RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

మదిలో వీణలు మ్రోగే | Madilo Veenalu Mroge | Song Lyrics | Atmeeyulu (1969)

మదిలో వీణలు మ్రోగే



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపథ్య గానం: పి. సుశీల


పల్లవి:


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 1:


సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

పాల వెన్నెల స్నానాలు చేసి

పూలు పూసింది 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 2:


కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను 

కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను

అందాల తారయై మెరిసి 

చెలికాని చెంత చేరేను 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 3:


రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

వేణులోలుని రాగాల కోసం 

వేచి ఉన్నదిలే


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు