నాలోన వలపుంది
చిత్రం : బంగారు కలలు (1974)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నాలోన వలపుంది..
మీలోన వయసుంది..హా.. అహా..
ఈ రేయెంతో సొగసైనదీ
అహా... నాలోన వలపుంది..
మీలోన వయసుంది..
హా.. అహా.. హా.. ఒహొ.. హో
ఈ రేయెంతో సొగసైనదీ
చరణం 1 :
కన్నుల్లో కైపుంది..
చేతుల్లో మధువుంది
కన్నుల్లో కైపుంది..
చేతుల్లో మధువుంది
తనువూ.. మనసూ..
పొంగే వేళ
నాట్యాల అలరించి...
స్వప్నాల తేలించు
నాట్యాల అలరించి...
స్వప్నాల తేలించు
నీ రాణి నేనే..
నా రాజు నీవే
అహా... నాలోన వలపుంది..
మీలోన వయసుంది..
హా.. అహా.. హా.. ఒహొ.. హో
ఈ రేయెంతో సొగసైనదీ
చరణం 2 :
నావారినే వీడి మీచెంతనే చేరి..
ఆడీ.. పాడీ జీవించేను
నావారినే వీడి మీచెంతనే చేరి..
ఆడీ.. పాడీ జీవించేను
వెతలన్ని మరిపించి..
మురిపాలు కురిపించు...
వెతలన్ని మరిపించి..
మురిపాలు కురిపించు
ప్రియురాలు నేనే..
జవరాలు నేనే..
అహా... నాలోన వలపుంది..
మీలోన వయసుంది..
హా.. అహా.. హా.. ఒహొ.. హో
ఈ రేయెంతో సొగసైనదీ
అహా... నాలోన వలపుంది..
మీలోన వయసుంది..
హా.. అహా.. హా.. ఒహొ.. హో
ఈ రేయెంతో సొగసైనదీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి