RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vanisree songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vanisree songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2026, గురువారం

చెప్పాలనుకున్నానూ | Cheppalanukunnanu | Song Lyrics | Doralu Dongalu (1976)

చెప్పాలనుకున్నానూ 


చిత్రం :  దొరలు దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


చెప్పాలనుకున్నానూ.. 

చెప్పలేకపోతున్నానూ..

చెప్పాలనుకున్నానూ.. 

చెప్పలేకపోతున్నానూ

కల్లాకపటం తెలియని నన్ను.. 

కన్నులతో కవ్వి౦చవద్దని

చెప్పాలనుకున్నానూ..  

చెప్పలేకపోతున్నానూ


చెప్పకుండ నా మదిలో దూరి..

చిందర వందర చెయ్యొద్దని.. 

రె౦డివ్వాలనుకున్నానూ

రె౦డివ్వాలనుకున్నానూ.. 

ఇవ్వలేక పోతున్నానూ


చరణం 1 :


ఆడుకునే లతల నడుమ.. 

పాడుకునే పూవులమై

ఆడుకునే లతల నడుమ..  

పాడుకునే పూవులమై

పరిసరాల నన్నిటిని 

పరిమళింప చేద్దామని

పరిమళింప చేద్దామని... 

నే చెప్పాలనుకున్నానూ..  

చెప్పలేకపోతున్నానూ


చరణం 2 :


మేలి ముసుగులోని లజ్జ..  

మెట్లు దిగీ వచ్చిందని

మేలి ముసుగులోని లజ్జ..  

మెట్లు దిగీ వచ్చిందని

తెలిసికూడా తెలియనట్లే.. 

ఒదిగుంటే ఒళ్ళుమండి

ఒదిగుంటే ఒళ్ళుమండి.. 

రె౦డివ్వాలనుకున్నానూ.. 

ఇవ్వలేక పోతున్నానూ


చరణం 3 :


అడగకుండ అందించే..  

ఆలి౦గన మధురము

అడగకుండ అందించే..  

ఆలి౦గన మధురము


వద్దంటూ అందుకునే.. 

వలపు మరీ మధురము


అని చెప్పాలనుకున్నాను.. 

అన్నీ చెప్పేశాను

ఇవ్వాలనుకున్నాను.. 

అన్నీ ఇచ్చేశాను


- పాటల ధనుస్సు


1, జూన్ 2026, సోమవారం

గోవిందా గోవిందా | Govinda Govinda | Song Lyrics | Chilipi Krishnudu (1978)

గోవిందా .. గోవిందా 


చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


గోవిందా .. గోవిందా..

జారిందా.. జారిందా..

కాలు జారిందా.. నేల జారిందా..

హారి కన్నెపిల్ల పైట జారిందా..

పైట జారి ఒంపుసొంపు 

బైట పెట్టిందా..


గోవిందా .. గోవిందా..

జారిందా.. జారిందా..

కాలు జారిందా.. నేల జారిందా..

హారి కన్నెపిల్ల పైట జారిందా..

పైట జారి ఒంపుసొంపు 

బైట పెట్టిందా..

పైట జారి ఒంపుసొంపు 

బైట పెట్టిందా..


గోవిందా .. గోవిందా..


చరణం 1:


కోక తడిసిపోయిందా..

కొత్త మెరుపు తీరిందా

బుర్రు బుర్రు మంటుందా.. 

కొరుక్కు తిందామని వుందా

అహ అహ అహ...


కోక తడిసిపోయిందా..

కొత్త మెరుపు తీరిందా

బుర్రు బుర్రు మంటుందా.. 

కొరుక్కు తిందామని వుందా


కొంగునట్టా గుంజుకోకూ..

కుర్రవాణ్ణి నంజుకోకు

కొంగునట్టా గుంజుకోకూ..

కుర్రవాణ్ణి నంజుకోకు


గోవిందా .. గోవిందా..

జారిందా.. జారిందా..

కాలు జారిందా.. నేల జారిందా..

హారి కన్నెపిల్ల పైట జారిందా..

పైటతోటి పడుచువాడి 

గుండె జారిందా..

పైటతోటి పడుచువాడి 

గుండె జారిందా..


గోవిందా .. గోవిందా..


చరణం 2:


కొంగు గాలి తగిలిందా.. 

కోర్కె కాస్త తీరిందా

తీట నీకు వచ్చిందా..

లోటుపాటు తెలిసిందా

అహ అహ అహ...


కొంగు గాలి తగిలిందా.. 

కోర్కె కాస్త తీరిందా

తీట నీకు వచ్చిందా..

లోటుపాటు తెలిసిందా


ఆశలింకా పెంచుకోకు.. 

అలసిపోయి సోలిపోకు

హాయ్ హాయ్ హాయ్ ..

ఆశలింకా పెంచుకోకూ.. 

అలసిపోయి సోలిపోకు


గోవిందా .. గోవిందా..

జారిందా.. జారిందా..

కాలు జారిందా.. నేల జారిందా..

హారి కన్నెపిల్ల పైట జారిందా..

పైటతోటి పడుచువాడి 

గుండె జారిందా..


పైట జారి ఒంపుసొంపు 

బైట పెట్టిందా..

పైటతోటి పడుచువాడి 

గుండె జారిందా..


గోవిందా .. గోవిందా..


- పాటల ధనుస్సు 


ఎదురు చూసే కళ్ళలో | Eduru Chuse Kallalo | Song Lyrics | Peddakkayya (1967)

ఎదురు చూసే కళ్ళలో


చిత్రం : పెద్దక్కయ్య (1967)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి :


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

చిలక కాని రాచిలక 

తొలి వలపుల వెన్నెల  తునక 


చరణం 1 :


సిగ నిండ పారిజాతాల దండ 

వగలొల్క  చేర రావే

గగనాల నీడ..  మేఘాల వాడ..  

బిగి కౌగలీయ రావే  


సిగ నిండ పారిజాతాల దండ 

వగలొల్క  చేర రావే

గగనాల నీడ..  మేఘాల వాడ..  

బిగి కౌగలీయ రావే  


నన్ను లాలించి... తెన్ను చూపించి... 

మిన్నులందించినావే


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

చిలక కాని రాచిలక 

తొలి వలపుల వెన్నెల  తునక 


చరణం 2 :


తొలి చూపులోనే నిను చేరగానే 

పలికింది మౌనవీణ

మలి చూపులోనే పెనవేయగానే 

కురిసింది పూల వానా


తొలి చూపులోనే నిను చేరగానే 

పలికింది మౌనవీణ

మలి చూపులోనే పెనవేయగానే 

కురిసింది పూల వానా


నీవు నాలోనే... నేను నీలోనే... 

నిండి ఉన్నాము కాదా


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


- పాటల ధనుస్సు 


19, మే 2026, మంగళవారం

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్ | Ellostanoy Mama Mallostanoy | Song Lyrics | Chilipi Krishnudu (1978)

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్ 


చిత్రం : చిలిపి కృష్ణుడు (1978)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి :


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను...

హేయ్ 

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను...


ఎల్లిపోయాననీ ఏడుస్తా కూర్చోకు... 

అయ్యో పాపం

ఎల్లిపోయాననీ ఏడుస్తా  కూర్చోకు

మళ్ళోచేసరికి నన్ను మరచిపోకు..

డుర్..

మామ..మామ..మామ..మామ..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను 


చరణం 1 :


నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను

నిదురమాని మేల్కొంటే నిజమౌతాను

నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను

నిదురమాని మేల్కొంటే నిజమౌతాను


యెనకముందు జనుమలెన్నో 

ఎరిగినట్టె వుంటాను..

ఆ.. ఆ.. యెనకముందు జనుమలెన్నో 

ఎరిగినట్టె వుంటాను

ఎవరూ.. నే ఎవరంటే..

ఎవరు.. నువ్ ఎవరంటే..

వివరంగా చెప్పలేను 


హహహా.. ఎళ్లొస్తానోయ్ మావ 

మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను


చరణం 2 :


గుడి కాడ కలుసుకొన్నాం 

గురుతుందా..

ఈ కొత్తలంగా తెచ్చిచ్చావ్ 

బావుందా

గుడి కాడ కలుసుకొన్నాం 

గురుతుందా..

ఈ కొత్తలంగా తెచ్చిచ్చావ్ 

బావుందా 


మొదటెట్టిన ముద్దు..హాయ్..

మొదటెట్టిన ముద్దు... 

ఇంకా  తియ్యగుందా..

మొదటెట్టిన ముద్దు... 

ఇంకా  తియ్యగుందా..

నీ మొరటుతనం ఇకనైన..  

మారిందా..  మారిందా

మావ..మావ..మావా..మావా..

మావ..మావ..మావా..మావా..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను


చరణం 3 :


ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ

అది పిచ్చిగా మారుతుంది 

నేనుంటేనూ

ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ

అది పిచ్చిగా మారుతుంది 

నేనుంటేనూ 


ఇంటిదాక ఎంటపడి 

రావొద్దు అంటాను

ఆ..హ్హ.. ఇంటిదాక ఎంటపడి 

రావొద్దు అంటాను

ఎందుకూ?.. నే ఎందుకూ?


ఎందుకంటే ఆడనేను 

దయ్యమల్లె  వుంటాను..హాయ్..హాయ్

మావ..మావ..మావా..మావా..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను... 

డుర్ర్...

మావ..మావ..మావా..మావా.. 


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను

 

- పాటల ధనుస్సు 

11, మే 2026, సోమవారం

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ | Ettago Unnado Olammi | Song Lyrics | Dasara Bullodu (1971)

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ 


చిత్రం: దసరా బుల్లోడు (1971)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి:


అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

ఏటేటో ఔతుందే చిన్నమ్మీ

ఆర్ని...ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

ఏటేటో ఔతుందే చిన్నమ్మీ


అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

అట్టాగే ఉంటాది ఓరబ్బీ

ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ

ఆర్నీ..అట్టాగే ఉంటాది ఓరబ్బీ

ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ


చరణం 1:


మొలలోతు నీళ్లల్లో 

మొగ్గల్లె నువ్వుంటే

నీ ఒంటి నిగనిగతో 

నీళ్లూ మెరుస్తుంటే....

మొలలోతు నీళ్లల్లో 

మొగ్గల్లె నువ్వుంటే

నీ ఒంటి నిగనిగతో 

నీళ్లూ మెరుస్తుంటే

పొదచాటున నేను 

మాటేసి చూస్తుంటే.....

నువ్వు తానాలు ఆడావు ఓలమ్మీ

నా ప్రాణాలు తీశావే చిన్నమ్మీ....


అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

అట్టాగే ఉంటాది ఓరబ్బీ

ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....


చరణం 2:


మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు

నీ చక్కదనాలు 

నేనొకటొకటె చూశాను...

మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు

నీ చక్కదనాలు 

నేనొకటొకటె చూశాను....


జడచూస్తి ఆ... మెడచూస్తి ఆహా...

జబ్బల నునుపు చూస్తి హా...

కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ

కసికసిగా చూస్తినే చిన్నమ్మీ....


అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

అట్టాగే ఉంటాది ఓరబ్బీ

ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....


చరణం 3:


తడిసీ నీ తెల్లకోక 

తపాతపామన్నది

తడబడి నా గడుసు మనసు 

దడాదడామన్నది..ఓర్నీ..

తడిసీ నీ తెల్లకోక 

తపాతపామన్నది

తడబడి నా గడుసు మనసు 

దడాదడామన్నది


కళ్లు మూసికొస్తినని...

ఘొల్లున నువ్వు నవ్వితే ఆహ్హహ్హా

చురకల్లె తగిలింది ఓలమ్మీ...

ఉడుకెక్కిపోయిందే చిన్నమ్మీ...


అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె

అట్టాగే ఉంటాది ఓరబ్బీ

ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....


- పాటల ధనుస్సు 


10, మే 2026, ఆదివారం

చేతిలో చెయ్యేసి చెప్పు బావా | Chetilo Cheyyesi Cheppu Bava | Sad | Song Lyrics | Dasara Bullodu (1971)

చేతిలో చెయ్యేసి చెప్పు బావా 


చిత్రం : దసరా బుల్లోడు (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చేసుకొన్న బాసలు 

చెప్పుకొన్న ఊసులు

చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ


చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చేసుకొన్న బాసలు 

చెప్పుకొన్న ఊసులు

చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ

చేతిలో చెయ్యేసి చెప్పు బావా


చరణం 1 :


పాడుకొన్న పాటలూ 

పాతవని ఊరుకో

పాడుకొన్న పాటలూ 

పాతవని ఊరుకో

ఆ మాటలన్ని మాపేసి 

కొత్తపాట పాడుకో


చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చేసుకొన్న బాసలు 

చెప్పుకొన్న ఊసులు

చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ

చేతిలో చెయ్యేసి చెప్పు బావా


చరణం 2 :


మాట తప్పిపోయినా 

మనిషి బ్రతికితే చాలూ

మాట తప్పిపోయినా 

మనిషి బ్రతికితే చాలూ

మన మమత చంపుకొన్న...  

ఒక మంచి మిగిలితేచాలు


చేతిలో చెయ్యేసి చెప్పు బావా


చరణం 3 :


తెలియక మనసిచ్చినా 

తెలిసికుమిలిపోతున్నా

తెలియక మనసిచ్చినా 

తెలిసికుమిలిపోతున్నా

మిమ్ము కలపమనీ 

ముక్కోటి దేవతలకు 

మొక్కుతున్న


చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చేసుకొన్న బాసలు 

చెప్పుకొన్న ఊసులు

చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ

చేతిలో చెయ్యేసి చెప్పు బావా


- పాటల ధనుస్సు 


7, మే 2026, గురువారం

చేతిలో చెయ్యేసి చెప్పు బావ | Chetilo Cheyyesi Cheppu Bava | Song Lyrics | Dasara Bullodu (1971)

చేతిలో చెయ్యేసి చెప్పు బావ


చిత్రం: దసరా బుల్లోడు (1971) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


చేతిలో చెయ్యేసి చెప్పు బావ 

చేసుకొన్న బాసలు 

చెరిగిపోవని మరచిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ 

చేసుకొన్న బాసలు 

చెరిగిపోవని మరచిపోనని 


చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 

చెప్పుకున్న ఊసులు 

మాసిపోవని మారిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 

చెప్పుకున్న ఊసులు 

మాసిపోవని మారిపోనని 


చేతిలో చెయ్యేసి చెప్పు బావ 


చరణం 1: 


పాడుకున్న పాటలు 

పాతబడి పోవని 

చిలిపిగ ఆడుకున్న ఆటలకు 

అలుపురానివ్వనని 

పాడుకున్న పాటలు 

పాతబడి పోవని 

చిలిపిగ ఆడుకున్న ఆటలకు 

అలుపురానివ్వనని 


పడుచు గుండె బిగువులు 

సడలిపోనివ్వనని 

దుడుకుగ ఉరికిన పరువానికి 

ఉడుకు తగ్గిపోదని 


చేతిలో చెయ్యేసి చెప్పు బావ 

చెప్పుకున్న ఊసులు 

మాసిపోవని మారిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 


చరణం 2: 


కన్నెగా కన్న కలలు 

కధలుగా చెప్పాలి 

మన కధ కల కాలం చెప్పినా 

కంచి కెళ్ళకుండాలి 

కన్నెగా కన్న కలలు 

కధలుగా చెప్పాలి 

మన కధ కల కాలం చెప్పినా 

కంచి కెళ్ళకుండాలి 


మన జంట జంటలకే 

కన్ను కుట్టు కావాలి 

ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు 

జంటలై పోవాలి 


చేతిలో చెయ్యేసి చెప్పు బావ 

చేసుకొన్న బాసలు 

చెరిగిపోవని మరచిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 

చెప్పుకున్న ఊసులు 

మాసిపోవని మారిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ


- పాటల ధనుస్సు 


29, మార్చి 2026, ఆదివారం

సోగ్గాడే చిన్నినాయన | Soggade Chinni Nayana | Song Lyrics | Astiparulu (1966)

సోగ్గాడే చిన్నినాయన


చిత్రం: ఆస్థిపరులు (1966)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి:


సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..

సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు 

సోగ్గాడూ.. సోగ్గాడు..


చరణం 1:


కట్టె తుపాకెత్తుకోని 

కట్ట మీద నడుస్తుంటే 

కాలుజారి పడ్డాడే సోగ్గాడు

కట్టె తుపాకెత్తుకోని 

కట్ట మీద నడుస్తుంటే 

కాలుజారి పడ్డాడే సోగ్గాడు

పగటివేషగాడల్లే 

పల్లెటూళ్ళు తిరుగుతుంటే 

కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్.. 

పడుసు పిల్ల ఫక్కుమంది.. హహహ..


సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు 

సోగ్గాడూ.. సోగ్గాడు..


చరణం 2:


కళ్ళజోడు ఏసికోని 

గళ్ళకోటు తొడుక్కోని 

పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు

కళ్ళజోడు ఏసికోని 

గళ్ళకోటు తొడుక్కోని 

పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు

చిట్టివలస వాగుకాడ 

పిట్ట తుర్రుమంటేనూ..

చిట్టివలస వాగుకాడ 

పిట్ట తుర్రుమంటేనూ.. 

బిక్కమొగమేసాడు 

సుక్కలొంక చూసాడూ..

బిక్కమొగమేసాడు 

సుక్కలొంక చూసాడూ..


సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు 

సోగ్గాడూ.. సోగ్గాడు..


చరణం 3:


మూతి మీసం గొరుక్కోని.. 

బోసి మొహం పెట్టుకోని 

యాట కోసం వచ్చాడే సోగ్గాడు

మూతి మీసం గొరుక్కోని.. 

బోసి మొహం పెట్టుకోని 

యాట కోసం వచ్చాడే సోగ్గాడు

బుల్లిదొర వచ్చెనని 

కుక్కపిల్ల ఎక్కిరిస్తే 

ఎర్రిమొహం ఏసాడు.. హోయ్.. 

మిర్రిమిర్రి చూసాడు.. హూ..హోయ్..


సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..

సోగ్గాడే చిన్నినాయన 

ఒక్క పిట్టనైన కొట్టలేడు 

సోగ్గాడూ.. సోగ్గాడు..


- పాటల ధనుస్సు 


24, నవంబర్ 2025, సోమవారం

ఆకలుండదు దాహముండదు | Akalundadu Dahamundadu | Song Lyrics | Manchivadu (1973)

ఆకలుండదు దాహముండదు


చిత్రం :  మంచివాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటే


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటె

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటె

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటె....


చరణం 1:


మల్లెలుండవు వెన్నెలుండవు 

నీ నవ్వే లేకుంటే

మనసు వుండదు మమత వుండదు 

నీ మనిషిని కాకుంటే

మల్లెలుండవు వెన్నెలుండవు 

నీ నవ్వే లేకుంటే

మనసు వుండదు మమత వుండదు 

నీ మనిషిని కాకుంటే


వయసుతో ఈ పోరువుండదు 

నీ వలపే లేకుంటే...

వలపు ఇంత వెచ్చగుండదు 

నీ ఒడిలో కాకుంటే..

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


చరణం 2:


పొద్దు గడిచేపోతుంది 

నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది 

నీ చూపు పడుతుంటే...

పొద్దు గడిచేపోతుంది 

నీ నడక చూస్తుంటే

ఆ నడక తడబడిపోతుంది 

నీ చూపు పడుతుంటే...


ఆకు మడుపులు అందిస్తూ 

నువ్వు వగలుపోతుంటే...

ఎంత ఎరుపో.. అంత వలపని 

నేనాశపడుతుంటే...

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


చరణం 3:


తేనెకన్న తీపికలదని 

నీ పెదవే తెలిపింది

దానికన్న తీయనైనది 

నీ ఎదలో దాగుంది..

తేనెకన్న తీపికలదని 

నీ పెదవే తెలిపింది

దానికన్న తీయనైనది 

నీ ఎదలో దాగుంది


మొదటిరేయికి తుదేలేదని 

నీ బుగ్గే కొసరింది

పొద్దు చాలని ముద్దులన్నీ 

నీ వద్దే దాచింది...

ఆ ముద్రే మిగిలింది..


ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే

వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు 

నువ్వు తోడుంటే

ఆకలుండదు దాహముండదు 

నిన్ను చూస్తుంటే


- పాటల ధనుస్సు 


అమ్మాయే పుడుతుంది | Ammaye Puduthundi | Song Lyrics | Manchivadu (1974)

అమ్మాయే పుడుతుంది 


చిత్రం :  మంచివాడు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది


అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు


చరణం 1:


కోటేరులాంటి ముక్కు 

కోలకళ్ళు..

లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..

చిలిపి నవ్వులు

కోటేరులాంటి ముక్కు... 

కోలకళ్ళు..

లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..

చిలిపి నవ్వులు

ఆ నవ్వుల్లో వస్తాయి 

చిన్ని నొక్కులు..

ఆ నవ్వుల్లో వస్తాయి 

చిన్ని నొక్కులు

..ఆ నొక్కులే తెస్తాయి 

మనకెన్నో సిరులు

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది


చరణం 2:


దోబూచులాడు కళ్ళు.. 

దొంగ చూపులు...

తియ్యతియ్యని మాటలు... ...

తెలివితేటలు...

దోబూచులాడు కళ్ళు.. 

దొంగ చూపులు...

తియ్యతియ్యని మాటలు... ...

తెలివితేటలు..

ఆ మాటలకే పడతారు 

కన్నె పిల్లలు.. 

ఆ మాటలకే పడతారు 

కన్నె పిల్లలు..

ఈ ఆత్తగారికప్పుడు 

ఎందరమ్మా కోడళ్ళు..

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు


చరణం 3:


నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...

ఊహు.. మీలాంటి పిల్లాడ్నే 

కంటాను నేను

అహా.. నీలాంటి ఆడపిల్ల 

కావాలి నాకు...

ఊహు.. మీలాంటి పిల్లాడ్నే 

కంటాను నేను..

ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు? 

ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?

హ హా..హా..


అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అహా...  అమ్మలాగే ఉంటుంది

ఊహు... నాన్నలాగే ఉంటాడు


- పాటల ధనుస్సు 


23, నవంబర్ 2025, ఆదివారం

మదిలో వీణలు మ్రోగే | Madilo Veenalu Mroge | Song Lyrics | Atmeeyulu (1969)

మదిలో వీణలు మ్రోగే



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపథ్య గానం: పి. సుశీల


పల్లవి:


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 1:


సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

పాల వెన్నెల స్నానాలు చేసి

పూలు పూసింది 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 2:


కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను 

కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను

అందాల తారయై మెరిసి 

చెలికాని చెంత చేరేను 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 3:


రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

వేణులోలుని రాగాల కోసం 

వేచి ఉన్నదిలే


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు