RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, నవంబర్ 2025, శనివారం

ఖుషీ ఖుషీగా నవ్వుతు | Khushi Kushiga Navvuthu | Song Lyrics | Iddaru Mitrulu (1961)

ఖుషీ ఖుషీగా నవ్వుతు



చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేవెందుకే 

నిషా కనులదానా?


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేవెందుకే 

నిషా కనులదానా?


ఓ..ఓ..

మేనాలోన ప్రియునిజేర 

వెళ్ళింది నా చెలి మీనా

మేనాలోన ప్రియునిజేర 

వెళ్ళింది నా చెలి మీనా

నింగిదాటి ఆనంద సాగరం 

పొంగిపొరలె నాలోన


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగొలిపేదిందుకే 

నిషా కనుల వాడ


చరణం 1:


ఒహో చెలియా నీవుకుడా 

ఓ పెళ్ళి పల్లకీ చూసుకో

ఒహో చెలియా నీవుకుడా 

ఓ పెళ్ళి పల్లకీ చూసుకో

హాయికొలుపు సన్నాయి పాటలో 

వలపుబాటలే వేసుకో


నే వెళితే మరి నీవు, 

మజ్నూవవుతావూ

నే వెళితే మరి నీవు, 

మజ్నూవవుతావూ


మజ్ను నేనైతే ఓ లైలా 

లోకమే చీకటై పోవునే

మజ్ను నేనైతే ఓ లైలా 

లోకమే చీకటై పోవునే


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగా వుందాములే 

నిషా కనుల వాడ


చరణం 2:


ఆకాశంలో ఇంద్రధనస్సుపై 

ఆడుకుందమా నేడే

నీలి నీలి మేఘాల రధముపై 

తేలిపోదామీనాడే


చంద్రుడు నేనై నీవు వెన్నెలై 

కలసిపోదమా హాయిగా

నేను వీణనై నీవు నాదమై 

ఏకమౌదమా తీయగా


ఖుషీ ఖుషీగా నవ్వుతు 

చెలాకి మాటలు రువ్వుతు

హుషారుగా వుందాములే 

హమేషా మజాగా


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు | Nee Jadakuchulu Naa Medakuchulu | Song Lyrics | Shubhalekha (1982)

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు  చిత్రం : శుభలేఖ (1982) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి సాకి :  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు