RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, నవంబర్ 2024, శుక్రవారం

ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం | Fifty Fifty Sagam Sagam | Song Lyrics | Pavitra Bandham (1971)

ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం



చిత్రం:  పవిత్ర బంధం (1971)

సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత:  ఆరుద్ర

నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల


పల్లవి :


ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ

సగం సగం.. నిజం నిజం

నీవో సగం.. నేనో సగం

నీవో సగం.. నేనో సగం

సగాలు రెండూ.. ఒకటైపోతే

జగానికే ఒక.. నిండుదనం

నిజం నిజం.. నిజం నిజం... 

ఫిఫ్టీ..ఫిఫ్టీ


చరణం 1 : 

       

నీవే నాదం.. నేనే గీతం

నీవే నాదం.. నేనే గీతం

నీ నా కలయిక.. సంగీతం

నీ నా కలయిక.. సంగీతం

నీవే నింగి.. నేనే నేల

నీవే నింగి.. నేనే నేల


నిండు విలీనమే.. ఈ భువనం 

నీవే కుసుమం.. నీవే భ్రమరం

పువ్వూ తుమ్మెద.. ఒకటైపోతే

జగానికే ఒక.. కమ్మదనం


నిజం నిజం.. నిజం నిజం

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  


చరణం 2 :


రాధ సగం.. మాధవుడు సగం

రాధ సగం.. మాధవుడు సగం

రాసవిహారమే.. ప్రణయమయం

రాసవిహారమే.. ప్రణయమయం


గౌరి సగం.. శివుడు సగం

గౌరి సగం.. శివుడు సగం

అర్ధనారీశ్వరమే.. అఖిల జగం 

అవినాభావం.. అమృతరావం

అభేద రూపం.. స్థిరమైపోతే

జగానికే ఒక  అమర పథం 


నిజం నిజం.. నిజం నిజం .. 

ఫిఫ్టీ...ఫిఫ్టీ


సగం సగం.. నిజం నిజం

నీవో సగం.. నేనో సగం

సగాలు రెండూ ఒకటైపోతే

జగానికే ఒక నిండుదనం

ఫిఫ్టీ..ఫిఫ్టీ.. ఫిఫ్టీ..ఫిఫ్టీ


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు