RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
balu susheela songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
balu susheela songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2026, సోమవారం

వెండి చందమామలు | Vendi Chandamamalu | Song Lyrics | Bava Maradallu (1984)

వెండి చందమామలు


చిత్రం : బావామరదళ్లు (1984)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు

వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు 

ఎవరి కోసము?

ఒకరి కోసం ఒకరున్న 

జంట కోసము

బంధమైన అందమైన 

బ్రతుకు కోసము 


వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు

వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు 

ఎవరి కోసము?

ఒకరి కోసం ఒకరున్న 

జంట కోసము

బంధమైన అందమైన 

బ్రతుకు కోసము  


చరణం 1 :


ఘడియలైన  కాలమంతా 

ఘడియైనా వీడలేని

ఘాఢమైన మమతలు 

పండే కౌగిలి కోసం 


మధువులైన మాటలన్నీ 

పెదవులైన ప్రేమలోనే

తీపి తీపి ముద్దులు 

కొసరే వలపుల కోసం


నవ్వే నక్షత్రాలు... 

రవ్వల చాందినీలు

పండినవే కలలు... 

అవి పరచిన పానుపులు


నీవు లేక నాకు రాని 

నిదర కోసము...

నిన్ను తప్ప చూడలేని 

కలల కోసము


వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు

అ... అహహ.. ఏహే.. ఆ... ఆ.. ఆ.. 


చరణం 2 :


తనువులైన బంధమంతా 

క్షణమైనా వీడలేని

అందమైన ఆశలు పూసే 

ఆమని కోసం


పల్లవించు పాటలన్నీ 

వెలుగులైన నీడలలోనే

తోడు నేను ఉన్నానన్నా 

మమతల కోసం


వెన్నెల కార్తీకాలు... 

వెచ్చని ఏకాంతాలు

పిలిచే కోయిలలు... 

అవి కొసరే కోరికలు


నిన్ను తప్ప కోరుకోని 

మనసు కోసము...

నీవు నేను వేరు కాని 

మనువు కోసము


వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు

వెండి చందమామలు... 

వేయి తీపి రాత్రులు

ఎండపూల జల్లులు 

ఎవరి కోసము

ఒకరి కోసం ఒకరున్న 

జంట కోసము

బంధమైన అందమైన 

బ్రతుకు కోసము 


- పాటల ధనుస్సు 


24, ఫిబ్రవరి 2026, మంగళవారం

నల్ల౦చు తెల్లచీర | Nallanchu Tella Cheera | Song Lyrics | Donga Mogudu (1987)

నల్ల౦చు తెల్లచీర


చిత్రం: దొంగ మొగుడు (1987)

సంగీతం: చక్రవర్తి

 గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నల్ల౦చు తెల్లచీర

 ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా

 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే భామా.. 

వేడెక్కి నేరేగనా..

ముసిరే మిసమిసలే 

గుసగుసగా వలవిసిరే హొయ్


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా 

ఒహొకోరేవు మోమాటము రాజా... 

రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి 

వసివాడేను సొగసే... హొయ్


చరణం 1:


సాగే వన్నెవాగే నన్ను... 

కమ్మేసి౦దిరో

ఊగే కన్నెలాగే నన్ను ...

లాగేసి౦దిరో

మూగే మూగ సైగే నన్ను ...

ముద్దాడి౦ద రో

ఊగే తీగలాగే మేను... 

అల్లాడి౦దిరో


గాజుల బాజాలతో ...

జాజులు ఊరేగెనే

మోజుల రోజాలతో ...

రోజులు ఎదురేగెనే

తనివే తీరని... 

తనిమే ఊరనీ

జతలో గతులే... జతులై...


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా

 ఒహొనల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. 

తల్లోన మల్లెమాలా ఓ..


చరణం 2:


కాగే ఈడు కోరే 

వేడి ఉ౦దీ లోయలో

రేగే చల్లగాలే 

ము౦చుతు౦ది మాయలో

రాలే మ౦చుపూలే 

పె౦చె నాలో దాహము

జాలేలేని చలిలో 

ది౦చుతు౦ది మోహము


కౌగిలి చెరసాలలో ...

ఈ చెలి చిక్కాలిలే

పెదవుల సరసాలలో... 

కోరిక కరగాలిలే

మరిగే మరులనే... 

నదులై పారనీవిరులే 

జడిసే ఒడిలో....ఏహ్..


నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. 

తల్లోన మల్లెమాలా

 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే 

భామా.. వేడెక్కి నేరేగనా

ముసిరే మిసమిసలే 

గుసగుసగా వలవిసిరే హొయ్..


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... 

చూడొద్దు తేరిపారా ఒహొ

కోరేవు మోమాటము రాజా... 

రేపేవు ఆరాటమూ

విరి తూపుల జడిలో పడి 

వసివాడేను సొగసే... హొయ్


- పాటల ధనుస్సు 


31, జనవరి 2026, శనివారం

తూరుపు సింధూరపు మందారపు | Toorupu Sindhurapu | Song Lyrics | Manushulu Marali (1969)

తూరుపు సింధూరపు మందారపు 


చిత్రం :  మనుషులు మారాలి (1969)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం... 

ఉదయరాగం.. హృదయగానం

తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం

మరల మరల ప్రతియేడు 

మధుర మధురగీతం...

జన్మదిన వినోదం

మరల మరల ప్రతియేడు 

మధుర మధుర గీతం..

జన్మదిన వినోదం


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 1:


వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వేల వేల వత్సరాలకేళిలో...

మానవుడుదయించిన 

శుభవేళలో..ఓ..

వీచే మలయమారుతాలు ...

పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే...

మలిచెకాంతి తోరణాలు..

ఓ..ఓ...హోయ్


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


చరణం 2:


వలపులోన పులకరించు 

కన్నులతో ...

చెలిమి చేరి పలకరించు 

మగవారు

మనసులోన పరిమళించు 

వెన్నెలతో...

ప్రియుని చూచి పరవశించే 

ప్రియురాలు

జీవితమే స్నేహమయం... 

ఈ జగమే ప్రేమమయం.. 

ప్రేమంటే ఒక భోగం

కాదు కాదు అది త్యాగం ..

ఓ..ఓ...హోయ్..


తూరుపు సింధూరపు 

మందారపు వన్నెలలో

ఉదయరాగం.. హృదయగానం...

ఉదయరాగం.. హృదయగానం...


- పాటల ధనుస్సు 



11, జనవరి 2026, ఆదివారం

అందాలా శ్రీమతికి మనసైనా ప్రియసతికీ | Andala Srimathiki | Song Lyrics | Chinnanati Snehitulu (1971)

అందాలా శ్రీమతికి మనసైనా ప్రియసతికీ


చిత్రం :  చిన్ననాటి స్నేహితులు (1971)

సంగీతం :  టి. వి. రాజు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


అందాలా శ్రీమతికి . . 

మనసైనా ప్రియసతికీ

వలపుల కానుకగా . . 

ఒక పాపను నేనివ్వనా


మబ్బులలో విహరించే . . 

మా వారి అనురాగం

వాడని మందారం . . 

నా పాపట సిందూరం


చరణం 1:


మా బాబు నయనాలూ.. 

లేత జాబిల్లి కిరణాలు

మా బాబు నయనాలూ.. 

లేత జాబిల్లి కిరణాలు


వీడే ఇంతవాడె అంతవాడై.. 

వెలుగుతాడూ

వీడే ఇంతవాడె అంతవాడై.. 

వెలుగుతాడూ

కలలు నిండారగా.. 

సిరులు కొండాడగా


అందాలా శ్రీమతికి.. 

మనసైనా ప్రియసతికీ

వలపుల కానుకగా.. 

ఒక పాపను నేనివ్వనా


మబ్బులలో విహరించే.. 

మా వారి అనురాగం

వాడని మందారం..  

నా పాపట సిందూరం


చరణం 2 :


శౌర్యంలో నేతాజీ..  

సహనంలో గాందీజీ

శాంతి గుణంలో నెహ్రూజీ..

శాంతి గుణంలో నెహ్రూజీ.. 

సాహసంలో శాస్త్రీజీ  


ఒరవడిగా.. వడివడిగా 

నీ నడవడి తీర్చి దిద్దుకుని

ఒరవడిగా..  వడివడిగా 

నీ నడవడి తీర్చి దిద్దుకుని 


సరిహద్దులలో పొంచిన ద్రోహుల 

తరిమి తరిమి కొట్టాలీ

వీర సైనికుడివై భరతావని 

పేరును నిలబెట్టాలీ

వందేమాతరం..  వందేమాతరం.. 

వందేమాతరం.. వందేమాతరం.. 


- పాటల ధనుస్సు 


ఓ బంగరు రంగుల చిలకా | O Bangaru Rangula Chilaka | Song Lyrics | Thota Ramudu (1975)

ఓ బంగరు రంగుల చిలకా


చిత్రం :  తోట రాముడు (1975)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఓ.. బంగరు రంగుల చిలకా.. 

పలకవే..

ఓ.. అల్లరి చూపుల రాజా..  

ఏమనీ..

నా మీద ప్రేమే ఉందనీ..

నా పైన అలకే లేదనీ


ఓ..  అల్లరి చూపుల రాజా.. 

పలకవా.. 

ఓ..  బంగరు రంగుల చిలకా 

ఏమనీ ....

నా మీద ప్రేమే ఉందనీ.... 

నా పైన అలకే లేదనీ


ఓ.. ఓ.. ఓహో..హో..హో.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


చరణం 1 :


పంజరాన్ని దాటుకునీ.. 

బంధనాలు తెంచుకునీ..

నీ కోసం వచ్చా ఆశతో

మేడలోని చిలకమ్మా..

మిద్దెలోని బుల్లెమ్మా..

నిరుపేదను వలచావెందుకే

నీ చేరువలో.. నీ చేతులలో.. 

పులకించేటందుకే ..


ఓ బంగరు రంగుల చిలకా 

పలకవే..

ఓ అల్లరి చూపుల రాజా 

ఏమనీ..

నా మీద ప్రేమే ఉందనీ..

నా పైన అలకే లేదనీ


చరణం 2 :


సన్నజాజి తీగుంది..

తీగ మీద పువ్వుంది..

పువ్వులోని నవ్వే నాదిలే

కొంటె తుమ్మెదొచ్చింది..

జుంటి తేనె కోరింది..

అందించే భాగ్యం నాదిలే

ఈ కొండల్లో..ఈ కోనల్లో.. 

మనకెదురే లేదులే....


ఓ..  అల్లరి చూపుల రాజా.. 

పలకవా.. 

ఓ..  బంగరు రంగుల చిలకా 

ఏమనీ ....

నా మీద ప్రేమే ఉందనీ.... 

నా పైన అలకే లేదనీ


- పాటల ధనుస్సు 


4, అక్టోబర్ 2025, శనివారం

పరుగులు తీసే వయసుంటే | Parugulu Teese Vayasunte | Song Lyrics | Station Master (1987)

పరుగులు తీసే వయసుంటే



చిత్రం :  స్టేషన్ మాస్టర్ (1987)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  సిరివెన్నెల

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


హె ఏ అహా లాలా

పరుగులు తీసే వయసుంటే... 

ఉరకలు వేసే మనసుంటే

బ్రతుకే ఒక రైలు బండీ... 

సరదాల ప్రయాణమండీ

చికుచికు బం బం 

చికుచికు బం బం బం

ల లల లలా లలా

ల లల లలా లలా


చరణం 1 : 


ఆపద ఉందని నిలబడిపోతే 

ఆగదు సమయం ఏ నిమిషం

చిరుచిరు నవ్వుల దీపం ఉంటె

చిక్కుల దిక్కులన్ని దాటుకు పోవాలి

చుక్కలున్న మజిలి చేరాలి

బంగరు మెరుపుల సంపదలన్ని 

ముంగిలి లోనే నిలపాలి

కరక్ట్

సందేహించక ముందుకు పోతే... 

గెలుపు చిక్కడం ఖాయం

డెఫెనేట్లీ

దూసుకుపోయే ధైర్యం ఉంటే...  

ఓడక తప్పదు కాలం

ల లల లలా లాల లా

దు దుదు తర తరా రా

పరుగులు తీసే వయసుంటే... 

ఉరకలు వేసే మనసుంటే


కొండలు కోనలు అడ్డున్నాయని.... 

సాగక మానదు సెలయేరు

గల గల పాటల హుషారు ఉంటే 

అలసట కలవదు ఆ జోరు

ఆకాశపు అంచులు తాకాలి... 

ఆనందపు లోతులు చూడాలి

కోరిన స్వర్గము చేరిన నాడే 

మనిషికి విలువని చాటాలి


ఆ.... ఆహా

ఆలోచించక అడుగులు వేస్తే... 

పడుతు తొక్కడం ఖాయం

నేలను విడిచిన సాములు చేస్తే...  

తగలక తప్పదు గాయం

ల లల లలా లలా

ల లల లలా లలా


పరుగులు తీసే వయసుంటే... 

ఉరకలు వేసే మనసుంటే

బ్రతుకే ఒక రైలు బండీ... 

సరదాల ప్రయాణమండీ

చికుచికు బం బం 

చికుచికు బం బం బం

ల లల లలా లలా

కు ఊ కు ఊ

చికుచికు చికుచికు చికుచికు

ల లల లలా లలా


- పాటల ధనుస్సు 


2, సెప్టెంబర్ 2025, మంగళవారం

పిలిచే వారుంటే పలికేను నేను | Pilichevarunte Palikenu nenu | Song Lyrics | Kalyana Mantapam (1971)

పిలిచే వారుంటే పలికేను నేను



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


పిలిచే వారుంటే.. పలికేను నేను

పిలిచే వారుంటే.. పలికేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను

కనుపాప అద్దాన కదిలేను నేను.. 

ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను

పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 1 :


ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...

ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము

కలకాలము నిలవాలిలే.. 

మన అనురాగము

గోదారిలా నేడు ఉరికేను మనసు.. 


నీ పిలుపు వినగానే.. 

పులకించె బ్రతుకు 

పులకించె బ్రతుకు

పిలిచే వారుంటే.. పలికేను నేను 


హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 

నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే

నా అందమే అరవిందమై 

నిను పూజించెలే 

నీ మనసులో నాకు 

చోటుంటే చాలు

నా బ్రతుకులో విరియు 

నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను...

కనుపాప అద్దాన కదిలేను నేను

ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది 

చెలి ఔనన్నది

సొగసున్నదీ... గుణమున్నదీ 

చెలి నాదైనది 


అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము 


మన మొకటి కాగానే మారాలి జగము

మారాలి జగము.. మారాలి జగము.. 

మారాలి జగము


- పాటల ధనుస్సు 


కాలమిలా ఆగిపోనీ | Kalamila Agiponi | Song Lyrics | Edi Papam Edi Punyam (1979)

కాలమిలా ఆగిపోనీ



చిత్రం: ఏది పాపం? ఏది పుణ్యం? (1979)

సంగీతం: సత్యం

గీతరచయిత: మైలవరపు గోపి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


కాలమిలా ఆగిపోనీ...

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి... ఈ నిమిషంలో... 

నీ ఒడిలోనే నిదురపోనీ


కాలమిలా ఆగిపోనీ...

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి ఈ నిమిషంలో... 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


చరణం 1 :


తొలిసంజె మలి సంజెలేల... 

నా చెంత చెలి ఉన్న వేళ

తొలిసంజె మలి సంజెలేల... 

నా చెంత చెలి ఉన్న వేళ


చిరుగాలి సెలయేరులేల... 

నా మనిషి తోడున్న వేళ


అనువైన వేళ... ఈ శుభవేళ...

బ్రతుకే వెన్నెల వేళా... 

వేళా.. వేళా..


కాలమిలా ఆగిపోనీ... 

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ.. 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


చరణం 2 :


సిరిదివ్వెలో వెలుగులాగ... 

నీ చూపులో నిలిచిపోనీ

సిరిదివ్వెలో వెలుగులాగ... 

నీ చూపులో నిలిచిపోనీ


జేగంటలో రవళిలాగ... 

నీ ఊపిరై కలిసిపోనీ...

కలలే కాని... కలతే లేని..

లోకానికే చేరిపోనీ... చేరిపోనీ...


కాలమిలా ఆగిపోనీ... 

కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ.. 

నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


- పాటల ధనుస్సు 


30, ఆగస్టు 2025, శనివారం

ఏం వానో తడుముతున్నదీ | Yem Vano Tadumutunnadi | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

ఏం వానో తడుముతున్నదీ



చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సిరివెన్నెల

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి :


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

చాటు మాటు దాటి 

అవీ ఇవీ చూసేస్తోందే


ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గోలో ఉరుముతున్నదీ

ఆట పాట చూపీ 

అటూ ఇటూ లాగేస్తోందే


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

ఆ...


చరణం 1 :


చినుకు పడు క్షణమేదో 

చిలిపి సడి చేసిందీ

ఉలికిపడి తలపేదో 

కలల గడి తీసిందీ

వానమ్మా వాటేస్తుంటే 

మేనంతా మీటేస్తుంటే

ఇన్నాళ్ళూ ఆ..ఆ..

ఓరగ దాగెను వయ్యారం 

ఓగున పాడెను శృంగారం

ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది


ఏం వానో ఉరుకుతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

ఆ...


చరణం 2 :


మనకు గల వరసేదో 

తెలిసి ఎద వలచిందో

మునుపు గల ముడి ఏదో 

బిగిసి జత కలిపిందో

ఏమైందో ఏమోనమ్మా

ఏనాడో రాసుందమ్మా

ఇన్నాళ్ళూ ఆ.. ఆ..

ఉడుకున ఉడికిన బిడియాలు 

ఒడుపుగ ఒలికెను చెలికాడు

నా చూపు నచ్చిందొ 

నాజూకు ఇచ్చింది


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

చాటు మాటు దాటి 

అవీ ఇవీ చూసేస్తోందే


ఏం వానో తడుముతున్నదీ

ఇది ఏం గాలో తరుముతున్నదీ

హ్మ్...


- పాటల ధనుస్సు 


మనసులోని మర్మమును | Manasuloni Marmamunu | Song Lyrics | Nari Nari Naduma Murari (1990)

మనసులోని మర్మమును



చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


మనసులోని మర్మమును 

తెలుసుకో...

నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

మాన రక్షకా.. మరకతాంగ

మానరక్షకా.. మరకతాంగ


నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

నా మనసులోని మర్మమును 

తెలుసుకో...

మదన కీలగ.. మరిగిపోక..

మదనకీలగ...మరిగిపోక..

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 1:


ఇనకులాబ్ధ.. 

నీవేకాని వేరెవరులేరు

దిక్కెవరు లేరు

ఆనంద హృదయా.. 

మనసులోని మర్మమును 

తెలుసుకో


అనువుగాని ఏకాంతాన.. 

ఏకాంతకైనా

ఆ కాంక్ష తగున.. 

రాకేందు వదనా


మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 2:


మునుపు ప్రేమగల దొరవై

సదా తనువునేలినది 

గొప్ప కాదయా


మదిని ప్రేమ కథ మొదలై

ఇలా అదుపుదాటినది 

ఆదుకోవయా


కనికరమ్ముతో ఈ వేళ..ఊ..ఊ..ఊ..

కనికరమ్ముతో ఈ వేళ.. 

నా కరముబట్టు.. ఆ..

త్యాగరాజ వినుతా..


మనసులోని మర్మమును 

తెలుసుకో

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


చరణం 3:


మరుల వెల్లువల వడినై

ఇలా దరులు దాటితిని 

నిన్ను చేరగా


మసక వెన్నెలలు ఎదురై

ఇలా తెగువ కూడదని 

మందలించవా


కలత ఎందుకిక ఈ వేళా?? 

ఆ..ఆ..ఆ..

కలవరమ్ముతో ఈ వేళ..

నా కరము వణికే..ఆ..ఆ

ఆగాడాల వనితా..


మనసులోని మర్మమును 

తెలుసుకో

మదనకీలగ..మరిగిపోక

మానరక్షక.. మరకతాంగ

నా మనసులోని మర్మమును 

తెలుసుకో


- పాటల ధనుస్సు 



27, జులై 2025, ఆదివారం

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ | Suvvi Suvvi Chude Olammi | Song Lyrics | Jeevitha Chakram (1971)

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


హేయ్ పిల్లా.. ఎక్కడికెళ్తున్నావ్? 

హోయ్ హోయ్.. ఏమిటీ?

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ..

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ.. 

హోయ్ హోయ్ !

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..


సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

హాయ్

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

హోయ్ హోయ్


చరణం 1 :


ఊగే కొమ్మల్లోన నీవే సాగే మబ్బుల్లోన 

నీవే ఎగిరే గువ్వల్లోన నీవే

అదిరే గుండెల్లోన నీవే..   

అరెరే కింద మీదా నీవే..  ఆ..ఆ....


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..  

అహ...

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ


చరణం 2 :


అసలే నా వయసూ లేత.. 

ఆపై చలిగాలి కోత

అందుకే రాశాడు ఆ తాత..  

ఇద్దరం కలుసుకునే రాత

ఇక పై మన బ్రతుకే మోత..  ఆ... ఆ.....


యెహ్.. సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..  

అహ...


చరణం 3 :


నీవే అనార్కలివైతే...  

నేనే సలీంబాబు నౌతా

నీవే షాజహానువైతే ... 

నేనే ముంతాజునౌతా...

నీకో తాజ్ మహల్ కడతా


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

అహ...


సువ్వీ సువ్వీ.. సువ్వీ సువ్వీ.. 

చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..

సువ్వీ సువ్వీ..  సువ్వీ సువ్వీ.. 

చూడర చిన్నోడా నువ్వే కావాలిరా.. 

అహ...


యెహ్ అమ్మి వెళ్ళిపోతున్నావా...  

మళ్ళి వస్తావా.. ఆహా...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు