అందాలొలికే సుందరి
చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ
పల్లవి:
ఏలేలమ్మ ఏలేలమ్మ
ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ
ఏలేలమ్మ హొయ్
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే
సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే
నీ వలపే నావి
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే దొచేను
చరణం 1:
గాలుల గారాలే చెలి
కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలె
మేఘలకు తెలిపినది
ముద్దు మోములో కొటి
మోహములు చిలికేను
నా చెలి కనులే
సింధు భైరవిని
చిలక పలుకుల
దోర పెదవులే పలికే..ఏ..ఏ...
ప్రేమ యువకుల
పాలిట ఒక వరం
అది వలచిన
మనసుల అభినయం
ప్రేమ యువకుల
పాలిట ఒక వరం
అది వలచిన
మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే దొచేను
చరణం 2:
అప్సరా ఆడెనే...
అందలే మ్రోగెనే ..
మరులు విరిసి
పలకరించె మనసు
కలలు మురిసి
పులకరించె వయసు
కన్నులు కులికెను
కవితలు పలికెను
పాదము కదిలెను
భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవు ...
మోహము కొనసాగే
తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా
చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని
ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార
ప్రణయ రసలోక తరంగిణి
చెలి స్నేహం ఆ..ఆ..
పలవరింతలు రేపెను కోటి ...
ఆమె కెవరు లేరిక సాటి
పలవరింతలు రేపెను కోటి ..
ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే ఇచ్చేను
రతి నీవే శశి నీవే
సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే
నీ వలపే నావి
అందాలొలికే సుందరి
రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు
చిలికి మనసే దొచేను
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి