RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, నవంబర్ 2024, ఆదివారం

కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి | Kothaga Pellaina Kurravadiki | Song Lyrics | Chakravakam (1974)

కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి



చిత్రం  :   చక్రవాకం (1974)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల, రామకృష్ణ


పల్లవి :


కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. 

పట్టపగలె తొందర. .  

పండగుంది ముందర


కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. 

పట్టరాని తొందర.. 

పట్టుకుంటె బిత్తర  


చరణం 1 :


కొంగుచాటులో వయసు 

పొంగులన్ని దాచావు.. 

కోలకళ్ళ జాడలో 

గుట్టు కాస్త చెప్పావు


కొంగుచాటులో వయసు 

పొంగులన్ని దాచావు.. 

కోలకళ్ళ జాడలో 

గుట్టు కాస్త చెప్పావు


కోరి వలచి వచ్చాను.. 

నీ కోసమెన్నొ తెచ్చాను

కోరి వలచి వచ్చాను . . . 

నీ కోసమెన్నొ తెచ్చాను

గుట్టు చప్పుడు లేక.. 

నీ సొంతమే చేసుకో


కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. 

పట్టపగలె తొందర.. 

పట్టుకుంటె బిత్తర      

          

చరణం 2 :


నింగి వంగి వచ్చిందీ.. 

నిన్ను చూచేటందుకు

నేల పచ్చిక పరచింది..  

నీవు నడిచేటందుకు


నింగి వంగి వచ్చిందీ.. 

నిన్ను చూచేటందుకు

నేల పచ్చిక పరచింది.. 

నీవు నడిచేటందుకు


మంచు జల్లు కురిసింది 

చలి పుట్టేటందుకు.. 

మబ్బు చాటు చేసింది.. 

గిలి తీరేటందుకు.. 

మబ్బు చాటు చేసింది..  

గిలి తీరేటందుకు     

          

కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. 

పట్టరాని తొందర.. 

పండగుంది ముందర


చరణం 3 :


అల్లరి కళ్ళకు నల్లని కాటుక.. 

హద్దులే గీచావు ఎందుకూ

కళ్ళకు కాటుకే చల్లదనం.. 

హద్దులో ఆడదుంటె చక్కదనం

చీర కట్టులో ఎన్ని గమ్మత్తులు.. 

చిగురాకు పెదవుల్లో ఎన్ని మత్తులు

బిగి కౌగిలింతలో కొత్తకొత్తలు.. 

ప్రేమ బాటంతా పూలగుత్తులు      


కొత్తగా పెళ్ళైన కుర్రదానికి.. 

పట్టరాని తొందర.. 

పట్టుకుంటె బిత్తర            


కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి.. 

పట్టపగలె తొందర.. 

పండగుంది ముందర


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు