RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, నవంబర్ 2024, శనివారం

నేను పుట్టాను లోకం మెచ్చింది | Nenu Puttanu Ee Lokam | Song Lyrics | Premanagar (1971)

నేను పుట్టాను లోకం మెచ్చింది



చిత్రం  :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 

డోంట్ కేర్.. 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 

డోంట్ కేర్.. 


చరణం 1:


నేను తాగితే కొందరి కళ్లు 

గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు 

వంతలు పాడాయి

నేను తాగితే కొందరి కళ్లు 

గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు 

వంతలు పాడాయి


నేను ఆడితే అందరి కాళ్లు 

నాతో కలిశాయి 

నేను ఆడితే అందరి కాళ్లు 

నాతో కలిశాయి

తెల్లవారితే వెనకన చేరి 

నవ్వుకుంటాయి..

హ హ హ హ హ... డోంట్ కేర్...


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 


చరణం 2:


మనసులు దాచేటందుకు 

పైపై నవ్వులు ఉన్నాయి

మనిషికి లేని అందం కోసం 

రంగులు ఉన్నాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి 

చేతులు వస్తాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి 

చేతులు వస్తాయి

ఎదుటి మనిషికి చెప్పేటందుకే 

నీతులు ఉన్నాయి..

డోంట్ కేర్....


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  


చరణం 3:


మనిషిని మనిషిని కలిపేటందుకే 

పెదవులు ఉన్నాయి

పెదవులు మధురం చేసేటందుకే 

మధువులు ఉన్నాయి

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

అగ్గిపుల్ల గీసేసెయ్ 

నీలో సైతాన్ తరిమేసేయ్..

డ్రైవ్ ది డెవిల్ అవుట్..

హ హ హ హ హ హ... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  

డోంట్ కేర్....


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు