RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
priya priya madhuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
priya priya madhuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2026, శనివారం

ప్రియా ప్రియా మధురం | Priya Priya Madhuram | Song Lyrics | Sri Krishna Satya (1971)

ప్రియా ప్రియా మధురం


చిత్రం :  శ్రీకృష్ణ సత్య (1971)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం :  ఘంటసాల, జానకి  


పల్లవి :


ప్రియా ప్రియా మధురం

ప్రియా ప్రియా మధురం

ప్రియా ప్రియా మధురం

పిల్లనగ్రోవి పిల్లవాయువు

పిల్లనగ్రోవి పిల్లవాయువు... 

భలే భలే మధురం...

అంతకు మించీ ప్రియుని కౌగిలీ... 

ఎంతో ఎంతో మధురం


ఇన్నీ ఉన్నా సరసిజలోచన... 

సరసన ఉంటేనె మధురాం

మనసిచ్చిన ఆ అలివేణి... 

అధరం..మరీ మరీ మధురం

ప్రియా ప్రియా మధురం


చరణం 1 :


ఏనాటి నా పూజాఫలమో

ఏ జన్మలో పొందిన వరమో

అందరుకోరే శ్యామసుందరుడే

అందరుకోరే శ్యామసుందరుడే... 

నా పొందు కోరుట మధురం


సత్యా కృష్ణుల సరసజీవనం

సత్యా కృష్ణుల సరసజీవనం

నిత్యం నిత్యం మధురం..

ప్రతినిత్యం అతి మధురం

ప్రతినిత్యం అతి మధురం... 


ప్రియా ప్రియా మధురం


చరణం 2 :


సవతులెందరున్నా..ఆ ఆ ఆ

సవతులెందరున్నా కృష్ణయ్యా

సత్యను వలచుట మధురం

భక్తికి రక్తికి లొంగని స్వామిని

కొంగున ముడుచుట మధురం

నా కడకొంగున ముడుచుట మధురం


ఈ భామామణి ఏమి పలికినా

ఈ భామామణి ఏమి పలికినా... 

ఔననుటే మధురం

ఈ చెలి పలుకుల పర్యవసానం

ఇంకా ఇంకా... మధురం..

ప్రియా ప్రియా మధురం


చరణం 3 :


నను దైవముగా నమ్మిన దానవు

కడ కొంగున నను ముడువని దానవు

చల్లని ఓ సతీ జాంబవతీ..ఈ... ఈ..

చల్లని ఓ సతీ జాంబవతీ

నీ సాహచర్యమే మధురం 


ప్రాణనాథా నీ పాద సేవలో

పరవశించుటే మధురం

తరియించుటే మధురాతి మధురం


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు