RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rajan nagendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rajan nagendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2026, మంగళవారం

తొలివలపూ తొందరలూ | Tolivalapu Tondaralu | Song Lyrics | Sommokadidi Sokokadidi (1979)

తొలివలపూ..తొందరలూ


చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, జానకి   


పల్లవి :


తొలివలపూ..తొందరలూ

తొలివలపూ తొందరలు

ఉసిగొలిపే తెమ్మెరలు

చెలితో నేను.. చలితో నీవు.. 

చేసే అల్లరులూ...


తొలివలపూ తొందరలు

ఉసిగొలిపే తెమ్మెరలు

చెలితో నీవు.. చలితో నేను.. 

చేసే అల్లరులూ...


తొలివలపూ తొందరలు.. 

ఉసిగొలిపే తెమ్మెరలు

తొలివలపు .. తొందరలు.. 

ఉసిగొలిపే .. తెమ్మెరలు 


చరణం 1 :


పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు.. 

కరగాలి కౌగిళ్ళలో

వలపించే ఒళ్ళు.. వలచే పరవళ్ళు.. 

కదిలే పొదరిళ్ళలో


తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. 

కలవాలి సందిళ్ళలో

పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. 

బిగిసే సంకెళ్ళలో

నీలో అందాలు.. నేనే పొందాలి..

నాకే చెందాలిలే..


తొలివలపూ తొందరలు

ఉసిగొలిపే తెమ్మెరలు

చెలితో నేను.. చలితో నీవు.. 

చేసే అల్లరులూ...


తొలివలపూ తొందరలు

ఉసిగొలిపే తెమ్మెరలు

తొలివలపూ తొందరలు.. 

ఉసిగొలిపే తెమ్మెరలు.. 


చరణం 2  :


ఆహా.. ఆ.. ఆ.. ఆ.. హె హె హె హె..

ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. 


కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. 

రేపిందిలే తపనా

పలికే పరువాన.. వలపే విరివాన .. 

నీవే ఆలాపనా


వణికే నీ మేన .. సణిగే నా వీణ .. 

పలికిందిలే మోహనా

విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు .. 

సిగలో నేనుంచనా

నీలో రాగాలు.. నాలో రేగాలి.. 

నేనే ఊగాలిలే


తొలివలపూ తొందరలు.. 

ఉసిగొలిపే తెమ్మెరలు

చెలితో నీవు.. చలితో నేను..

చేసే అల్లరులూ...

తొలివలపూ తొందరలు..

ఉసిగొలిపే తెమ్మెరలు


తొలివలపు .. తొందరలు.. 

ఉసిగొలిపే .. తెమ్మెరలు

తొలివలపు .. తొందరలు.. 

ఉసిగొలిపే .. తెమ్మెరలు


- పాటల ధనుస్సు 


5, మే 2026, మంగళవారం

చినుకులా రాలి నదులుగా సాగి | Chinukula Raali Naduluga Saagi | Song Lyrics | Nalugu Stambalata (1982)

చినుకులా రాలి నదులుగా సాగి


చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరిచిపోబోకుమా 

మమత నీవే సుమా


చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ


చరణం 1:


ఆకులు రాలే వేసవి గాలి 

నా ప్రేమ నిట్టూర్పులే

కుంకుమ పూసే వేకువ 

నీవై తేవాలి ఓదార్పులే

ప్రేమను కోరే జన్మలలోనే 

నే వేచి ఉంటానులే

జన్మలు తాకే ప్రేమను నేనై 

నే వెల్లువవుతానులే

ఆ చల్లని చాలులే

హిమములా రాలి 

సుమములై పూసి

రుతువులై నవ్వి 

మధువులై పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ

శిశిరమైనా శిధిలమైనా 

విడిచిపోబోకుమా

విరహమై పోకుమా


చరణం 2:


తొలకరి కోసం తొడిమను 

నేనై అల్లాడుతున్నానులే

పులకరమూగే పువ్వుల కోసం 

వేసారుతున్నానులే

నింగికి నేల అంటిసలాడే 

ఆ పొద్దు రావాలిలే

నిన్నలు నేడై రేపటి నీడై 

నా ముద్దు తీరాలిలే

ఆ తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి గానమై పిలిచి

కలలతో అలిసి గగనమై ఎగసి


నీ ప్రేమ నా ప్రేమ 

తారాడే మన ప్రేమ

భువనమైనా గగనమైనా 

ప్రేమమయమే సుమా

ప్రేమ మనమే సుమా


- పాటల ధనుస్సు 


27, మార్చి 2026, శుక్రవారం

మనసే దోచావు నీవు | Manase Dochavu Neevu | Song Lyrics | Ammayi Manasu (1987)

మనసే దోచావు నీవు


చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : ఎస్ పి బాలు, పి సుశీల


పల్లవి:


మనసే దోచావు నీవు

మనిషే మిగిలాను నేను

అది తెలిసి.. నను మరచి

నీ మనిషై ఉన్నాను..

ఉన్నా నీలోనే ఉన్నా.. 

ఏది కాలేక ఉన్నా


మనసే దోచావు నీవు

మనిషే మిగిలాను నేను

అది తెలిసి.. నను మరచి

నీ మనిషై ఉన్నాను..


చరణం 1:


తలుపులు తెరిచింది నీవు

వెలుగులు తెచ్చింది నీవు

ఇంటిని కంటిని 

వెలిగించి వెళ్ళినావు 


వెన్నెల చిరుజల్లు చిలికి

కన్నుల వాకిళ్ళు అలికి

నవ్వుల ముగ్గులు 

ఎన్నెన్నో వేసినావు

కలవై కళవై  మిగిలి


మనసే దోచావు నీవు

మనిషే మిగిలాను నేను

అది తెలిసి.. నను మరచి

నీ మనిషై ఉన్నాను..


చరణం 2:


ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


సరిగమ ఏడే స్వరాలూ 

నడిచినవి ఏడే అడుగులు

మరవకు చెరపకు.. 

నూరేళ్ళ జ్ఞాపకాలు 


మరవకు మన ప్రేమ గీతం..

మాపకు తొలి ప్రేమ గాయం

నీవని నేనని 

విడతీసి ఉండలేవు

ఆరో ప్రాణం నీవు 


మనసే దోచావు నీవు

మనిషే మిగిలాను నేను

అది తెలిసి నను మరచి 

నీ మనిషై ఉన్నాను

ఉన్నా నీలోనే ఉన్నా.. 

వేరే కాలేక ఉన్నా ..


మనసే దోచావు నీవు

మనిషే మిగిలాను నేను

అది తెలిసి నను మరచి 

నీ మనిషై ఉన్నాను


- పాటల ధనుస్సు 


మీ పల్లే వ్రేపల్లెగా | Mee Palle Vrepallega | Song Lyrics | Ammayi Manasu (1987)

మీ పల్లే వ్రేపల్లెగా


చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు


పల్లవి :


ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ

హా ఆ ఆ... హా హా ఓ హో.. 

ఆ ఆ ఆ హా ఆ ఆ .. ఆ ఆ

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా


చరణం 1 :


నెమిలమ్మకు సిరిమువ్వలే 

కరిమబ్బుల నీడలోనా.. 

తొడగాలని కోరుకున్న

కుహూ అమ్మకు పులకింతగా 

మావి చిగురించు వేళ.. 

పూదండలే అల్లుకున్న 


గుబురైన కొమ్మని... 

కుదురైన గూడుగా

గుబురైన కొమ్మని... 

కుదురైన గూడుగా

కోరింది గోరింట


ఓ.. ఓ.. ఓ..

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా


చరణం 2 :


మలిసందెల తిలకాలతో 

అందాల తొలి పూజ చేసి... 

మరి వెళ్ళాడే బాటసారి

అల ఆడగా.. సెల పాడగా.. 

నా ఊహ ఊయలలూగి 

మరిపించనా పాట పాడి


సన్నాయి సొగసుల... 

అమ్మాయి మనసులా

సన్నాయి సొగసుల... 

అమ్మాయి మనసులా

సురపొన్నలే పూయగా


ఓ.. ఓ.. ఓ..

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

పిలిచింది నన్నే బృందావని.. 

పరదేశిననా రారమ్మని

మీ పల్లే వ్రేపల్లెగా.. 

నీ గోము గోపెమ్మగా

నీ గోము గోపెమ్మగా... 


- పాటల ధనుస్సు 


ఒక వేణు గీతం పలికింది పాటై | Oka Venu Geetham | Song Lyrics | Ammayi Manasu (1987)

ఒక వేణు గీతం పలికింది పాటై 


చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : మైలవరపు గోపి

నేపథ్య గానం : ఎస్ పి బాలు


పల్లవి :


హా.. ఆ.. ఆ.. హా

ఆ.. ఆ.. ఆ.. హో..ఓ.. ఓ..

లాలలాలలా... ఆ.. హా 


ఒక వేణు గీతం పలికింది పాటై

ఎద పల్లవించగా ఈవేళ నాలో

ఒక వేణు గీతం పలికింది పాటై

ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా

వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..


ఒక వేణు గీతం పలికింది పాటై

ఎద పల్లవించగా ఈవేళ నాలో


చరణం 1 :


అలలై బంగారు కలలై...  

మిగిలే అందాలు కొన్ని

వనవాటిలో సెలయేటిలాగ 

నను తొందరించసాగే


ఎదలో ఏ మూలలోనో...  

కదిలే భావాలు కొన్ని

నా గుండె నుంచి... 

లోగొంతు నుంచి... 

నా పెదవి పైకి చేరే

లాలించే పాటలాగా.. హో


ఒక వేణు గీతం....  పలికింది పాటై

ఎద పల్లవించగా....  ఈవేళ నాలో


చరణం 2 :


హృదయం కోరేది స్నేహం.. 

స్నేహం నూరేళ్ళ దీపం

మనసున్న మనిషి తోడైన వేళ... 

నీదే అందాల లోకం


ప్రణయం వసంతమైతే... 

బ్రతుకే పూదోట కాదా

మనసులో మాట చూపులో తెలిసే.. 

ఎందుకో ఇంక మౌనం

ఆ మౌనం ప్రేమ భాష్యం... ఊ...


ఒక వేణు గీతం పలికింది పాటై

ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... 

చిగురాకు రాలినా

వలపు సంగీతమై 

కదలాడు నాలో... ఓ.. ఓ..


ఒక వేణు గీతం పలికింది పాటై

ఎద పల్లవించగా ఈవేళ నాలో


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

ఏమో ఏమో ఇది నాకేమో | Emo Emo Idi | Song Lyrics | Aggi Pidugu (1964)

ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది


చిత్రం : అగ్గి పిడుగు (1964)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, జానకి


పల్లవి:


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది


ఏమో ఏమో అది... 

నీకేమి ఏమి అయినది

ఈ వేళలో నీ గుండెలో 

ఎందుకు గుబులౌతున్నది


హాయ్...

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది


చరణం 1:


కనులలో నీ కనులలో.. 

నా కలలే పొంగినవీ

కురులలో ముంగురులలో.. 

నా కోరికలూరినవీ


ఆహ.. ఆహ... ఆ..

వింతగా కవ్వింతగా 

ఈ వెన్నెల పూచినది

చెంతగా నువు చేరగా 

గిలిగింతగ తోచినది.. 

గిలిగింతగ తోచినది


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది


చరణం 2:


ఎందుకో సిగ్గెందుకో 

నా అందాలబొమ్మకు

అందుకో చేయందుకో 

మరి ఆవైపు చూడకు


ఆహ.. ఒహో.. ఆ..

నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. 

నను దోచివేయకు

మాటతో సయ్యాటతో 

నను మంత్రించివేయకు.. 

మంత్రించివేయకు


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది

ఆహ... ఆహ... ఆహ... అహ... 

ఊహూహు.. హూ..హుహు..


- పాటల ధనుస్సు 



27, జనవరి 2025, సోమవారం

నీ కోసం యవ్వనమంతా | Neekosam Yavvanamantha | Song Lyrics | Moodu Mullu (1983)

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో



చిత్రం :  మూడుముళ్ళు (1983)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


నీ కోసం యవ్వనమంతా 

దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా 

వేచాను సందెలలో

మలి సందెలు మల్లెపూలు 

మనువాడిన వేళలలో..


నీ కోసం యవ్వనమంతా 

దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా 

వేచాను సందెలలో


చరణం 1 :


లాలాలాల..లాల్లలలా..

లాలాలాల..లాల్లలలా

లాలాలాల..లాలా...


అటు చూడకు జాబిలి వైపు..

కరుగుతుంది చుక్కలుగా..

చలి చీకటి చీర లోనే 

సొగసంతా దాచుకో


అటు వెళ్ళకు దిక్కుల వైపు..

కలుస్తాయి ఒక్కటిగా..

నా గుప్పెడు గుండె లోనే 

జగమంతా ఏలుకో


నా హృదయం టూ-లెటు కాదు..

మన జంటకి డ్యూయెటు లేదు

ఆ మాటే విననూ..

మాట పడనూ..ఊరుకోను


నీ కోసం జీవితమంతా 

వేచాను సందెలలో

నీ కోసం యవ్వనమంతా 

దాచాను మల్లెలలో

మలి సందెలు మల్లెపూలు 

మనువాడిన వేళలలో..


నీ కోసం జీవితమంతా 

వేచాను సందెలలో

నీ కోసం యవ్వనమంతా 

దాచాను మల్లెలలో


చరణం 2 :


అటు చూడకు లోకం వైపు..

గుచ్చుతుంది చూపులతో..

ఒడి వెచ్చని నీడ లోనే 

బిడియాలని పెంచుకో


అటు వెళ్ళకు చీకటి వైపు..

అంటుతుంది ఆశలతో

విరి సెయ్యల వేడి లోనే 

పరువాలను పంచుకో


నా కొద్దీ కసి కాలేజీ..

మానేస్తా నే మ్యారేజి

మరులన్నీ మనవీ..

అన్న మనవే..చేసుకున్నా


నీ కోసం యవ్వనమంతా 

దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా 

వేచాను సందెలలో

మలి సందెలు మల్లెపూలు 

మనువాడిన వేళలలో..


ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...

ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...


- పాటల ధనుస్సు 


24, ఆగస్టు 2024, శనివారం

నా జీవిత గమనములో | Naa Jeevitha Gamanamulo | Song Lyrics | Addala Meda (1981)

నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది



చిత్రం :  అద్దాల మేడ (1981)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తక ధీం త ఝణూ దటికి తధికి 

తధికి దటికి తధికి.. ధా

ఆ అ ఆ ఆ ఆ ఆ  

నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది

నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది


అది ఊహల లోకములో 

కవితలు రాస్తుంది

ఆ కవిత కావ్యమై .. 

కావ్యానికి నాయికవై

వరించి .. తరించి .. 

ఊరించక రావే...కావ్యనాయిక 

నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది


చరణం 1 :


నేను కవిని కాను.. 

కవిత రాయలేను

శిల్పిని కాను.. 

నిను తీర్చిదిద్దలేను

చిత్రకారుని కానే కాను.. 

గాయకుణ్ణి అసలే కాను

ఏమీకాని నేను.. 

నిను కొలిచే పూజారిని

నీ గుండెల గుడిలో.. 

ప్రమిదను పెట్టే పూజారిని.. 

నీ ప్రేమ పూజారిని 


నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది


చరణం 2 :


ఆ ఆ ఆ ఆ ఆ

సగససమమమమ గమగసపనిగస 

మపమమపని పనిస పనిస పనిసా

ఆ ఆ ఆ


నేను రాముణ్ణి కాను .. 

విల్లు విరచలేను

కృష్ణుణ్ణి కాను .. 

నిను ఎత్తుకు పోలేను

చందురుణ్ణి కానే కాను .. 

ఇందురుణ్ణి అసలే కాను


ఎవరూ కాని నేను 

నిను కొలిచే నిరుపేదను

అనురాగపు దివ్వెలు .. 

చమురును నింపే ఒక పేదను.. 

నే నిరుపేదను 


నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది

అది ఊహల లోకములో 

కవితలు రాస్తుంది

ఆ కవిత కావ్యమై .. 

కావ్యానికి నాయికవై

వరించి .. తరించి .. 

ఊరించక రావే...కావ్యనాయిక 

నా జీవిత గమనములో 

ఒక నాయిక పుట్టింది


- పాటల ధనుస్సు 


29, ఫిబ్రవరి 2024, గురువారం

అంతట నీ రూపం నన్నే చూడనీ | Anthata nee roopam | Song Lyrics | Pooja (1975)

అంతట నీ రూపం నన్నే చూడనీ



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా..

అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...

నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం ...


అంతట నీరూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...


చరణం 1:


నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల

వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే


కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ..

ఆకుల గలగలలో నడిచే కోమలీ..


అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ...


చరణం 2:


నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ

అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే..


తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా

నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా


అంతట నీ రూపం నన్నే చూడనీ..

ఆశలు పండించే నిన్నే చేరనీ..

ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...


పాటల ధనుస్సు 


28, ఫిబ్రవరి 2024, బుధవారం

ఎన్నెన్నో జన్మల బంధం | Ennenno Janmala Bandham | Song Lyrics | Pooja (1975)

ఎన్నెన్నో జన్మల బంధం



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపథ్య గానం :  బాలు, వాణీ జయరాం 


పల్లవి :


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను

ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 1 :


పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి

నిన్నే చూసిన వేళ నిండును చెలిమి


ఓహో హో హో ..నువ్వు కడలివైతే

నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను

చేరనా…  చేరనా... చేరనా…


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 2 :


విరిసిన కుసుమము నీవై కురిపించేవు

జాబిలి నేనై నిన్ను పెనవేసేను


ఓహో హో హో మేఘము నీవై 

నెమలిని నేనై

ఆశతో నిన్ను చూసి చూసి

ఆడనా.. పాడనా.. ఆడనా…


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ


చరణం 3 :


కోటి జన్మలకైనా కోరేదొకటే

నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి


ఓహో హో హో నీ ఉన్నవేళా…  

ఆ స్వర్గమేలా

ఈ పొందు ఎల్ల వేళలందు

ఉండనీ. ఉండనీ.. ఉండనీ..


ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ

ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను

అహాహ హాహా.. ఓహోహోహోహో...


పాటల ధనుస్సు 

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

నింగీ నేలా ఒకటాయెలే | Ningi Nela Okatayele | Song Lyrics | Pooja (1975)

నింగీ నేలా ఒకటాయెలే



చిత్రం : పూజ (1975)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం


పల్లవి:


నింగీ నేలా ఒకటాయెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే


నింగీ నేలా ఒకటాయెలే...


చరణం 1:


హో హోహోహో...


ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే

నా వెంట నీవుంటే ఎంతో హాయిలే

ఆహాహా లాలాలా... ఆహాహా లాలాలా

హృదయాలు జత జేరి ఊగే వేళలో

దూరాలు భారాలు లేనే లేవులే

నీవే నేను లే ...నేనే నీవు లే

లలలలలా... లాలాల లాలాల...


నింగీ నేలా ఒకటాయెలే


చరణం 2:


రేయైనా పగలైనా నీపై ధ్యానము 

పలికింది నాలోన వీణా గానము

ఆహాహా లాలాలా... ఓహోహో లాలాలా

అధరాల కదిలింది నీదే నామము

కనులందు మెదిలింది నీదే రూపము

నీదే రూపమూ ... నీవే రూపము

లలలలలా... లాలాల లాలాల...


నింగీ నేలా ఒకటాయెలే

మమతలూ వలపులూ పూలై విరిసెలే...


పాటల ధనుస్సు 


నీ దయ రాదా రామ | Nee Daya Raadaa Rama | Song Lyrics | Pooja (1975)

నీ దయ రాదా రామ



చిత్రం : పూజ (1975)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : త్యాగయ్య

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్రనామ తత్ తుళ్యం

రామ నామం వరాననే 


నీ దయ రాదా రామ! నీ దయ రాదా

నీ దయ రాదా నీ దయ రాదా రామా 


కాదనే వారెవరూ..ఊ..ఊ

కాదనే వారెవరూ కల్యాణ రామ

కాదనే వారెవరూ కల్యాణ రామ

నీ దయ రాదానీ దయ రాదా 

నీ దయ రాదా రామా


చరణం 1:


నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ

నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ

ఇనవంశతిలక..ఆ..ఆ...

ఇనవంశతిలక ఇంతా తామసమా

ఇనవంశతిలక ఇంతా తామసమా


చరణం 2:


రామ రామ రామ రామా 

త్యాగరాజ హృత్ సదనా

రామ రామ రామ రామా 

త్యాగరాజ హృత్ సదనా


నా మది తల్లడిల్లెగా..

నా మది తల్లడిల్లెగా న్యాయమా రామా

నా మది తల్లడిల్లెగా న్యాయమా వేగమే

నీ దయ రాదా నీ దయ రాదా 

నీ దయ రాదా రామా


పాటల ధనుస్సు 


25, ఫిబ్రవరి 2024, ఆదివారం

మల్లెతీగ వాడిపోగా | Malleteega vaadi poga | Song Lyrics | Pooja (1975)

మల్లెతీగ వాడిపోగా



చిత్రం :  పూజ (1975)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా

మనసులోని మమతలన్ని మాసిపోయి 

కుములు వేళ మిగిలింది ఆవేదన

మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా 


చరణం 1 :


నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును

నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును

నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును

నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును


మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

మనసులోని మమతలన్ని మాసిపోయి 

కుములు వేళ మిగిలింది ఆవేదన

తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా


చరణం 2 :


కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా

కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా

పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా

పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా


ఆటగాణి కోరికేమో తెలియలేని జీవులం

జీవితాల ఆటలోన మనమంతా పావులం


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు