RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sp shailaja songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sp shailaja songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2026, శనివారం

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట | Eepoddulu Yerugani | Song Lyrics | Kirayi Alludu (1984)

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట


చిత్రం: కిరాయి అల్లుడు (1984)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: వేటూరి 

గానం: ఎస్ పి బాలు, ఎస్.పి.శైలజ 


పల్లవి:


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

జతచేరి అల్లుకొంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన 


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


చరణం: 1


మధుమాసమే మనకోసము

మధుమాసమే మనకోసము

పూ పొదరింటికి పేరంటానికి 

రమ్మని పిలిచింది 

చలిగాలితో సాయంత్రమే 

వెచ్చని ఎడదల వెన్నెల విడిదికి 

రమ్మని పిలిచింది

అందాక దేవుణ్ణి పూజించనా

గోరంత ముద్దిచ్చి పులకించనా

అరుదైన అందాల వరమివ్వనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే


చరణం: 2


ఎదలోయిల ఎల కోయిల 

ఎదలోయిల ఎల కోయిల

వలపుల వాకిట మంగళ గీతిక 

కమ్మగ పాడింది

సిగపాయల సిరిమల్లిక 

తుమ్మెద వంటలు తేనెలు 

రుచులను పెదవికి ఇచ్చింది

పరువాల తొలి విందు అందించనా 

హృదయాలకే అంతు చూపించినా

కౌగిళ్లు మన ఇల్లు చేసెయ్యనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


- పాటల ధనుస్సు



14, డిసెంబర్ 2025, ఆదివారం

జై చిరంజీవా జగదేక వీరా | Jai Chiranjeeva Jagadekaveera | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

జై చిరంజీవా జగదేక వీరా


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: ఎస్. పి. శైలజ 


పల్లవి: 


ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. 

జై చిరంజీవా.. జగదేక వీరా.. 

జై చిరంజీవా జగదేక వీరా 

అసహాయ శూరా అంజని కుమారా 

జై చిరంజీవా జగదేక వీరా 

అసహాయ శూరా అంజని కుమారా 

దీవించ రావయ్య వాయు సంచారా 

రక్షించవేలయ్య శ్రీరామ దూత 

జై చిరంజీవా.. 


చరణం 1: 


వీరాంజనేయా శూరాంజనేయ 

ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా 

జై చిరంజీవా.. 

ఆరోగ్యదాతా అభయ ప్రదాతా..ఆ... 

ఆరోగ్యదాతా అభయ ప్రదాతా 

ఉన్మాద భయ జాడ్య పీడా నివారా 

సంజీవి గిరివాహా.. సానీరిసాహ 

సంజీవి గిరివాహ సానీరిసాహొ 

జై చిరంజీవా.. జగదేక వీరా.. 


జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా


- పాటల ధనుస్సు 


7, ఆగస్టు 2025, గురువారం

అంతర్యామి అలసితి సొలసితి | Antaryami Alasiti Solasiti | Song Lyrics | Annamayya (1997)

అంతర్యామి అలసితి సొలసితి 


చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్ పి శైలజ 


పల్లవి :


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి అలసితి సొలసితి


చరణం 1 :


కోరిన కోర్కెలు కోయని కట్లు 

తీరవు నీవవి తెంచక

కోరిన కోర్కెలు కోయని కట్లు 

తీరవు నీవవి తెంచక

భారపు పగ్గాలు పాపపుణ్యములు

భారపు పగ్గాలు పాపపుణ్యములు 

నెరుపున బోవు నీవు వద్దనక


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి


చరణం 2 :


మదిలో చింతలు మయిలాలు 

మణుగులు వదలవు నీవవి వద్దనక

మదిలో చింతలు మయిలాలు 

మణుగులు వదలవు నీవవి వద్దనక


ఎదుటనే శ్రీవెంకటేశ్వర 

వెంకటేశా శ్రీనివాస ప్రభు

ఎదుటనే శ్రీవెంకటేశ్వర నీ వాదీ 

వాదనగాచితివి అట్ఠిట్ఠానక


అంతర్యామి అలసితి సొలసితి 

ఇంతటి నీ శారనిదే చొచ్చితిని

అంతర్యామి అంతర్యామి 

అంతర్యామి అంతర్యామి 

అంతర్యామి

అలసితి


- పాటల ధనుస్సు 


14, జూన్ 2025, శనివారం

అల్లిబిల్లి అందమంతా | Allibilli Andamantha | Song Lyrics | Bhogi Mantalu (1981)

అల్లిబిల్లి అందమంతా



చిత్రం  :  భోగి మంటలు (1981)

సంగీతం  : రమేశ్ నాయుడు

గీతరచయిత  : వేటూరి

నేపథ్య గానం :  బాలు, శైలజ


పల్లవి :


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే సొంతమంటా..

కల్లబొల్లి మాటలంటే.. 

హా.. హా.. హా.. హా..రపప.. పా..

కల్లబొల్లి మాటలంటే...  

ఒల్లనంటా.. వెళ్ళమంటా

హా.. హా.... హా...


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే అల్లుడంట

మళ్ళీ మళ్ళీ అందమంటా...

హా.. హా.. హా.. హా..పప.. పా..

మళ్ళీ మళ్ళీ అందమంటా.. 

అందకుంటే.. గిల్లుడంట

ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్


చరణం 1 :


చుక్కదీపమెట్టుకున్నాక.. 

దిక్కులన్నీ ఒక్కటయ్యాక..

హే.. హే.. లలలాలాలాలా...

చుక్కదీపమెట్టుకున్నాక.. 

దిక్కులన్నీ ఒక్కటయ్యాక..

ఈ రేయి విందులో.. 

ఆరెయ్యి అందమే...

వెయ్యకుంటే ఒట్టంటా.. 

ఒట్టెయ్యకుంటే ఒట్టంట..


హా.. ఆ..

చందమామ నిద్దరోయాక.. 

సందడంత సద్దుమణిగాక..


చందమామ నిద్దరోయాక.. హాహహా.. 

సందడంత సద్దుమణిగాక..

నచ్చేటివాడితో.. మెచ్చేటి మాటుంది

ఇచ్చినంత ఒట్టంట.. 

ముద్దిచ్చినత ఒట్టంట


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే అల్లుడంట

కల్లబొల్లి మాటలంటే.. 

హా.. హా.. రురురురు..

కల్లబొల్లి మాటలంటే...  

ఒల్లనంటా.. వెళ్ళమంటా

హా.. హా.... హా...


చరణం 2 :


అందినంత పుచ్చుకున్నాక... 

అల్లరంత చల్లబడ్డాక

హేహే..జుజుజుజుజు..

అందినత పుచ్చుకున్నాక... 

అల్లరంత చల్లబడ్డాక

ఈ నాటి కౌగిలీ...ఈ.. ఈ.. 

ఈ రాత్రి  జాబిలి..

వదులుకో వద్దంట.. 

నన్నొదులుకో వద్దంట


హ.. ఆ.. అందమంత ఆవిరయ్యాక...  

పిండమబ్బుచిందులయ్యాక... 

హేహేహే.. రరరరరర

అందమంత ఆవిరయ్యాక... 

హహహహా...  

పిండమబ్బుచిందులయ్యాక

వరదంటి వయసుని... 

సరదాల సొగసుని

వలపుగా ఇమ్మంట.. 

నీ వలపుగా ఇమ్మంట


అల్లిబిల్లి అందమంతా.. 

అల్లుకుంటే సొంతమంటా..

మళ్ళీ మళ్ళీ అందమంటా...

హా.. హా.. హా.. హా..పప.. పా..

మళ్ళీ మళ్ళీ అందమంటా.. 

అందకుంటే.. గిల్లుడంట

ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్  


- పాటల ధనుస్సు 


ఓ బాటసారి ఇది జీవిత రహదారి | O Batasari Idi Jeevitha Rahadari | Song Lyrics | Illalu (1981)

ఓ బాటసారి ఇది జీవిత రహదారి



చిత్రం :  ఇల్లాలు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ,

నేపధ్య గానం  : కె.జె.యేసుదాస్, ఎస్ పి శైలజ 


పల్లవి :


ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో

ఎవరు ఎరుగని దారి ఇది

ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..


చరణం 1 :


ఎవరు ఎవరికి తోడౌతారో.... 

ఎప్పుడెందుకు విడిపోతారో

మమతను కాదని వెళతారో... 

మనసే చాలని ఉంటారు

ఎవ్వరి పయనం ఎందాకో...

అడగదు ఎవ్వరిని... 

బదులే దొరకదని

అడగదు ఎవ్వరిని... 

బదులే దొరకదని


చరణం 2 :


కడుపుతీపికి రుజువేముందీ... 

అంతకు మించిన నిజమేముందీ...

కాయే చెట్టుకు బరువైతే.... 

చెట్టును భూమి మోస్తుందా..

ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... 

జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :


తెంచుకుంటివి అనుబంధాన్ని... 

పెంచుకున్నదొక హృదయం దాన్ని..

అమ్మలిద్దరు వుంటారని 

అనుకోలేని పసివాడ్ని

బలవంతాన తెచ్చుకొని... 

తల్లివి కాగలవా? ... 

తనయుడు కాగలడా?


చరణం 4 :


అడ్డ దారిలో వచ్చావమ్మా... 

అనుకోకుండా కలిసావమ్మ

నెత్తురు పంచి ఇచ్చావూ... 

నిప్పును నీవే మింగావూ

ఆడదాని ఐశ్వర్యమేమిటో...

ఇప్పుడు తెలిసింది..

కథ ముగిసేపొయింది

ఇప్పుడు తెలిసింది..

కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ ఇది జీవిత రహదారీ


- పాటల ధనుస్సు 


12, డిసెంబర్ 2024, గురువారం

చలాకి చిన్నది వుంది | Chalaki Chinnadi Vundi | Song Lyrics | Nayakudu (1987)

చలాకి చిన్నది వుంది



చిత్రం: నాయకుడు (1987) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత : రాజశ్రీ 

నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ 


పల్లవి: 


హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య 

హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య 

చలాకి చిన్నది వుంది ...

మజాలకు రమ్మంటుంది 

చలాకి చిన్నది వుంది ...

మజాలకు రమ్మంటుంది 

ఒకే ఒకటి ఇమ్మంటుంది.... 

హొయ్యా హొయ్... 

అది ఏందది హొయ్ 

మసకేళ చూడు... నీకుంది తోడు 

రాచిలక అందం... రాతిరికే సొంతం 


చలాకి చిన్నది వుంది....

మజాలకు రమ్మంటుంది 

ఒకే ఒకటి ఇమ్మంటుంది...

హొయ్యా హొయ్.. 

అది ఏందది హొయ్ 


చరణం 1: 


చూపులలోన చుక్కలు చూడాలి.. 

తజుం తజుం తజుం 

నీ చేతలలోన దిక్కులు అదరాలి.. 

తజుం తజుం తజుం 

అరె...చూపులలోన చుక్కలు చూడాలి.. 

తజుం తజుం తజుం 

నీ చేతలలోన దిక్కులు అదరాలి ...

తజుం తజుం తజుం 


మోజులమాటున కసికసిగా 

ముద్దుల దొంతరివ్వాలి.. 

వెచ్చని వన్నెల చాటున నే 

ముచ్చటలాడుకోవాలి.. 

నువ్వు ఆడాలి.. నే పాడాలి.. 

పడవూగాలి హొయ్.. 


చలాకి చిన్నది వుంది....

మజాలకు రమ్మంటుంది 

ఒకే ఒకటి ఇమ్మంటుంది...

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్ 

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్ 


చరణం 2: 


కోకా రైకా గుసగుసలాడేనే ..

తజుం తజుం తజుం 

నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. 

తజుం తజుం తజుం 

కోకా రైకా గుసగుసలాడేనే ..

తజుం తజుం తజుం 

నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే ..

తజుం తజుం తజుం 


నీలో ఒదిగి నిలువెల్లా ..

అల్లుకుపోతా సిలకమ్మ 

గూటికి చేరే గువ్వల్లే ..

ఒడిలో వాలవె చిట్టెమ్మ 

నువ్వు ఆడాలి ..నే పాడాలి... 

పడవూగాలి హొయ్.. 


చలాకి చిన్నది వుంది....

మజాలకు రమ్మంటుంది 

చలాకి చిన్నది వుంది....

మజాలకు రమ్మంటుంది 

ఒకే ఒకటి ఇమ్మంటుంది...

హొయ్యా హొయ్.. 

అది ఏందది హొయ్.. 


మసకేళ చూడు... నీకుంది తోడు 

రాచిలక అందం... రాతిరికే సొంతం 


చలాకి చిన్నది వుంది....

మజాలకు రమ్మంటుంది 

ఒకే ఒకటి ఇమ్మంటుంది...

హొయ్యా హొయ్.. 

అది ఏందది హొయ్.... 


హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.... 

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.... 

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.... 

హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్


- పాటల ధనుస్సు 


21, నవంబర్ 2024, గురువారం

అందాలొలికే సుందరి | Andalolike Sundari | Song Lyrics | Premasagaram (1983)

అందాలొలికే సుందరి



చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి. రాజేందర్

గీతరచయిత : రాజశ్రీ

నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ


పల్లవి:


ఏలేలమ్మ ఏలేలమ్మ 

ఏలేలమ్మ హొయ్

ఏలేలమ్మ ఏలేలమ్మ 

ఏలేలమ్మ హొయ్


అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే దొచేను


అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే దొచేను


రతి నీవే శశి నీవే 

సుధ నీవే దేవి

నీ తలపే నీ పిలుపే 

నీ వలపే నావి


అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే దొచేను


చరణం 1:


గాలుల గారాలే చెలి 

కులుకున నిలిపినది

మెరుపుల మిసమిసలె 

మేఘలకు తెలిపినది

ముద్దు మోములో కొటి 

మోహములు చిలికేను 

నా చెలి కనులే

సింధు భైరవిని 

చిలక పలుకుల 

దోర పెదవులే పలికే..ఏ..ఏ...

ప్రేమ యువకుల 

పాలిట ఒక వరం

అది వలచిన 

మనసుల అభినయం

ప్రేమ యువకుల 

పాలిట ఒక వరం

అది వలచిన 

మనసుల అభినయం

లాలాలల లాలాలల

లాలాలల లాలాలల


అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే దొచేను


చరణం 2:


అప్సరా ఆడెనే... 

అందలే మ్రోగెనే ..

మరులు విరిసి 

పలకరించె మనసు

కలలు మురిసి 

పులకరించె వయసు

కన్నులు కులికెను 

కవితలు పలికెను

పాదము కదిలెను 

భావము తెలిసెను

అదే కదా అనుక్షణం చెరగని

సల్లాపమే ఉల్లాసమే ఆ నగవు ...


మోహము కొనసాగే 

తొలి మోజులు చెలరేగే

నా పాటకు పల్లవిలా 

చెలి పొంగెను వెల్లువలా

అమరవాణి ఇది అందాల గని 

ఇది నవతరానికే ఆధారం

మధుర మధుర సుకుమార 

ప్రణయ రసలోక తరంగిణి 

చెలి స్నేహం ఆ..ఆ..


పలవరింతలు రేపెను కోటి ...

ఆమె కెవరు లేరిక సాటి

పలవరింతలు రేపెను కోటి ..

ఆమె కెవరు లేరిక సాటి

లాలాలల లాలాలల

లాలాలల లాలాలల


అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే ఇచ్చేను


రతి నీవే శశి నీవే 

సుధ నీవే దేవి

నీ తలపే నీ పిలుపే 

నీ వలపే నావి

అందాలొలికే సుందరి 

రాతిరి కలలో వచ్చేను

పున్నమి వెన్నెల వన్నెలు 

చిలికి మనసే దొచేను 


- పాటల ధనుస్సు 


23, అక్టోబర్ 2024, బుధవారం

ఏదో తెలియని బంధమిది | Edo Teliyani Bandhamidi | Song Lyrics | Nayakudu (1987)

ఏదో తెలియని బంధమిది



చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా 

నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ  

గీతరచయిత : వేటూరి సుందరరామమూర్తి 


పల్లవి :


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 1 :


పూజకు నోచని పువ్వును కోరి

వలచిన స్వామివి నువ్వేలే...

రూపం లేని అనురాగానికి

ఊపిరి నీ చిరు నవ్వేలే...

కోవెల లేనీ....

కోవెల లేని దేవుడవు...

గుండెల గుడిలో వెలిశావు...ఊ..

పలికే జీవన సంగీతానికి

వలపుల స్వరమై ఒదిగావు...

తనువూ మనసూ ఇక నీవే... 


ఏదో తెలియని బంధమిది 

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది


చరణం 2:


వేసవి దారుల వేసటిలోన

వెన్నెల తోడై కలిశావు...

పూచే మల్లెల తీగకు నేడు

పందిరి నీవై నిలిచావు...

ఆశలు రాలే...ఏ..ఏ

ఆశలు రాలే శిశిరంలో...ఓ..

ఆమని నీవై వెలిశావు...ఊ..

ఆలుమగల అద్వైతానికి

అర్థం నీవై నిలిచావు...

తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ


ఏదో తెలియని బంధమిది

ఏదో తెలియని బంధమిది

ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..

ఏదో తెలియని బంధమిది హా..ఆ


- పాటల ధనుస్సు 

8, అక్టోబర్ 2024, మంగళవారం

మావయ్య అన్న పిలుపు | Mavayya Anna Pilupu | Song Lyrics | Muddula Mavayya (1989)

మావయ్య అన్న పిలుపు



చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు, పి సుశీల, ఎస్ పి శైలజ


పల్లవి :


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు

మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


కమ్మగా పాడనా కంటిపాప జోల

కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


చరణం 1 :


అరచేత పెంచాను చెల్లిని

ఈ అరుదైన బంగారు తల్లిని

అడుగేస్తే పాదాలు కందవా

నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా


అమ్మగా లాలించాడు

నిన్ను నాన్నగా పాలించాడు

అన్నగా ప్రేమించాడు 

అన్నీ తానైనాడు


తన ప్రాణంగా నను పెంచాడు

ఆ దైవంగా దీవించాడు

నా అన్నలాంటి అన్న 

ఈ లోకాన లేడు


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు

మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


చరణం 2 :


ఆరేడు మాసాలు నిండగా

ఈ అన్నయ్య కలలన్నీ పండగా

తేవాలి బంగారు ఊయల

కావాలి మా ఇల్లు కోవెల

రెప్పగా నిను కాచనా

పాపగా నిను చూడనా

రేపటి ఆశ తీరగా

నీ పాపకు జోల పాడనా


ఇది అరుదైన ఓ అన్న కథ

ఇది మురిపాల ఓ చెల్లి కథ

ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


కమ్మగా పాడనా కంటిపాప జోల

కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


మావయ్య అన్న పిలుపు

మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు