RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chakravarthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chakravarthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

శాంతీ ఓం శాంతీ | Shanti Om Shanti | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

శాంతీ ఓం శాంతీ 


చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: ఎస్. పి .బాలు, ఎస్ జానకి

పల్లవి:

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి పోయే దారేదీ
స్పీడె తగ్గించు లేడీ 
వేడుక కాదయ్య 
చూడు నా వేడి ఇక
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి


చరణం: 1

టక్కు టిక్కు టెక్కు 
నిక్కు తుపాఖీ
రుక్క పిక్క దక్కే 
వేలా జలాకీ
కౌగిళ్లల్లో ఖైదూ...
చెయ్యాలమ్మ నేడూ
శ్రుతే ముంచి మతే పోయీ 
జతే అయినందుకూ
ఈ కేసునే కొట్టెయనా 
పట్టెసుకోనా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి 

చరణం: 2

కన్ను ముక్కు సోకు 
చూసి వరించా
ఎక్కి తొక్కి నీకే 
దక్కి వలేసా
వయ్యారంతో ఫైలూ 
వొళ్ళోకొస్తే వెయ్యి
బజారంతా మజాచేసెయ్ 
నిషా అందాలతో
నీ ఊపులో ఊరేగనా 
చలరేగిపోనా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి పోయే దారేదీ
స్పీడె తగ్గించు లేడీ 
వేడుక కాదయ్య 
చూడు నా వేడి ఇక
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా


- పాటల ధనుస్సు

టింగురమ్మ చక్కనమ్మ | Tinguramma Chakkanamma | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

టింగురమ్మ చక్కనమ్మ 

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం:  చక్రవర్తి

సాహిత్యం:  వేటూరి

గానం: ఎస్.పి.బాలు, ఎస్ జానకి


పల్లవి:


టింగురమ్మ  చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

చెంగు చెంగు లేది చూపు 

కళ్ళకెంత మక్కువో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా


టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

టింగు టింగు రెప్పలాడు 

కళ్ళకెంత తాకిడొ

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


చరణం: 1


నీ ఒంపుకొక్క కొంప కట్టి 

కాపురాలు చేసెయ్యనా

నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి 

కన్నె సోకు కాజెయ్యనా

అరె కొత్త పిచ్చి పట్టుకున్న 

ఖోడె గాడికేమో కొంగే అలుసంటా

కోక సిగ్గు వీడకున్న ఈడు 

తల్లికేమో కొంతే తెలుసంటా

సరేనంటె సాయంకాలం 

చలె తీరిపోదా

అలాగంటె వేలాకోలం 

శృతేమించి పోదా


టింగురమ్మ చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


చరణం: 2


నీ ముట్టడింక ఆపలేక 

ముద్దబంతులిచ్చెయ్యనా

నీ తట్టుడింక తట్టుకుంటు 

తందనాలకొచ్చెయ్యనా

తేమ గాలి అంటుకొని 

ప్రేమ పురాణం చెబుతా రమ్మంటా

తెల్ల చీర కట్టు తప్పు 

భామా కలాపం ఇపుడే లెమ్మంటా

చలాకీల సయ్యాటల్లో 

సలామంట నీకూ

గులాభీల పూదోటుందీ 

చలో అంట నేనూ


టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

టింగు టింగు రెప్పలాడు 

కళ్ళకెంత తాకిడొ

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


టింగురమ్మ చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

చెంగు చెంగు లేది చూపు 

కళ్ళకెంత మక్కువో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా


- పాటల ధనుస్సు


5, సెప్టెంబర్ 2026, శనివారం

అగ్గిపుల్ల భగ్గుమంటది | Aggipulla Bhaggumantadi | Song Lyrics | Adavi Simhalu (1983)

అగ్గిపుల్ల భగ్గుమంటది 


చిత్రం: అడవి సింహాలు (1983)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి:


హా..అగ్గిపుల్ల భగ్గుమంటది 

ఓ..ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..

ఓ..ఓ..ఓ..ఓ..

హ..హ..హ..హ..

అగ్గిపుల్ల చీకటింటికే

హ..హ..హ..హ..

ఆడపిల్ల కౌగిలింతకే

చీకటింటిలో... కౌగిలింతలో.. 

నీ చింత తీర్చేసుకో


అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది 

ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..

ఓ..ఓ.ఓ..

అప్... అప్...అప్... అప్.....

అగ్గిపుల్ల అంటుకుంటదీ ..

హ..హ..హ..హ..

ఆడపిల్ల జంటగుంటదీ...

అందమిప్పుడే అంటగట్టుకో... 

నీ ముద్దు తీర్చేసుకో


అహా.. అగ్గిపుల్ల భగ్గుమంటది 

ఓ..ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..

ఓ..ఓ..ఓ..ఓ..


చరణం 1:


చూపు తాకిడి సుఖమేముందీ.. 

చేయి అలజడి నీ ఇష్టం

నిలువు దోపిడి సగమైపోయే.. 

చూసుకో మరి నా ఇష్టం

చూపు తాకిడి సుఖమేముందీ.. 

చేయి అలజడి నీ ఇష్టం

నిలువు దోపిడి సగమైపోయే.. 

చూసుకో మరి నా ఇష్టం


దొంగ చేతిలో తాళం ఉందీ.. 

తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ..

అంగుళానికో అందం ఉందీ.. 

బేరమప్పుడే పెంచుతు ఉంది


చౌక బేరమే ..సోకు లాభమే...

ఘరానాదొంగకి


అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..

హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే

హ..హా...ఆడపిల్ల కౌగిలింతకే

చీకటింటిలో... కౌగిలింతలో ..

నీ చింత తీర్చేసుకో


అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..


చరణం 2 :


దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. 

దొంగ సరుకే నాకిష్టం

అలక ముద్దులు అడిగే కన్నా.. 

దోచుకుంటే నా కిష్టం

దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. 

దొంగ సరుకే నాకిష్టం

అలక ముద్దులు అడిగే కన్నా.. 

దోచుకుంటే నా కిష్టం


కంటి చూపులో గారం ఉందీ... 

వంటి నిండ బంగారం ఉందీ...

కన్నె చూడనీ నేరం ఉందీ... 

కమ్ముకుంటే శృంగారం ఉందీ..


సొంత లాభము కొంత మానుకో... 

ఫలానా వేళకి..


అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..

హ..హ..హ..హ..

అగ్గిపుల్ల చీకటింటికే

హ..హ..హ..హ..

ఆడపిల్ల కౌగిలింతకే

చీకటింటిలో... కౌగిలింతలో.. 

నీ చింత తీర్చేసుకో


అగ్గిపుల్ల భగ్గుమంటది 

ఓ..ఓ..ఓ..ఓ..

ఆడపిల్ల సిగ్గులంటది..

ఓ..ఓ.ఓ..ఓ..


- పాటల ధనుస్సు


30, ఆగస్టు 2026, ఆదివారం

అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క | Are Chikkindamma Chikkindi | Song Lyrics | Shakti (1983)

అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క 


చిత్రం: శక్తి (1983)

సంగీతం: కె.చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి:


అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

అరె దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో 

తీపి తిక్క


చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో  

తీపి తిక్క


చరణం: 1


అందాలన్ని చూస్తూ చూస్తూ 

ఆగలేక

ఆగలేనే వయసుతోని 

వేగలేక

మల్లెపూలు చల్లగాలి 

ఓపలేక

మంచం మీద దొర్లి దొర్లి 

నిద్రరాక

హేయ్ వచ్చేశాను వేళాపాళ 

చూసుకోక

వచ్చేశాను వేళాపాళ 

చూసుకోక

చెప్పేశాను తప్పోవప్పో 

దాచుకోక

చెప్పేశాను తప్పోవప్పో 

దాచుకోక


అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా రేపో నేడో 

తీపి తిక్క


చరణం: 2


కాగే కాగే వచ్చావింక 

కాచుకోక

కళ్ళల్లోకి చూసుకొంటు 

ఉండిపోక

ఉయ్యాలల్లే ఊగుతున్న 

నడుముదాక

ఉత్సహంగా చెయ్యివేస్తే  

వదిగిపోక

కొంగు గాలి తగలంగానే 

పొంగిపోక

కొంగు గాలి తగలంగానే 

పొంగిపోక

పొంగుతున్న పాలమీద 

నీళ్లు చల్లక

అరె పొంగుతున్న పాలమీద 

నీళ్లు చల్లక


హెయ్ చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

హోయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో  

తీపి తిక్క


- పాటల ధనుస్సు


29, ఆగస్టు 2026, శనివారం

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట | Eepoddulu Yerugani | Song Lyrics | Kirayi Alludu (1984)

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట


చిత్రం: కిరాయి అల్లుడు (1984)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: వేటూరి 

గానం: ఎస్ పి బాలు, ఎస్.పి.శైలజ 


పల్లవి:


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

జతచేరి అల్లుకొంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన 


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


చరణం: 1


మధుమాసమే మనకోసము

మధుమాసమే మనకోసము

పూ పొదరింటికి పేరంటానికి 

రమ్మని పిలిచింది 

చలిగాలితో సాయంత్రమే 

వెచ్చని ఎడదల వెన్నెల విడిదికి 

రమ్మని పిలిచింది

అందాక దేవుణ్ణి పూజించనా

గోరంత ముద్దిచ్చి పులకించనా

అరుదైన అందాల వరమివ్వనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే


చరణం: 2


ఎదలోయిల ఎల కోయిల 

ఎదలోయిల ఎల కోయిల

వలపుల వాకిట మంగళ గీతిక 

కమ్మగ పాడింది

సిగపాయల సిరిమల్లిక 

తుమ్మెద వంటలు తేనెలు 

రుచులను పెదవికి ఇచ్చింది

పరువాల తొలి విందు అందించనా 

హృదయాలకే అంతు చూపించినా

కౌగిళ్లు మన ఇల్లు చేసెయ్యనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


- పాటల ధనుస్సు



22, జులై 2026, బుధవారం

ఇదో ప్రేమగోపురం | Ido Prema Gopuram | Song Lyrics | Bandham (1986)

 ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం

 

చిత్రం: బంధం (1986)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి. బాలు, పి. సుశీల

 

పల్లవి:


ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

చిలిపి నవ్వులతోనే

వలపు దీపాలెన్నో పెట్టాలంట 

తోడునీడా నేనై

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

 

చరణం: 1


పువ్వుతేనై నువ్వు నేనై 

ముద్దాలాడాలంటా

గాలివానై నీలో నేనై 

నీళ్ళాడాలంటా

చెదరని కుంకుమ బొట్టు

చెలిమికి వేకువ పొద్దు

మమతలే మనుగడై కలిపిన 

వలపుల కౌగిలిలో

నీ నీడలో ఆశలా 

మేడలే నిలుపనా

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

 

చరణం: 2


మేఘాలల్లే తాకంగానే 

మెరుపవ్వాలంటా

ఆకాశంలో నక్షత్రాలే 

నగలవ్వాలంటా

తరగని కాటుక కన్ను

పాపగ చేసెను నన్ను

సిరులనే అడగని

మరులులో పెరిగిన 

ప్రేమలలో

నీ పూజకే పూవునై 

పూయనా రాలనా

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

చిలిపి నవ్వులతోనే

వలపు దీపాలెన్నో పెట్టాలంట 

తోడునీడా నేనై

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

లలాలాలలాలలా

లాలాలలాలలా

లలాలాలలాలలా 

లలాలాలలాలలా


పాటల ధనుస్సు 

 

కౌసల్యా సుప్రజా రామ | Kousalya Supraja Rama | Devine Lyrics | Bandham (1986)

కౌసల్యా సుప్రజా రామ 



చిత్రం: బంధం (1986)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: దివ్య ప్రభంధముల నుండి 

గానం: పి. సుశీల, లలితా సాగరి

 

కౌసల్యా సుప్రజా రామ 

పూర్వాసంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల 

కర్తవ్యం దైవమాహ్నికం 


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద 

ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాంత 

త్రైలోక్యం మంగళం కురు  

 

మాతస్సమస్త జగతాం 

మధుకైటభారేః 

వక్షోవిహారిణి మనోహర 

దివ్యమూర్తే 


శ్రీస్వామిని శ్రితజనప్రియ 

దానశీలే 

శ్రీ వేంకటేశ దయితే 

తవ సుప్రభాతం  

 

తవ సుప్రభాత

మరవింద లోచనే 

భవతు ప్రసన్నముఖ 

చంద్రమండలే  


విధి శంకరేంద్ర 

వనితాభిరర్చితే 

వృశ శైలనాథ 

దయితే దయానిధే  


పాటల ధనుస్సు 

19, జూన్ 2026, శుక్రవారం

చెంపకు చారెడు కళ్ళమ్మా | Chempaku Charadu Kallamma | Song Lyrics | Agni Gundam (1984)

చెంపకు చారెడు కళ్ళమ్మా 


చిత్రం: అగ్నిగుండం (1984)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల  


పల్లవి : 


చెంపకు చారెడు కళ్ళమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్

చెంగుకు చాలని ఒళ్లమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్


ఒంపులసొంపుల వయ్యారమ్మా... 

చంపుకు తినకే బుల్లమ్మ

నిను చూడగనే మతిపోయిందే... 

కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..


చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంగులు చాలవు లేవయ్యో..

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..


చీకటి చాటున సింగారయ్యో.. 

సిగ్గులు దోచుకుపోకయ్యో...

తడిపొద్దులలో ఒడి చేరగనే 

పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో... 


చరణం 1 :


కన్నూ సోకిన్నాడే కట్టూ తప్పింది...

చెయ్యి తాకిన్నాడే చెంగూ జారింది...

ముట్టుకుంటే కట్టుబొట్టూ ఏమౌతాదో?


పక్కకొచ్చిన్నాడే పట్టూ తప్పింది...

గూడు దాచిన్నాడే గుట్టూ చెదిరింది...

ఒళ్లో కొస్తే ఒళ్లు కాస్తా ఏమౌతాదో?


జత కూడగనే జతులాడుకునే...

చలి వేడుకలో తొలి కోరికలే చాలే


చెంపకు చారెడు కళ్ళమ్మా..

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..


చరణం 2 :


ఈడూ వచ్చిన్నాడే ముద్దూ కోరింది...

ఇద్దరయ్యిన్నాడే పొద్దూ జారింది...

మూడూ ముళ్ళూ వేసే లోగా ఏమౌతాదో?


మీసమొచ్చిన్నాడే ఆశ పుట్టింది...

నిన్ను చూసిన్నాడే అగ్గి పుట్టింది...

కల్లోకొచ్చి కౌగిళ్లిస్తే ఎట్టుంటాదో?


పొగమంచులలో పొగరందకురో..

సొగసంచులలో వగలందుకు పోరాదా...


చెంపకు చారెడు కళ్ళమ్మా..

చెంగుకు చాలని ఒళ్లమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్


ఒంపులసొంపుల వయ్యారమ్మా... 

చంపుకు తినకే బుల్లమ్మ

నిను చూడగనే మతిపోయిందే... 

కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..


చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంగులు చాలవు లేవయ్యో..


చీకటి చాటున సింగారయ్యో.. 

సిగ్గులు దోచుకుపోకయ్యో...

తడిపొద్దులలో ఒడి చేరగనే 

పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో...


- పాటల ధనుస్సు 


14, జూన్ 2026, ఆదివారం

టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది | TikTikTik Gadiyaram | Song Lyrics | Illali Korikalu (1982)

టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది 


చిత్రం : ఇల్లాలి కోరికలు (1982)

సాహిత్యం : వేటూరి సుందర రామమూర్తి,  

సంగీతం : కె.చక్రవర్తి       

గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి,


పల్లవి : 


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది

కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది..

మానండి అల్లరి.....

మాటోకటుంది మరి.. హ్మ్మ్..

శ్రీవారికి శ్రీమతి...

ఇస్తుందో బహుమతి


హా...అబ్బాబ్బా

మొద్దు నిద్ర మీరును.. హు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది


చరణం 1:


కొత్త చీర కోప్పడుతుంది...

కొంగు కాస్త నలగక పోతే

పట్టెమంచం ములుగుతూ ఉంది...

పక్కమీకు పంచకపోతే


"అబ్బా... ఏమిటా గొడవ...

అర్ధరాత్రి నిద్రోస్తుంటేను"

"అబ్బా... ఎందుకలా అరుస్తారు"


అత్తగారు వింటారు...

మామగారు లేస్తారు..

అత్తగారు వింటారు... హే 

మామగారు లేస్తారు...

ఆడపడుచు విన్నదంటే...

ఆడిపోసుకుంటుంది...

మిమ్మల్నే లెమ్మంటుంటే...

అబ్బ లేవండి... హ..హాయ్ 


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది

కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది


మానండి అల్లరి.... హ్మ్మ్.. 

మాటోకటుంది మరి... అబ్బా 


శ్రీవారికి శ్రీమతి... హ.. 

ఇస్తుందో బహుమతి.. హ్మ్మ్.. 

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది


చరణం 2:


ఒళ్ళు నాకు బరువుగ ఉంది...

కళ్ళు తెరిచి చూడకపోతే..

సొగసు రేగి సొదగా ఉంది...

మగత నిద్ర మానకపోతే..


ఇదిగో పడుకో.. వివరాలు

తెల్లవారు చూద్దాం

అర్ధ రాత్రి ఆలాపన నువ్వూనూ 


మనసు విప్పి అడిగింది...

అలుసు చెయ్యరాదండి

మనసు విప్పి అడిగింది...

అలుసు చెయ్యరాదండి


దిండుకింద పోకచెక్క...

దండగేనా చెప్పండి..


హు.. అంతేనా ... ఛి పాడు

మహా నిద్ర మీకే వస్తున్నట్లు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది.. హు..

హే..టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్....

గడియారం పన్నెండయ్యింది.. హ్మ్మ్.. 


కొక్కొరోకొ కొక్కొరోకొ....

తెల్లారి పోతానంటోంది.. 

చాల్లేండి.. 

మానండి అల్లరి..... హ్మ్మ్..హ్మ్మ్.. 

మాటోకటుంది మరి.. మ్మ్.. 

శ్రీవారికి శ్రీమతి...

ఇవ్వాలో బహుమతి.. మ్మ్..


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్...

గడియారం పన్నెండయ్యింది

హహహహ.. మ్మ్..మ్మ్..మ్మ్ 


- పాటల ధనుస్సు 



పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు