RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
srivariki premalekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
srivariki premalekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2026, ఆదివారం

సరిగమపదని స్వరధార | Sarigamapadani Swaradhara | Song Lyrics | Srivariki Premalekha (1984)

సరిగమపదని స్వరధార 


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపథ్య  గానం : ఎస్ పి బాలు,

  

పల్లవి :


తననం తననం తననం


గమప మపని దనిసా.....

సనిదప సనిదప

దపగరి దపగరి

సనిద నిదప దపగ పగరిస 

సా పా గరి సా

సా సా సా సా

రీ రీ రీ రీ

గా గా గా గా

పా పా పా పా


సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార  

సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార 

వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై...

వీణవై.. జాణవై.. వేణువై... వెలదివై

మువ్వవై.. ముదితవై.. 

వర్ణమై.. నా స్వర్ణమై

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే 


సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార  

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార.. 

రస సాగర యాత్రకు ధ్రువతార


చరణం 1 :


అరుణం అరుణం ఒక చీరా.... 

అంబరనీలం ఒక చీరా

అరుణం అరుణం ఒక చీరా... 

అంబరనీలం ఒక చీరా


మందారంలో మల్లికలా 

ఆకాశంలో చంద్రికలా

అందాలన్నీ అందియలై... 

శృంగారంలో నీ లయలై

అందాలన్నీ అందియలై... 

శృంగారంలో నీ లయలై

అలుముకున్న పూతావిలా... 

అలవికాని పులకింతలా  

హిందోళ రాగ గంధాలు 

నీకు ఆందోళికా సేవగా


ఆ....ఆ....ఆ....ఆ....

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 


చరణం 2 :


హరితం హరితం ఒక చీరా... 

హంసల వర్ణం ఒక చీరా

హరితం హరితం ఒక చీరా... 

హంసల వర్ణం ఒక చీరా

శాద్వలాన హిమదీపికలా... 

శరద్వేళ అభిసారికలా 


చరణాలన్నీ లాస్యాలై... 

నీ చరణానికి దాస్యాలై

అష్టపదుల ఆలాపనే... 

సప్తపదుల సల్లాపమై

పురివిప్పుతున్న పరువాల పైట 

సురటినే వీవగా ఆ.... 


ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో 

ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... 

రస సాగర యాత్రకు ధ్రువతార 


- పాటల ధనుస్సు 


లిపిలేని కంటి బాస | Lipileni Kanti Basa | Song Lyrics | Srivariki Premalekha (1984)

లిపిలేని కంటి బాస 


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి       


పల్లవి :


లిపిలేని కంటి బాస .. 

తెలిపింది చిలిపి ఆశ

నీ కన్నుల కాటుక లేఖలలో

నీ సొగసుల కవితా రేఖలలో

ఇలా... ఇలా... చదవనీ.. 

నీ రేఖనీ.. ప్రణయలేఖని


బదులైన లేని లేఖ .. 

బ్రతుకైన ప్రేమలేఖ

నీ కౌగిట బిగిసిన శ్వాసలతో

నీ కవితలు నేర్పిన ప్రాసలతో

ఇలా... ఇలా... రాయనీ.. 

నా లేఖనీ.. ప్రణయరేఖని


లిపిలేని కంటి బాస .. 

తెలిపింది చిలిపి ఆశ 


చరణం 1 :


అమావాస్య నిశిలో.. 

కోటి తారలున్న ఆకాశం

వెలుగుతు ఉంది వేదన తానై .. 

విదియనాటి జాబిలి కోసం


వెలుగునీడలెన్నున్నా.. ఆ.. ఆ.. 

వెలగలేని ఆకాశం...ఊ..

లలలా..ఆ .. ల...ల...లా ఆ ఆ ఆ... 

తనన తనన తనన తనన

ఎదుగుతు ఉంది వెన్నెల తానై .. 

ఒక్కనాటి పున్నమి కోసం


లిపిలేని కంటి బాస .. 

తెలిపింది చిలిపి ఆశ  


చరణం 2 :


అక్షరాల నీడలలో 

నీ జాడలు చూచుకునీ

ఆ పదాల అల్లికలో 

నీ పెదవులు అద్దుకుని


నీకంటికి పాపను నేనై .. 

నీ ఇంటికి వాకిలి నేనై

గడప దాటలేక నన్నే.. 

గడియ వేసుకున్నాను

ఘడియైన నీవు లేక.. 

గడపలేక ఉన్నాను


బదులైన లేని లేఖ .. 

బ్రతుకైన ప్రేమలేఖ

నీ కౌగిట బిగిసిన శ్వాసలతో

నీ కవితలు నేర్పిన ప్రాసలతో

ఇలా... ఇలా... రాయనీ.. 

నీ రేఖనీ.. ప్రణయరేఖని

లిపిలేని కంటి బాస.. 

తెలిపింది చిలిపి ఆశ


- పాటల ధనుస్సు 



మనసా తుళ్ళిపడకే | Manasa Tullipadake | Song Lyrics | Srivariki Premalekha (1984)

మనసా తుళ్ళిపడకే


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ జానకి      


పల్లవి :


మనసా తుళ్ళిపడకే.. 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో?

ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?

తొందరపడితే అలుసే 

మనసా..... తెలుసా


మనసా తుళ్ళిపడకే... 

అతిగా ఆశపడకే 


చరణం 1 :


ఏమంత అందాలు కలవనీ ..... 

వస్తాడు నిన్ను వలచి?

ఏమంత సిరి ఉంది నీకనీ ..... 

మురిసేను నిన్ను తలచి?

చదువా? ..... పదవా? ..... 

ఏముంది నీకు?

తళుకు ..... కులుకు ..... 

ఏదమ్మ నీకు..

శ్రుతిమించకే నీవు మనసా...


మనసా తుళ్ళిపడకే.. 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో?

ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?

తొందరపడితే అలుసే 

మనసా..... తెలుసా


మనసా తుళ్ళిపడకే... 

అతిగా ఆశపడకే


చరణం 2 :


ఏ నోము నోచావు నీవనీ ..... 

దొరికేను ఆ ప్రేమఫలము

ఏ దేవుడిస్తాడు నీకనీ ..... 

అరుదైన అంత వరము


మనసా వినవే మహ అందగాడు

కనుకా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా...


మనసా తుళ్ళిపడకే 

అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావో లేదో

ఆ శుభఘడియా వచ్చేనో రాదో

తొందరపడితే అలుసే 

మనసా ..... తెలుసా

మనసా తుళ్ళిపడకే 

అతిగా ఆశపడకే


- పాటల ధనుస్సు 


25, ఏప్రిల్ 2026, శనివారం

తొలిసారి మిమ్మల్ని చూసింది | Tolisari Mimmalni Chusindi | Song Lyrics | Srivariki Premalekha (1984)

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ జానకి      


సాకీ : 

శ్రీమన్ మహారాజ! 

మార్తాండ తేజా!

ప్రియానందభోజా! 

మీ శ్రీచరణాంభోజములకు 

ప్రేమతో నమస్కరించి... 

మిము వరించి

మీ గురించి ఎన్నో కలలు కన్న  

కన్నెబంగారు

భయముతో... భక్తితో... 

అనురక్తితో... శాయంగల 

విన్నపములూ.. ఊ... ఊ... 


సంధ్యారాగం చంద్రహారతి 

పడుతున్న వేళ

మసక చీకటి మధ్యమావతి 

పాడుతున్న వేళ

ఓ శుభముహూర్తానా...


పల్లవి :


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు 

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు

ఎన్నెన్నో కథలు


జో అచ్యుతానంద.. 

జో జో ముకుందా.. 

లాలి పరమానంద.. 

రామ గోవిందా

జో జో... 


అనుపల్లవి :


నిదురపోనీ కనుపాపలకు 

జోల పాడలేక..

ఈల వేసి చంపుతున్న 

ఈడునాపలేక...

ఇన్నాళ్లకు రాస్తున్నా

ఊహుహూహు... ప్రేమలేఖ  


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు.. 

ఎన్నెన్నో కథలు


చరణం 1 :


ఏ తల్లి కుమారులో 

తెలియదు కానీ

ఎంతటి సుకుమారులో 

తెలుసు నాకు


ఎంతటి మగధీరులో 

తెలియలేదు గానీ

నా మనసును దోచిన 

చోరులు మీరు 


వలచి వచ్చిన వనితను 

చులకన చేయక

తప్పులుంటే మన్నించి 

ఒప్పులుగా భావించి

చప్పున బదులివ్వండీ.. 

చప్పున బదులివ్వండి


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు... 

ఎన్నెన్నో కథలు


చరణం 2 :


తలలోన తురుముకున్న 

తుంటరి మల్లె

తలపులలో ఎన్నెన్నో 

మంటలు రేపే 

ఆ... అబ్బా..


సూర్యుడి చుట్టూ తిరిగే 

భూమికి మల్లే 

నా ఊర్పుల నిట్టూర్పుకు 

జాబిలి వాడే 

ఆహ్....  ఆహ్


మీ జతనే కోరుకొని 

లతలాగా అల్లుకొనే 

నాకు మీరు మనసిస్తే.. 

ఇచ్చినట్టు మాటిస్తే

ఇప్పుడే బదులివ్వండీ... 

ఇప్పుడే బదులివ్వండి 


తొలిసారి మిమ్మల్ని 

చూసింది మొదలు

కదిలాయి మదిలోన 

ఎనెన్నో కథలు... 

ఎన్నెన్నో కథలు 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు