RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, నవంబర్ 2025, మంగళవారం

జగదభిరామా రఘుకులసోమా | Jagadabhirama Raghukula Soma | Song Lyrics | Ramayalam (1971)

జగదభిరామా రఘుకులసోమా



చిత్రం : రామాలయం (1971)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా....రామా

కరుణను జూపవయా....


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా....రామా

కరుణను జూపవయా....


చరణం 1 :


కౌశికుయాగము కాచితివయ్యా.. 

రాతిని నాతిగ చేసితివయ్యా

కౌశికుయాగము కాచితివయ్యా.. 

రాతిని నాతిగ చేసితివయ్యా


హరివిల్లు విరిచి మురిపించి సీతను.. 

పరిణయమాడిన కళ్యాణరామా

శరణమునీయవయా....రామా... 

కరుణను జూపవయా....


చరణం 2 :


ఒకటే బాణం ఒకటే మాట.. 

ఒకటే సతియని చాటితివయ్యా

ఒకటే బాణం ఒకటే మాట.. 

ఒకటే సతియని చాటితివయ్యా 


కుజనులనణచి సుజనుల బ్రోచిన...

ఆ....ఆ...

కుజనులనణచి సుజనుల బ్రోచిన.... 

ఆదర్శమూర్తివి నీవయ్యా

శరణమునీయవయా....రామా.. 

కరుణను జూపవయ


జగదభిరామా రఘుకులసోమా.. 

శరణమునీయవయా....రామా 

కరుణను జూపవయా....

జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం

పావననాం మేఘశ్యాం.. 

జయ జయరాం జానకిరాం

 జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం

జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు