RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
poornima songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
poornima songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2026, మంగళవారం

చినుకులా రాలి నదులుగా సాగి | Chinukula Raali Naduluga Saagi | Song Lyrics | Nalugu Stambalata (1982)

చినుకులా రాలి నదులుగా సాగి


చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరిచిపోబోకుమా 

మమత నీవే సుమా


చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ


చరణం 1:


ఆకులు రాలే వేసవి గాలి 

నా ప్రేమ నిట్టూర్పులే

కుంకుమ పూసే వేకువ 

నీవై తేవాలి ఓదార్పులే

ప్రేమను కోరే జన్మలలోనే 

నే వేచి ఉంటానులే

జన్మలు తాకే ప్రేమను నేనై 

నే వెల్లువవుతానులే

ఆ చల్లని చాలులే

హిమములా రాలి 

సుమములై పూసి

రుతువులై నవ్వి 

మధువులై పొంగు

నీ ప్రేమ నా ప్రేమ 

నీ పేరే నా ప్రేమ

శిశిరమైనా శిధిలమైనా 

విడిచిపోబోకుమా

విరహమై పోకుమా


చరణం 2:


తొలకరి కోసం తొడిమను 

నేనై అల్లాడుతున్నానులే

పులకరమూగే పువ్వుల కోసం 

వేసారుతున్నానులే

నింగికి నేల అంటిసలాడే 

ఆ పొద్దు రావాలిలే

నిన్నలు నేడై రేపటి నీడై 

నా ముద్దు తీరాలిలే

ఆ తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి గానమై పిలిచి

కలలతో అలిసి గగనమై ఎగసి


నీ ప్రేమ నా ప్రేమ 

తారాడే మన ప్రేమ

భువనమైనా గగనమైనా 

ప్రేమమయమే సుమా

ప్రేమ మనమే సుమా


- పాటల ధనుస్సు 


3, మే 2026, ఆదివారం

సరిగమపదని స్వరధార | Sarigamapadani Swaradhara | Song Lyrics | Srivariki Premalekha (1984)

సరిగమపదని స్వరధార 


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపథ్య  గానం : ఎస్ పి బాలు,

  

పల్లవి :


తననం తననం తననం


గమప మపని దనిసా.....

సనిదప సనిదప

దపగరి దపగరి

సనిద నిదప దపగ పగరిస 

సా పా గరి సా

సా సా సా సా

రీ రీ రీ రీ

గా గా గా గా

పా పా పా పా


సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార  

సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార 

వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై...

వీణవై.. జాణవై.. వేణువై... వెలదివై

మువ్వవై.. ముదితవై.. 

వర్ణమై.. నా స్వర్ణమై

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే 


సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార  

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార


చరణం 1 :


అరుణం అరుణం ఒక చీరా.... 

అంబరనీలం ఒక చీరా

అరుణం అరుణం ఒక చీరా... 

అంబరనీలం ఒక చీరా


మందారంలో మల్లికలా 

ఆకాశంలో చంద్రికలా

అందాలన్నీ అందియలై... 

శృంగారంలో నీ లయలై

అందాలన్నీ అందియలై... 

శృంగారంలో నీ లయలై

అలుముకున్న పూతావిలా... 

అలవికాని పులకింతలా  

హిందోళ రాగ గంధాలు 

నీకు ఆందోళికా సేవగా


ఆ....ఆ....ఆ....ఆ....

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 


చరణం 2 :


హరితం హరితం ఒక చీరా... 

హంసల వర్ణం ఒక చీరా

హరితం హరితం ఒక చీరా... 

హంసల వర్ణం ఒక చీరా

శాద్వలాన హిమదీపికలా... 

శరద్వేళ అభిసారికలా 


చరణాలన్నీ లాస్యాలై... 

నీ చరణానికి దాస్యాలై

అష్టపదుల ఆలాపనే... 

సప్తపదుల సల్లాపమై

పురివిప్పుతున్న పరువాల పైట 

సురటినే వీవగా ఆ.... 


ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 


- పాటల ధనుస్సు 


మనసా తుళ్ళిపడకే | Manasa Tullipadake | Song Lyrics | Srivariki Premalekha (1984)

మనసా తుళ్ళిపడకే


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ జానకి      


పల్లవి :


మనసా తుళ్ళిపడకే.. 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో?

ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?

తొందరపడితే అలుసే 

మనసా..... తెలుసా


మనసా తుళ్ళిపడకే... 

అతిగా ఆశపడకే 


చరణం 1 :


ఏమంత అందాలు కలవనీ ..... 

వస్తాడు నిన్ను వలచి?

ఏమంత సిరి ఉంది నీకనీ ..... 

మురిసేను నిన్ను తలచి?

చదువా? ..... పదవా? ..... 

ఏముంది నీకు?

తళుకు ..... కులుకు ..... 

ఏదమ్మ నీకు..

శ్రుతిమించకే నీవు మనసా...


మనసా తుళ్ళిపడకే.. 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో?

ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?

తొందరపడితే అలుసే 

మనసా..... తెలుసా


మనసా తుళ్ళిపడకే... 

అతిగా ఆశపడకే


చరణం 2 :


ఏ నోము నోచావు నీవనీ ..... 

దొరికేను ఆ ప్రేమఫలము

ఏ దేవుడిస్తాడు నీకనీ ..... 

అరుదైన అంత వరము


మనసా వినవే మహ అందగాడు

కనుకా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా...


మనసా తుళ్ళిపడకే 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో

ఆ శుభఘడియా వచ్చేనో రాదో

తొందరపడితే అలుసే 

మనసా ..... తెలుసా

మనసా తుళ్ళిపడకే 

అతిగా ఆశపడకే


- పాటల ధనుస్సు 


25, ఏప్రిల్ 2026, శనివారం

తొలిసారి మిమ్మల్ని చూసింది | Tolisari Mimmalni Chusindi | Song Lyrics | Srivariki Premalekha (1984)

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ జానకి      


సాకీ : 

శ్రీమన్ మహారాజ! 

మార్తాండ తేజా!

ప్రియానందభోజా! 

మీ శ్రీచరణాంభోజములకు 

ప్రేమతో నమస్కరించి... 

మిము వరించి

మీ గురించి ఎన్నో కలలు కన్న  

కన్నెబంగారు

భయముతో... భక్తితో... 

అనురక్తితో... శాయంగల 

విన్నపములూ.. ఊ... ఊ... 


సంధ్యారాగం చంద్రహారతి 

పడుతున్న వేళ

మసక చీకటి మధ్యమావతి 

పాడుతున్న వేళ

ఓ శుభముహూర్తానా...


పల్లవి :


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు 

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు

ఎన్నెన్నో కథలు


జో అచ్యుతానంద.. 

జో జో ముకుందా.. 

లాలి పరమానంద.. 

రామ గోవిందా

జో జో... 


అనుపల్లవి :


నిదురపోనీ కనుపాపలకు 

జోల పాడలేక..

ఈల వేసి చంపుతున్న 

ఈడునాపలేక...

ఇన్నాళ్లకు రాస్తున్నా

ఊహుహూహు... ప్రేమలేఖ  


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు.. 

ఎన్నెన్నో కథలు


చరణం 1 :


ఏ తల్లి కుమారులో 

తెలియదు కానీ

ఎంతటి సుకుమారులో 

తెలుసు నాకు


ఎంతటి మగధీరులో 

తెలియలేదు గానీ

నా మనసును దోచిన 

చోరులు మీరు 


వలచి వచ్చిన వనితను 

చులకన చేయక

తప్పులుంటే మన్నించి 

ఒప్పులుగా భావించి

చప్పున బదులివ్వండీ.. 

చప్పున బదులివ్వండి


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు... 

ఎన్నెన్నో కథలు


చరణం 2 :


తలలోన తురుముకున్న 

తుంటరి మల్లె

తలపులలో ఎన్నెన్నో 

మంటలు రేపే 

ఆ... అబ్బా..


సూర్యుడి చుట్టూ తిరిగే 

భూమికి మల్లే 

నా ఊర్పుల నిట్టూర్పుకు 

జాబిలి వాడే 

ఆహ్....  ఆహ్


మీ జతనే కోరుకొని 

లతలాగా అల్లుకొనే 

నాకు మీరు మనసిస్తే.. 

ఇచ్చినట్టు మాటిస్తే

ఇప్పుడే బదులివ్వండీ... 

ఇప్పుడే బదులివ్వండి 


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు... 

ఎన్నెన్నో కథలు 


- పాటల ధనుస్సు 


23, మార్చి 2025, ఆదివారం

ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం | Priyatama Nee Oopire | Song Lyrics | Agni Samadhi (1978)

ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం



చిత్రం : అగ్ని సమాధి (1978)

సంగీతం : సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు, జానకి  


పల్లవి: 


ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం

నీ చూపులే నాకు దీపం

నీవే లేని నాడు...  నేనే శూన్యము

నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..

ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం


చరణం 1 :


తోడు నీడై.. అడుగుల జాడై.. 

నడిచే నడకలు నీవే

తేనియ వలపై.. తీయని పిలుపై.. 

పలికే పలుకులు నీవే 


ఈ అనురాగమే జీవితమూ.. 

ఈ అనుబంధమే శాశ్వతమూ

నాలో నీవై.. నీలో నేనై.. 

ఒకటై పోదాం నేడే ..

ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం 


చరణం 2 :


ఎన్ని తరాల.. ఎన్ని యుగాల...  

మారని మనసు నీవొ

ఎన్నడు లేని.. ఎవరికి లేని.. 

మాయని మమతవు నీవొ


ఎదలో ఉన్నది ఆలయము...  

అది నా దేవత మందిరము

మన ఈ జంటే.. గుడి జేగంటై.. 

మోగాలి కలకాలం..


ప్రియతమా....  నీ ఊపిరే నాకు ప్రాణం

నీ చూపులే నాకు దీపం

నీవే లేని నాడు...  నేనే శూన్యము

నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..


ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం...


- పాటల ధనుస్సు 


3, మే 2024, శుక్రవారం

అలివేణీ ఆణిముత్యమా | Aliveni Animutyama | Song Lyrics | Mudda Mandaram (1981)

అలివేణీ.. ఆణిముత్యమా..



రచన  : వేటూరి సుందరరామ మూర్తి 

సంగీతం : P రమేష్ నాయుడు 

గానం : S P బాలసుబ్రహ్మణ్యం, S. జానకి 

చిత్రం : ముద్ద మందారం (1981)


పల్లవి :


అలివేణీ.. ఆణిముత్యమా..

నీ కంట నీటి ముత్యమా...

ఆవిరి చిగురో.. ఇది ఊపిరి కబురో..

స్వాతివాన లేత ఎండలో..

జాలినవ్వు.. జాజి దండలో..


అలివేణీ ఆణిముత్యమా..

నా పరువాల ప్రాణ ముత్యమా...

జాబిలి చలువో..ఇది వెన్నెల కొలువో..

స్వాతివాన లేత ఎండలో..

జాజిమల్లీ.. పూలగుండెలో..


అలివేణీ ఆణిముత్యమా...


చరణం 1:


కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..

కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..

నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగా..

వద్దంటే ఒట్టుగా...

అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..

అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..

అడుగు మడుగులొత్తనా.. మెత్తగా...

ఔనంటే తప్పుగా...


అలివేణీ ఆణిముత్యమా..

నా పరువాల ప్రాణ ముత్యమా


చరణం 2:


పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..

పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..

పొగడదండలల్లు కోనా.. పూజగా...

పులకింతల పూజగా...


తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..

తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..

చెలిమై నేనుండిపోనా.. చల్లగా...

మరుమల్లెలు చల్లగా...


అలివేణీ.. ఆణిముత్యమా..

నీ కంట నీటి ముత్యమా..

జాబిలి చలువో..

ఇది వెన్నెల కొలువో..

స్వాతివాన లేత ఎండలో

జాజిమల్లీ పూలగుండెలో..

అలివేణీ.....

ఆణిముత్యమా...


- పాటల ధనుస్సు  



12, మార్చి 2024, మంగళవారం

వచ్చే వచ్చే వాన జల్లు | Vache Vache Vana Jallu | Song Lyrics | Intlo Ramayya Veedhilo Krishnayya (1982)

వచ్చే వచ్చే వాన జల్లు



చిత్రం : ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి : 


వచ్చే వచ్చే వాన జల్లు... 

జాల్మదియేలో

గుచ్చే గుచ్చే రేగు ముల్లు... 

జాల్మదియేలో

జాల్మదియేలో ... జాల్మదియేలో ... 

జాల్మదియేలో

పాడండి... 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... 

జాల్మదియేలో

విచ్చే విచ్చే మనసు రెమ్మా... 

జాల్మదియేలో

రెమ్మా మాటున చిలకమ్మా... 

జాల్మదియేలో

కమ్మా కమ్మగ పలుకమ్మా... 

జాల్మదియేలో 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... 

జాల్మదియేలో

విచ్చే విచ్చే మనసు రెమ్మా... 

జాల్మదియేలో 


చరణం 1 :


చక్కానమ్మ తానె పక్కాకు రాగానే

మొక్కాజొన్న చేను ఏం చేసే... 

నిక్కాపొడుచుకొని తేరి చూసే

గున్నాగున్నమ్మ వచ్చి 

నున్న పున్నమ్మ మెచ్చి

నిన్నే చెరుకొని ఏం చేసే... 

ఉన్నా ఉన్నదుండి నమిలేసే


కంటి రెప్ప చిటికేసే... 

కాకిపిల్లా గుటకేసే

కంటి రెప్ప చిటికేసే... 

కాకిపిల్లా గుటకేసే

కంటి రెప్ప చిటికేసే... 

కాకిపిల్లా గుటకేసే

ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్


వచ్చే వచ్చే వయసు బొమ్మా... 

జాల్మదియేలో

విచ్చే విచ్చే మనసు రెమ్మా... 

జాల్మదియేలో 


చరణం 2 :


కన్నేమో కల్వపిల్ల.. 

చూపేమో చాపపిల్లా

చిన్నారి నడకే హంసపిల్లా.. 

కోనంగి మనసే కోతిపిల్లా

చెట్టూ చాటెందుకింక.. 

సిగ్గు మాటెందుకింక

చెట్టాపట్టాలు వేసుకోరాదా...  

చెంగూన కట్టేసుకోరాదా

జోడు కుదిరెను ఇద్దరికీ... 

తాళమున్నది మద్దెలకి

జోడు కుదిరెను ఇద్దరికీ... 

తాళమున్నది మద్దెలకి


వచ్చే వచ్చే వయసు బొమ్మా... 

జాల్మదియేలో

విచ్చే విచ్చే మనసు రెమ్మా... 

జాల్మదియేలో

రెమ్మా మాటున చిలకమ్మా... 

జాల్మదియేలో

కమ్మా కమ్మగ పలుకమ్మా... 

జాల్మదియేలో 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... 

జాల్మదియేలో

విచ్చే విచ్చే మనసు రెమ్మా... 

జాల్మదియేలో


పాటల ధనుస్సు 


10, డిసెంబర్ 2023, ఆదివారం

నీలాలు కారేనా కాలాలు మారేనా | Neelalu Marena | Song Lyrics | Mudda Mandaram (1981)

నీలాలు కారేనా కాలాలు మారేనా



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి 

నేపధ్య గానం :  బాలు 


పల్లవి:


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


చరణం 1:


సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే

పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే

ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే

కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


చరణం 2:


ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో

కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కల పారి పోవాలి లే

ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో

ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే..


నీలాలు కారేనా కాలాలు మారేనా

నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా

జాజి పూసే వేళ జాబిల్లి వేళ

పూల డోల నేను కానా


పాటల ధనుస్సు 


జో... లాలి.. ఓ లాలి | Jo Laali O Laali | Song Lyrics | Mudda Mandaram (1981)

జో... లాలి.. ఓ లాలి



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి  

నేపధ్య గానం :  బాలు 



పల్లవి : 


జో..లాలి.. ఓ లాలి..

నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల

రెండు మూడు మాసాలాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా మూడో మాసములోన ఉయ్యాల

ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల 


చరణం 1 :


జో... లాలి.. ఓ లాలి...

నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల

నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల

ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

ఏడో మాసములోన ఉయ్యాల

నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల 


చరణం 2 :


జో... లాలి.. ఓ లాలి...

నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల

ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల

జో... లాలి.. ఓ లాలి...

నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల

నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల

నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల


పాటల ధనుస్సు 

ముద్దుకే ముద్దొచ్చే మందారం | Mudduke Muddoche Mandaram | Song Lyrics | Mudda Mandaram (1981)

ముద్దుకే ముద్దొచ్చే మందారం



చిత్రం :  ముద్దమందారం (1981)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


మందారం... ముద్దుమందారం

మందారం... ముద్దమందారం

ముద్దుకే ముద్దొచ్చే ... 

మువ్వకే నవ్వొచ్చే


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 1 :

అడుగులా అష్టపదులా...  

నడకలా జీవనదులా

అడుగులా అష్టపదులా...  

నడకలా జీవనదులా


పరువాల పరవళ్లు...  

పరికిణీ కుచ్చిళ్లూ

విరి వాలుజడ కుచ్చుల సందళ్లు


కన్నెపిల్లా కాదు...  కలల కాణాచి

కలువ కన్నులా...  కలల దోబూచి


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం



చరణం 2 :


పలుకులా రా చిలకలా... 

అలకలా ప్రేమ మొలకలా

పలుకులా రా చిలకలా... 

అలకలా ప్రేమ మొలకలా


మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

కురిసేటి పగడాల వడగళ్లు


మల్లెపువ్వా కాదు... మరుల మారాణి

బంతిపువ్వా పసుపు తాను పారాణి



ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


ముద్దుకే ముద్దొచ్చే మందారం

మువ్వల్లే నవ్వింది సింగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం

ముద్దమందారం ముగ్థ శృంగారం


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు