RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ghantasala janaki songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ghantasala janaki songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2026, మంగళవారం

కొండలన్ని వెదికేను కోనలన్ని తిరిగేను | Kondalanni Vedikenu | Song Lyrics | Vasanthasena (1967)

కొండలన్ని వెదికేను కోనలన్ని తిరిగేను 


చిత్రం : వసంతసేన (1967)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల, జానకి 


పల్లవి :


కొండలన్ని వెదికేను.. 

కోనలన్ని తిరిగేను

చెలియా.. సఖియా.. 

నీ కోసమే..

రావే వయ్యారి.. 

నా వలపు మయూరి

రావే వయ్యారి.. 

నా వలపు మయూరి

నవ్వులు చిందించి 

నటియించవే..

ఏ..ఏ..ఏ.. నవ్వులు చిందించి 

నటియించవే


చెంత చేర రావోయి.. 

చింత తీర్చి పోవోయి

వయసు.. సొగసు.. నీ కోసమే..

నేడే వసంతం.. 

ఈ జగమున విరిసే

నేడే వసంతం.. 

నా మనసున విరిసే

కోయిల కొమ్మల్లో 

కూయన్నది

కూ.. కోయిల కొమ్మల్లో 

కూయన్నది..


చరణం 1 :


ఝుమ్మని రాగాలు 

పాడేను భ్రమరం.. 

కమ్మని తేనెల 

నందించు కుసుమం

జలజల నాట్యాల 

ప్రవహించు నదులు.. 

సాగర కౌగిట చేరేను తుదకు


చరణం 2 :


నెల రాజు నే వేళ 

పిలిచేను కలువ.. 

కలువకై జాబిల్లి 

కదిలీ వచ్చేను

వలచిన చెలికాని 

తలచేను చెలియా.. 

చెలియను మురిపించ 

చేరేను ప్రియుడు

నిజమైన అనురాగ మదియే కదా..

ఆ..ఆ.. నిజమైన 

అనురాగ మిదియే కదా..


చెంత చేర రావోయి.. 

చింత తీర్చి పోవోయి

వయసు..ఆ.. సొగసు..ఆ.. 

నీ కోసమే..


రావే వయ్యారి.. 

నా వలపు మయూరి..

రావే వయ్యారి.. 

నా వలపు మయూరి..

నవ్వులు చిందించి.. 

నటియించవే..

ఏ..ఏ..ఏ.. 

నవ్వులు చిందించి.. 

నటియించవే

ఓ సుందరీ.. ఓ సుందరీ..


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

ఏమో ఏమో ఇది నాకేమో | Emo Emo Idi | Song Lyrics | Aggi Pidugu (1964)

ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది


చిత్రం : అగ్గి పిడుగు (1964)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, జానకి


పల్లవి:


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది


ఏమో ఏమో అది... 

నీకేమి ఏమి అయినది

ఈ వేళలో నీ గుండెలో 

ఎందుకు గుబులౌతున్నది


హాయ్...

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది


చరణం 1:


కనులలో నీ కనులలో.. 

నా కలలే పొంగినవీ

కురులలో ముంగురులలో.. 

నా కోరికలూరినవీ


ఆహ.. ఆహ... ఆ..

వింతగా కవ్వింతగా 

ఈ వెన్నెల పూచినది

చెంతగా నువు చేరగా 

గిలిగింతగ తోచినది.. 

గిలిగింతగ తోచినది


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది


చరణం 2:


ఎందుకో సిగ్గెందుకో 

నా అందాలబొమ్మకు

అందుకో చేయందుకో 

మరి ఆవైపు చూడకు


ఆహ.. ఒహో.. ఆ..

నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. 

నను దోచివేయకు

మాటతో సయ్యాటతో 

నను మంత్రించివేయకు.. 

మంత్రించివేయకు


ఏమో ఏమో ఇది... 

నాకేమో ఏమో అయినది

ఈ వేళలో నా గుండెలో 

ఏదో గుబులౌతున్నది

ఆహ... ఆహ... ఆహ... అహ... 

ఊహూహు.. హూ..హుహు..


- పాటల ధనుస్సు 



అలుకమానవే చిలుకలకొలికిరో | Alukamanave Chilakala Kolikiro | Song Lyrics | Srikrishna Satya (1971)

అలుకమానవే చిలుకలకొలికిరో


చిత్రం : శ్రీకృష్ణ సత్య (1971)

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు  

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు

నేపథ్య గానం : ఘంటసాల, జానకి  


పల్లవి :


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


దారి తప్పి ఇటు చేరితివా... 

నీ దారి చూసుకోవోయి...

నా దరికి రాకు... రాకోయి..


చరణం 1 :


కూరిమి కలిగిన తరుణివి నీవని... 

తరుణమునెరిగియే చేరితినే

కూరిమి కలిగిన తరుణివి నీవని.. 

తరుణమునెరిగియే చేరితినే

నీ నెరినెరి వలపునే కోరితినే...

నీ నెరినెరి వలపునే వేడితినే... 


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


చరణం 2 :


చేసిన బాసలు చెల్లించని 

భల్ మోసగావేవోయి...

చేసిన బాసలు చెల్లించని 

భల్ మోసగావేవోయి...

ఇక ఆశ లేదు లేదోయి...

ఇక ఆశ లేదు పోవోయి...


దాసుని నేరము దండంతో సరి... 

బుసలు మాని ఓ వగలాడి...

దాసుని నేరము దండంతో సరి... 

బుసలు మాని ఓ వగలాడి.

నా సరసకు రావే సరసాంగి...

నా సరసకు రావే లలితాంగి...


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


- పాటల ధనుస్సు 


ప్రియా ప్రియా మధురం | Priya Priya Madhuram | Song Lyrics | Sri Krishna Satya (1971)

ప్రియా ప్రియా మధురం


చిత్రం :  శ్రీకృష్ణ సత్య (1971)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం :  ఘంటసాల, జానకి  


పల్లవి :


ప్రియా ప్రియా మధురం

ప్రియా ప్రియా మధురం

ప్రియా ప్రియా మధురం

పిల్లనగ్రోవి పిల్లవాయువు

పిల్లనగ్రోవి పిల్లవాయువు... 

భలే భలే మధురం...

అంతకు మించీ ప్రియుని కౌగిలీ... 

ఎంతో ఎంతో మధురం


ఇన్నీ ఉన్నా సరసిజలోచన... 

సరసన ఉంటేనె మధురాం

మనసిచ్చిన ఆ అలివేణి... 

అధరం..మరీ మరీ మధురం

ప్రియా ప్రియా మధురం


చరణం 1 :


ఏనాటి నా పూజాఫలమో

ఏ జన్మలో పొందిన వరమో

అందరుకోరే శ్యామసుందరుడే

అందరుకోరే శ్యామసుందరుడే... 

నా పొందు కోరుట మధురం


సత్యా కృష్ణుల సరసజీవనం

సత్యా కృష్ణుల సరసజీవనం

నిత్యం నిత్యం మధురం..

ప్రతినిత్యం అతి మధురం

ప్రతినిత్యం అతి మధురం... 


ప్రియా ప్రియా మధురం


చరణం 2 :


సవతులెందరున్నా..ఆ ఆ ఆ

సవతులెందరున్నా కృష్ణయ్యా

సత్యను వలచుట మధురం

భక్తికి రక్తికి లొంగని స్వామిని

కొంగున ముడుచుట మధురం

నా కడకొంగున ముడుచుట మధురం


ఈ భామామణి ఏమి పలికినా

ఈ భామామణి ఏమి పలికినా... 

ఔననుటే మధురం

ఈ చెలి పలుకుల పర్యవసానం

ఇంకా ఇంకా... మధురం..

ప్రియా ప్రియా మధురం


చరణం 3 :


నను దైవముగా నమ్మిన దానవు

కడ కొంగున నను ముడువని దానవు

చల్లని ఓ సతీ జాంబవతీ..ఈ... ఈ..

చల్లని ఓ సతీ జాంబవతీ

నీ సాహచర్యమే మధురం 


ప్రాణనాథా నీ పాద సేవలో

పరవశించుటే మధురం

తరియించుటే మధురాతి మధురం


- పాటల ధనుస్సు 


5, ఏప్రిల్ 2025, శనివారం

నడిరేయి ఏ జాములో | Nadireyi ye Jamulo | Song Lyrics | Rangula Ratnam (1966)

నడిరేయి ఏ జాములో



చిత్రం :  రంగులరాట్నం (1966)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల,  జానకి 


పల్లవి :


నడిరేయి ఏ జాములో.. 

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


నడిరేయి ఏ జాములో.. 

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ 


చరణం 1 :


మముగన్న మాయమ్మ 

అలివేలు మంగమ్మ

మముగన్న మాయమ్మ 

అలివేలు మంగమ్మ

పతి దేవు ఒడిలోన 

మురిసేటివేళా


స్వామి చిరునవ్వు వెన్నెలలు 

కురిసేటివేళా

విభునికి మా మాట వినిపించవమ్మా

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 2 :


ఏడెడు శిఖరాలు నే నడువలేను .. 

ఏ పాటి కానుకలందించలేను

వెంకన్న పాదాలు దర్శించలేను... 

నేను వివరించి నా బాధ వినిపించలేను


అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న 

మాయమ్మా అలివేలుమంగా

మము గన్న మాయమ్మా అలివేలుమంగా

విభునికి మా మాట వినిపించవమ్మా

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 3 :


కలవారినేగాని కరుణించలేడా..  

నిరుపేద మొరలేవి వినిపించుకోడా

కన్నీటి బ్రతుకుల కనలేనినాడు.. 

స్వామి కరుణామయుండన్నా 

బిరుదేలనమ్మా

అడగవే మా తల్లి అనురాగ వల్లి .. 

అడగవె మాయమ్మ అలివేలుమంగా


నడిరేయి ఏ జాములో..  

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


- పాటల ధనుస్సు 


3, ఆగస్టు 2024, శనివారం

కలల అలలపై తేలెను | Kalala Alalapai Telenu | Song Lyrics | Gulebakavali Katha (1962)

కలల అలలపై తేలెను



చిత్రం: గులేబకావళి కథ (1962)

సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల, జానకి


పల్లవి:


కలల అలలపై తేలెను... 

మనసు మల్లెపూవై...

ఎగసి పోదునో చెలియా... 

నీవే ఇక నేనై...

కలల అలల పై..


చరణం 1:


జలకమాడు జవరాలిని.. 

చిలిపిగ చూసేవెందుకు

జలకమాడు జవరాలిని.. 

చిలిపిగ చూసేవెందుకు

తడిసి తడియని కొంగున... 

ఒడలు దాచుకున్నందుకు..

తడిసి తడియని కొంగున... 

ఒడలు దాచుకున్నందుకు..


చూపుతోనే హృదయ వీణ 

ఝుమ్మనిపించేవెందుకు

చూపుతోనే హృదయ వీణ 

ఝుమ్మనిపించేవెందుకు

విరిసీ విరియని పరువము... 

మరులు గొలుపుతున్నందుకు..

విరిసీ విరియని పరువము... 

మరులు గొలుపుతున్నందుకు..

కలల అలల పై..


చరణం 2:


సడి సవ్వడి వినిపించని 

నడి రాతిరి ఏమన్నది

సడి సవ్వడి వినిపించని 

నడి రాతిరి ఏమన్నది

జవరాలిని చెలికాణిని... 

జంట గూడి రమ్మన్నది

జవరాలిని చెలికాణిని... 

జంట గూడి రమ్మన్నది


విరజాజులు పరిమళించు 

విరుల పానుపేమన్నది

విరజాజులు పరిమళించు 

విరుల పానుపేమన్నది

అగుపించని ఆనందము... 

బిగికౌగిట కలదన్నది..

అగుపించని ఆనందము... 

బిగికౌగిట కలదన్నది..


కలల అలలపై తేలెను 

మనసు మల్లెపూవై...

ఎగసి పోదునో చెలియా... 

నీవే ఇక నేనై...

కలల అలల పై..


- పాటల ధనుస్సు  

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు