కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ...
కన్నెపిల్ల.. ఆ ఆ..
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ...
గడుసుపిల్లడు.. ఊ ఊ..
వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
చరణం 1:
పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికలంత నడుము చుట్టు
పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే...చూడాలి..
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
చరణం 2:
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన..కండరాలు..
బిరుసైనా కండరాలు..
మెరిసేటి కళ్ళడాలు
వస్తుంటే.. చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు
నా కొళ్ళు తెలవదు
చరణం 3:
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
దున్నుతుంటే ...చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
చరణం 4:
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు
నా కొళ్ళు తెలవదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి