RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, నవంబర్ 2024, శనివారం

మనసు గతి ఇంతే | Manasu gati inte | Song Lyrics | Premanagar (1971)

మనసు గతి ఇంతే



చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


సాకి :


తాగితే మరచిపోగలను... 

తాగనివ్వదు

మర్చిపోతే తాగగలను... 

మరువనివ్వదు


పల్లవి:


మనసు గతి ఇంతే 

మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ 

సుఖము లేదంతే


మనసు గతి ఇంతే 

మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ 

సుఖము లేదంతే

మనసు గతి ఇంతే ...


చరణం 1:


ఒకరికిస్తే మరలి రాదూ ..

ఓడిపోతే మరిచిపోదూ

ఒకరికిస్తే మరలి రాదూ ..

ఓడిపోతే మరిచిపోదూ

గాయమైతే మాసిపోదూ ... 

పగిలిపోతే అతుకుపడదూ


మనసు గతి ఇంతే ..

మనిషి బ్రతుకింతే..

మనసు గతి ఇంతే 


చరణం 2:


అంతా మట్టేనని తెలుసూ... 

అదీ ఒక మాయేనని తెలుసూ

అంతా మట్టేనని తెలుసూ ... 

అదీ ఒక మాయేనని తెలుసూ

తెలిసీ వలచీ విలపించుటలో ... 

తీయదనం ఎవరికి తెలుసూ 


మనసు గతి ఇంతే ..

మనిషి బ్రతుకింతే...

మనసు గతి ఇంతే


చరణం 3:


మరుజన్మ ఉన్నదో లేదో ...

ఈ మమతలప్పుడేమౌతాయో

మరుజన్మ ఉన్నదో లేదో ... 

ఈ మమతలప్పుడేమౌతాయో

మనిషికి మనసే తీరని శిక్షా... 

దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా


మనసు గతి ఇంతే ..

మనిషి బ్రతుకింతే..

మనసున్న మనిషికీ 

సుఖము లేదంతే

మనసు గతి ఇంతే


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు