంగారు

ఈరోజుల్లో.. ఓ ఓ ఓ .....


చరణం 3:


పాఠాలకు ఎగనామం పెట్టి 

మ్యాటిని షోలకు తయ్యారు

పాఠాలకు ఎగనామం పెట్టి 

మ్యాటిని షోలకు తయ్యారు

పార్టీలంటూ పికినికులంటూ 

పుణ్యకాలము గడిపేరు

పరీక్ష రోజులు.. ముంచుకురాగా

పరీక్ష రోజులు ముంచుకురాగా 

తిరుపతి ముడుపులు కడతారు


ఈరోజుల్లో ... 

పడుచువారు గడుసువారు

సహనంలో కిసానులు 

సమరంలో జవానులు

ఈరోజుల్లో.. ఓ ఓ ....


ఆడపిల్లలను గౌరవించితే 

ఆత్మ గౌరవం పెరిగేను

సమరసభావం కలిగిన నాడే 

చదువుల విలువలు పెరిగేను

దేశానికి వెన్నెముకలు మీరు 

దివాళ కోరులు కావద్దు

భవితవ్యానికి బాటలు వేసే 

భారం మనదని మరవద్దు

ఆ భారం మనదని మరవద్దు... 

మనదని మరవొద్దు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు