RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chandramohan songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chandramohan songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2026, సోమవారం

ఎదురు చూసే కళ్ళలో | Eduru Chuse Kallalo | Song Lyrics | Peddakkayya (1967)

ఎదురు చూసే కళ్ళలో


చిత్రం : పెద్దక్కయ్య (1967)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి :


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

చిలక కాని రాచిలక 

తొలి వలపుల వెన్నెల  తునక 


చరణం 1 :


సిగ నిండ పారిజాతాల దండ 

వగలొల్క  చేర రావే

గగనాల నీడ..  మేఘాల వాడ..  

బిగి కౌగలీయ రావే  


సిగ నిండ పారిజాతాల దండ 

వగలొల్క  చేర రావే

గగనాల నీడ..  మేఘాల వాడ..  

బిగి కౌగలీయ రావే  


నన్ను లాలించి... తెన్ను చూపించి... 

మిన్నులందించినావే


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

చిలక కాని రాచిలక 

తొలి వలపుల వెన్నెల  తునక 


చరణం 2 :


తొలి చూపులోనే నిను చేరగానే 

పలికింది మౌనవీణ

మలి చూపులోనే పెనవేయగానే 

కురిసింది పూల వానా


తొలి చూపులోనే నిను చేరగానే 

పలికింది మౌనవీణ

మలి చూపులోనే పెనవేయగానే 

కురిసింది పూల వానా


నీవు నాలోనే... నేను నీలోనే... 

నిండి ఉన్నాము కాదా


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


ఎదురు చూసే కళ్ళలో 

ఒదిగి ఉన్నది ఎవ్వరో

రాజు కాని నా రాజూ 

అనురాగములో రేరాజు 


- పాటల ధనుస్సు 


25, ఏప్రిల్ 2026, శనివారం

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా | Chetiki Gajulla Kallaku Katukala | Song Lyrics | Radha Kalyanam (1981)

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా


చిత్రం : రాధా కళ్యాణం (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : జ్యోతిర్మయి

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి :


చేతికి గాజుల్లా.. 

కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. 

రాధకు మాధవుడూ..


చేతికి గాజుల్లా.. 

కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. 

రాధకు మాధవుడూ..


చరణం 1:


మానసమున నీ ప్రణయము 

మారు మ్రోగగా

కావ్య గానా మాలపించి 

కవినే నేనైతి

మానసమున నీ ప్రణయము 

మారు మ్రోగగా

కావ్య గానా మాలపించి 

కవినే నేనైతి


మధు మాసము చెలి మోమున 

విరబూయగనే

మధు మాసము చెలి మోమున 

విరబూయగనే

హావ భావ రాగ తాళములను 

మేళవించితి


ఏటికి కెరటంలా 

పాటకు చరణంలా

సీతకు రాముడిలా 

రాధకు మాధవుడూ..

 

చేతికి గాజుల్లా.. 

కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. 

రాధకు మాధవుడూ..


చరణం 2:


పూల పరిమళాల గాలి 

పలుకరించగా

నీలి నీలి మేఘ మాల 

పరవశించెను

పూల పరిమళాల గాలి 

పలుకరించగా

నీలి నీలి మేఘ మాల 

పరవశించెను 


నవనీతపు చెలి హృదయము 

నను చేరగనే

నవనీతపు చెలి హృదయము 

నను చేరగనే

అతిశయమున బ్రతుకు వీణ 

శృతులు చేసెను


పగటికి సూర్యుడిలా 

రేయికి జాబిలిలా

గౌరికి ఈశునిలా 

రాధకు మాధవుడూ.. 

 

చేతికి గాజుల్లా.. 

కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. 

రాధకు మాధవుడూ..


- పాటల ధనుస్సు 


14, ఏప్రిల్ 2026, మంగళవారం

ఊహవో ఊపిరివో | Oohavo Oopirivo | Song Lyrics | Suvarna Sundari (1981)

ఊహవో... ఊపిరివో... 


చిత్రం : సువర్ణ సుందరి (1981)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


ఊహవో... ఊపిరివో... 

నా జీవన రసమాధురివో

ఊహవో... ఊపిరివో... 

నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట... 

సువర్ణ సుందరివో

ఇదే నా స్వాగతం... 

నీవే నా జీవితం


ఊహవో... ఊపిరివో... 

నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట... 

సువర్ణ సుందరివో

ఇదే నా స్వాగతం... 

నీవే నా జీవితం


చరణం 1 :


చీకటి తీవెల రాతిరి వీణియ 

నవ్విన వేకువ చూపులని

ఆమని తేనెల వాగుల పొంగిన 

తీయని అలలే మాటలని

కంకణముల సడి పాటలుగా

కలికి అందియల ఆటలుగా

ఎడదల చప్పుడు తాళముగా

విడుదల ఎరుగని కౌగిలిలో...


కనుపాపలు తానాలాడే

ఆషాడపు అభిషేకంలో

ఏడుజన్మలిటు...  

ఆరు ఋతువులై

నూరు శరత్తులు విరిసిన వేళ....


ఉదయరేఖ నుదుటదిద్ది.... 

కదలిరావే నా సుందరి

ఓ నా ఉషస్సుందరి.....


ఊహవో... ఊపిరివో... 

నా జీవన రస మాధురివో


చరణం 2 :


వెన్నెలసణిగే వెండిమువ్వలో 

సన్నని లయ నా హృదయమని...

కిన్నెర పలికే చిలిపి ముద్దులో 

చల్లని శృతి నా ప్రణయమని...

గగన నీలిమలు కురులుగా... 

ఉదయరక్తిమలు పెదవులుగా...

హరిత చైత్రములు చీరెలుగా... 

శరణ్మెఘముల నడకలలో..


నిన్ను తాకిన హేమంతములో... 

సుడిరేగిన సంగీతంలో...

సప్తవర్ణములు సప్తస్వరాలై 

సప్తపదులు నడిపించిన వేళా...


కలలు వీడి.. ఇలకు చేరి 

కలిసిపొవె నా సుందరి... 

ఇంద్రధనుస్సుందరీ....


ఊహవో...  ఊపిరివో... 

నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట... 

సువర్ణ సుందరివో

ఇదే నా స్వాగతం... 

నీవే నా జీవితం


- పాటల ధనుస్సు 



27, మార్చి 2026, శుక్రవారం

మీ పల్లే వ్రేపల్లెగా | Mee Palle Vrepallega | Song Lyrics | Ammayi Manasu (1987)

మీ పల్లే వ్రేపల్లెగా


చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు


పల్లవి :


ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ

హా ఆ ఆ... హా హా ఓ హో.. 

ఆ ఆ ఆ హా ఆ ఆ .. ఆ ఆ

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా


చరణం 1 :


నెమిలమ్మకు సిరిమువ్వలే 

కరిమబ్బుల నీడలోనా.. 

తొడగాలని కోరుకున్న

కుహూ అమ్మకు పులకింతగా 

మావి చిగురించు వేళ.. 

పూదండలే అల్లుకున్న 


గుబురైన కొమ్మని... 

కుదురైన గూడుగా

గుబురైన కొమ్మని... 

కుదురైన గూడుగా

కోరింది గోరింట


ఓ.. ఓ.. ఓ..

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా


చరణం 2 :


మలిసందెల తిలకాలతో 

అందాల తొలి పూజ చేసి... 

మరి వెళ్ళాడే బాటసారి

అల ఆడగా.. సెల పాడగా.. 

నా ఊహ ఊయలలూగి 

మరిపించనా పాట పాడి


సన్నాయి సొగసుల... 

అమ్మాయి మనసులా

సన్నాయి సొగసుల... 

అమ్మాయి మనసులా

సురపొన్నలే పూయగా


ఓ.. ఓ.. ఓ..

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

నీ గోము గోపెమ్మగా... 


- పాటల ధనుస్సు 


2, సెప్టెంబర్ 2025, మంగళవారం

కాలమిలా ఆగిపోనీ | Kalamila Agiponi | Song Lyrics | Edi Papam Edi Punyam (1979)

కాలమిలా ఆగిపోనీ



చిత్రం: ఏది పాపం? ఏది పుణ్యం? (1979)

సంగీతం: సత్యం

గీతరచయిత: మైలవరపు గోపి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


కాలమిలా ఆగిపోనీ...

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి... ఈ నిమిషంలో... 

నీ ఒడిలోనే నిదురపోనీ


కాలమిలా ఆగిపోనీ...

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి ఈ నిమిషంలో... 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


చరణం 1 :


తొలిసంజె మలి సంజెలేల... 

నా చెంత చెలి ఉన్న వేళ

తొలిసంజె మలి సంజెలేల... 

నా చెంత చెలి ఉన్న వేళ


చిరుగాలి సెలయేరులేల... 

నా మనిషి తోడున్న వేళ


అనువైన వేళ... ఈ శుభవేళ...

బ్రతుకే వెన్నెల వేళా... 

వేళా.. వేళా..


కాలమిలా ఆగిపోనీ... 

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ.. 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


చరణం 2 :


సిరిదివ్వెలో వెలుగులాగ... 

నీ చూపులో నిలిచిపోనీ

సిరిదివ్వెలో వెలుగులాగ... 

నీ చూపులో నిలిచిపోనీ


జేగంటలో రవళిలాగ... 

నీ ఊపిరై కలిసిపోనీ...

కలలే కాని... కలతే లేని..

లోకానికే చేరిపోనీ... చేరిపోనీ...


కాలమిలా ఆగిపోనీ... 

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ.. 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


- పాటల ధనుస్సు 


16, ఆగస్టు 2025, శనివారం

మావి చిగురు తినగానే | Mavi Chuguru Tinagane | Song Lyrics | Seethamalakshmi (1978)

మావి చిగురు తినగానే



చిత్రం :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ.. 

కోయిల పలికేనా...

మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. 

కోయిల పలికేనా

కోయిల గొంతు వినగానే 

మావి చిగురు తొడిగేనా..

కోయిల గొంతు వినగానే 

మావి చిగురు తొడిగేనా..

ఏమో..ఏమనునోగాని 

ఆమని...ఈవని..


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..

కోయిల పలికేనా..ఆ..

కోయిల పలికేనా  


చరణం 1 :


తెమ్మెరతో తారాటలా.. 

తుమ్మెదతో సయ్యాటలా

తెమ్మెరతో తారాటలా... 

తుమ్మెదతో సయ్యాటలా

తారాటలా ..సయ్యాటలా.. 

సయ్యాటలా.. తారాటలా


వన్నెలే కాదు వగలే కాదు 

ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు

వన్నెలే కాదు వగలే కాదు 

ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు

బింకాలు... బిడియాలు..

పొంకాలు... పోడుములు..

ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి.. 

గడసరి...


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..

కోయిల పలికేనా..ఆ...

కోయిల పలికేనా


చరణం 2 :


ఒకరి ఒళ్ళు ఉయ్యాలా.. 

వేరొకరి గుండె జంపాల..

ఉయ్యాలా.. జంపాల.. 

జంపాల.. ఉయ్యాలా

ఒకరి ఒళ్ళు ఉయ్యాలా... 

వేరొకరి గుండె జంపాల


ఒకరి పెదవి పగడాలో.. 

వేరొకరి కనుల దివిటీలో..

ఒకరి పెదవి పగడాలో.. 

వేరొకరి కనుల దివిటీలో..


పలకరింతలో... పులకరింతలో...

పలకరింతలో... పులకరింతలో..

ఏమో ఏమగునో గాని ఈ కత.. 

మన కత..


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. 

కోయిల పలికేనా

కోయిల గొంతు వినగానే 

మావి చిగురు తొడిగేనా..

ఏమో..ఏమనునోగాని ఆమని...

ఈవని...


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..

కోయిల పలికేనా..ఆ...

కోయిల పలికేనా...


- పాటల ధనుస్సు 


12, ఆగస్టు 2025, మంగళవారం

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా



చిత్రం :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా

తెల్లారిపోయేదెట్టా.. హా.. 

ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా

ఈ ఊపు ఆపేదెట్టా..హా.. 

నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..

నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా  


చరణం 1 :


సిటికెంత నవ్వంట.. 

సికిలింత పువ్వంట..

ఆ పువ్వు కోసుకొంటే.. ఏ.. 

ఆపేది ఎవరంట..


చీకట్లో సింగారం.. 

సిటికేసే యవ్వారం..

చీకట్లో సింగారం.. 

సిటికేసే యవ్వారం..

నీ పొగరంత అణిగేదెట్ట.. 

ఈ పొగరాని సెగలే సంత


నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా

ఈ ఊపు ఆపేదెట్టా..హా.. 

నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..

నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా   


చరణం 2 :


మసకేస్తే మనసంట.. 

మనసైతే వరసంట

ఈ ఘడియా గడిపేదట్ట... 

ఆ గడియా తీసేదెట్ట


ఆ ఘడియా రానీకు 

నన్నిడిసి పోమాకు...

ఆ ఘడియా రానీకు 

నన్నిడిసి పోమాకు...

తొలి పొద్దు పొడిచిదంటే.. 

చలి తీరిపోయేదెట్ట...  ఎట్ట..


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా

తెల్లారిపోయేదెట్టా.. హా.. 

ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా


- పాటల ధనుస్సు 


11, ఆగస్టు 2025, సోమవారం

సీతాలు సింగారం మాలచ్చి బంగారం | Seethalu Singaram | Song Lyrics | Seethamalakshmi (1978)

సీతాలు సింగారం మాలచ్చి బంగారం



చిత్రం :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం..

సీతామాలచ్చిమంటే 

శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

సీతామాలచ్చిమంటే.. 

శ్రీలచ్చిమవతారం


మనసున్న మందారం.. 

మనిషంతా బంగారం..

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం

మనసున్న మందారం.. 

మనిషంతా బంగారం..

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం..


సీతాలు సింగారం..ఊమ్మ్... 


చరణం 1 :


కూసంత నవ్విందంటే 

పున్నమి కావాలా...

ఐతే నవ్వనులే..ఏ..ఏ


కాసంత చూసిందంటే 

కడలే పొంగాలా...

ఇక చూడనులే ..ఏ.. ఏ


కూసంత నవ్విందంటే 

పున్నమి కావాలా..

కాసంత చూసిందంటే 

కడలే పొంగాలా..


ఎండితెర మీద పుత్తడి బొమ్మ 

ఎలగాల ఎదగాలా

ఆ ఎదుగు బొదుగు ఎలుగు 

కన్నుల ఎన్నెల కాయాలా..

నువ్వంటుంటే.. నేవింటుంటే.. 

నూరేళ్ళు నిండాలా... ఆ..


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

బంగారు కొండయ్యంటే ..

భగవంతుడవతారం

మనసున్న మందారం... 


చరణం 2 :


లలల్లలా..లాలాలాలా..లలలాలా..


దాగుడు మూతలు ఆడావంటే 

దగ్గరకే రాను..

ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ


చక్కలిగింతలు పెట్టావంటే 

చుక్కై పోతాను..

ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..


దాగుడు మూతలు ఆడావంటే 

దగ్గరకే రాను

చక్కలిగింతలు పెట్టావంటే 

చుక్కై పోతాను


గుండె గుడిలోన దివ్వెవు నువ్వై 

వెలిగి... వెలిగించాలా

నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. 

ఉండిపోవాలా

నువ్వంటుంటే.. నేవింటుంటే.. 

వెయ్యేళ్ళూ బ్రతకాలా.. ఆ..


సీతాలు సింగారం.. 

మాలచ్చి బంగారం

బంగారు కొండయ్యంటే.. 

భగవంతుడవతారం..

లలలాల..లలలా..లలలా...


- పాటల ధనుస్సు 


5, ఏప్రిల్ 2025, శనివారం

కనరాని దేవుడే కనిపించినాడే | Kanarani Devude | Song Lyrics | Rangula Ratnam (1966)

కనరాని దేవుడే కనిపించినాడే


చిత్రం :  రంగులరాట్నం (1966)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

కనరాని దేవుడే కనిపించినాడే...

కనిపించి అంతలో...

కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..

కనరాని దేవుడే కనిపించినాడే...

ఆ..ఆ..ఆ..ఆ 


చరణం 1:


అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..

అల నీలీగగనాన వెలిగే నీ రూపూ

ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...

మనసారా నిను చూడలేనైతి స్వామీ...

కరుణించి ఒకసారి కనిపించవేమీ... 


చరణం 2:


అందాల కన్నయ్య కనిపించగానే...

బృందావనమెల్ల పులకించిపొయే...

యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...

నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...

ఆ..ఆ..ఆ..ఆ 


చరణం 3:


వలపుతో పెనవేయు పారిజాతమునై... 

ఎదమీద నిదురించు అడియాశ లేదూ

గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... 

నీ చరణకమలాల నలిగి పోనీయవా...

ఆ..ఆ..ఆ..ఆ..


కనరాని దేవుడే కనిపించినాడే...

కనిపించి అంతలో కన్ను మరుగాయే ... 

కన్ను మరుగాయే..


- పాటల ధనుస్సు 


17, ఆగస్టు 2024, శనివారం

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ | Vastavu Kalaloki | Song Lyrics | Gopalaraogari Ammayi (1980)

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ



చిత్రం: గోపాలరావు గారి అమ్మాయి (1980)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: మాధవపెద్ది రమేష్, సుశీల


పల్లవి:


వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ

నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ

ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ



వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ

వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ

నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ

ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ


చరణం 1:


పెదవి పైన పెదవి గుబులు 

పడుచుదనమే తీయటి దిగులు

కుర్రవాడికి తీరదు మోజు 

చిన్నదానికి బిడియం పోదు


చూపు చూపు కలిసిన చాలు.. 

కొంగు కొంగు కలిపిన మేలు

నన్ను దరి చేరనీ.. ముద్దు వాటారని

ముద్దు నెరవేరనీ.. ముందు జతకూడనీ


వస్తావు కలలోకీ రానంటాను కౌగిలికీ

నే కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ

ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ


చరణం 2:


చిన్నదాన్ని నిన్నటి వరకు 

కన్నెనైనది ఎవ్వరి కొరకు

నాకు తెలుసు నాకోసమని 

నీకే తెలియదు ఇది విరహమని


నేనూ నువ్వు మనమైపొయే వేళా.. 

ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏలా

వలచి వలపించనా.. కరిగి కరిగించనా

నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా


వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ

నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ

ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ


వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ

నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ

ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ


- పాటల ధనుస్సు 

మనవే వినవా మనసే కనవా | Manave Vinava Manase kanava | Song Lyrics | Gopalaraogari Ammayi (1980)

మనవే వినవా మనసే కనవా



చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : మాధవపెద్ది రమేష్,  సుశీల


పల్లవి :


మనవే వినవా మనసే కనవా..

మది లోపలి మాటను మన్నించవా

కలలే మరిచి...  కనులే తెరిచి

నిజమేదో స్వామీ గుర్తించవా

ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..

మనవే విననా...  మనసే కననా

మది లోపలి మాటను మన్నించనా

గతమే మరచి...  కనులే తెరచి

నిజమైతే స్వామీ...  గుర్తించనా

ఇక ఒంటరితనమే వదిలించనా..


మనవే వినవా మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా


చరణం 1 :


నిను చూడగనే నే బెంగపడి

సంపెంగలలో అది దాచుకుని

చిరునవ్వులకే మది జివ్వుమని

కసి చూపులతో కబురంపుకొని

పరుగులు తీసే పరువంతో..

పైటలు జారే అందంతో

చక్కలిగిలిగా సరసాలాడే

చలి చలిగా సరిగమ పాడే

వలపులు పిలిచే ఈ వేళలో

వయసులు తెలిసే ఈ వేళలో

మనవే వినవా...  మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా


చరణం 2 :


తొలిచూపులనే మునిమాపులుగా

మరుమల్లెల జల్లులు జల్లుకుని

బిగి కౌగిలినే నా లోగిలిగా

అరముద్దుల ముగ్గులు పెట్టుకుని

 

కలలైపోయిన కన్నులతో

వలలైపోయిన చూపులతో

ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ

పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే

మనసులు కలిసే ఈ వేళలో

మమతలు విరిసే ఈ వేళలో


మనవే వినవా...  మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా

కలలే మరిచి కనులే తెరిచి

నిజమేదో స్వామీ గుర్తించవా

ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా


- పాటల ధనుస్సు 

19, మే 2024, ఆదివారం

ఏమంటున్నది ఈ గాలీ | Emantunnadi Ee Gali | Song Lyrics | Memu Manushulame (1973)

ఏమంటున్నది ఈ గాలీ?



చిత్రం : మేము మనుషులమే (1973)

రచన : ఆచార్య ఆత్రేయ, 

సంగీతం : ఎం ఎస్ విశ్వనాథన్,

గానం : బాలు సుశీల 


పల్లవి :


ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ..

ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ..

ఎగిరే పైటను ఏం చెయ్యాలి?

ఇంకో కొంగును ముడివెయ్యాలి… 

అహ..అహ..హ..


ఎగిరే పైటను ఏం చెయ్యాలి?

ఇంకో కొంగును ముడివెయ్యాలి…

ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ


చరణం 1 :


పైటకు తెలుసు … 

చాటున పొంగే ప్రాయం రెపరెపలూ…

గాలికి తెలుసూ… 

విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ..

ఊగే నడుమూ.. సాగే జడతో ..

వేసెను పంతాలూ..ఊ..

నీలో వుడుకూ .. నాలో దుడుకూ… 

చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..


ఏమంటున్నది ఈ గాలీ… 

ఎగిరే పైటను అడగాలీ…


చరణం 2 :


మబ్బు మబ్బుతో ఏకమైనది.. 

సాయం సమయంలో…ఓ..

మనసు మనసుతో లీనమైనది.. 

మమతల మైకంలో…ఓ..

అల్లరి కళ్లూ .. వెన్నెల నవ్వూ .. 

పెట్టెను గిలిగింతా..

వెచ్చని వొడిలో .. 

ఇచ్చిన చోటున .. 

ఇమిడెను జగమంతా..

ఇమిడెను జగమంతా ..


ఏమంటున్నది ఈ గాలీ… 

ఎగిరే పైటను అడగాలీ…

అహ..హ..అహా…లల..ల.లా.లా..

అహ..హ..అహా…లల..ల.లా.లా..


- పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు