RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, నవంబర్ 2024, ఆదివారం

ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి | Evaro Raavali | Song Lyrics | Premanagar (1971)

ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


ఆ... ఆ... ఆ... ఆ...

ఎవరో రావాలి..

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి....


చరణం 1:


మూల దాగి ధూళి మూగి... 

మూగవోయిన మధుర వీణ..

మూల దాగి ధూళి మూగి... 

మూగవోయిన మధుర వీణ..

మరిచి పోయిన మమత లాగ...

మరిచి పోయిన మమత లాగ... 

మమతలుడిగిన మనసు లాగ

మాసిపో.. తగునా...

ఎవరో రావాలి....


చరణం 2:


ఎన్ని పదములు నేర్చినావో... 

ఎన్ని కళలను దాచినావో..

ఎన్ని పదములు నేర్చినావో... 

ఎన్ని కళలను దాచినావో..

కొనగోట మీటిన చాలు...

కొనగోట మీటిన చాలు... 

నీలో కోటి స్వరములు పలుకును..


ఎవరో రావాలి.....


చరణం 3:


రాచనగరున వెలసినావు... 

రస పిపాసకు నోచినావు

రాచనగరున వెలసినావు... 

రస పిపాసకు నోచినావు

శక్తి మరచి.. రక్తి విడచి...

శక్తి మరచి.. రక్తి విడచి... 

మత్తు ఏదో మరగినావు

మరిచిపో... తగునా...


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి.... 


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు