RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

అమ్మబాబో నమ్మరాదు | Ammababoy Nammaradu | Song Lyrics | Atmeeyulu (1969)

అమ్మబాబో నమ్మరాదు


చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: కొసరాజు

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


అమ్మబాబో నమ్మరాదు 

ఈ రాలుగాయి అబ్బాయిల 

నమ్మరాదు

అమ్మబాబో నమ్మరాదు 

ఈ రాలుగాయి అబ్బాయిల 

నమ్మరాదు

ప్రేమించామంటారు 

పెద్దగ చెబుతుంటారు

పెళ్ళి మాట ఎత్తగానే 

చల్లగ దిగజారతారు


అమ్మబాబో నమ్మరాదు 

ఈ వగలమారి అమ్మాయిల 

నమ్మరాదు

డబ్బులున్న కుర్రవాళ్ళ 

టక్కున పట్టేస్తారు

లవ్ మ్యారేజీలంటూ 

లగ్నం పెట్టేస్తారు


అమ్మబాబో నమ్మరాదు 

ఈ వగలమారి అమ్మాయిల 

నమ్మరాదు


కట్నాలు పెరుగునని 

కాలేజీకెళతారు

కట్నాలు పెరుగునని 

కాలేజీకెళతారు

హాజరు పట్టి వేసి 

గైరు హాజరవుతారు

మార్కుల కోసం తండ్రుల 

తీర్ధయాత్ర తిప్పుతారు

ఇంజనీర్లు డాక్టర్లయి 

ఇక చూస్కోమంటారు


అమ్మబాబో నమ్మరాదు 

ఈ రాలుగాయి అబ్బాయిల 

నమ్మరాదు


చరణం 1:


వరండాలోన చేరి 

వాల్చూపులు విసురుతారు

వరండాలోన చేరి 

వాల్చూపులు విసురుతారు

సినిమాలు షికార్లంటూ 

స్నేహం పెంచేస్తారు

తళుకు బెళుకు కులుకులతో 

పైట చెంగు రాపులతో

చిటికెలోన అబ్బాయిల 

చెంగున ముడివేస్తారు


అమ్మబాబో నమ్మరాదు 

ఈ వగలమారి అమ్మాయిల 

నమ్మరాదు


చరణం 2:


ఆస్తి వున్న పిల్లయితే 

అందం జోలికి పోరు

కుంటిదైన కురూపైన 

పెళ్ళికి యస్సంటారు

పెళ్ళి అయిన మర్నాడే 

శ్రీవారిని చేతబట్టి

బయటికి అత్తామామల 

దయచేయండంటారూ


అమ్మబాబో నమ్మరాదు 

ఈ వగలమారి అమ్మాయిల 

నమ్మరాదు


చరణం 3:


దిమ్మతిరిగి ఏమిటలా 

తెల్లమొగం వేస్తావు

వలపు దాచుకొని ఎందుకు 

మాటలు దులిపేస్తావు

మనసు మనసు తెలుసుకుందాము

ఇకనైన జల్సాగా కలిసి వుందాము...


మనసు మనసు తెలుసుకుందాము

ఇకనైన జల్సాగా కలిసి వుందాము...


మనసు మనసు తెలుసుకుందాము

ఇకనైన జల్సాగా కలిసి వుందాము...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు